Andhra Pradesh:ఫైన్ కడతాం కానీ.. ఫీజులు తగ్గించం.. ఈ దోపిడీకి అడ్డుకట్ట పడదా..?

ప్రతీకాత్మకచిత్రం

కరోనా వైద్యం పేరు చెప్పి కాసులు దండుకోవడం.. అధికారులు వచ్చేసరికి ఫైన్ కట్టి తప్పించుకోవడం ప్రస్తుతం ఏపీలో ప్రైవేట్ ఆస్పత్రుల తీరు ఇలాగే ఉంది.

 • Share this:
  Anna Raghu, Guntur Correspondent, News18

  గడచిన రెండు నెలలుగా మన రాష్ట్రంలో కరోన వైరస్ రెండవ దశ విజృంభణ ఎంత భీభత్సం సృష్తిస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. కరోన పాజిటివ్ వచ్చిందంటే ఇక ఆమనిషి ప్రాణాలతో బయటపడటనమే చాలా గొప్ప అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.ప్రజల ప్రాణ భయాన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు, కోవిడ్ బాధితుల వద్ద నుండి లక్షలకు లక్షలు అడ్వాన్స్ కట్టించుకుని మరీ చికిత్స చేస్తున్నారు. పేషెంట్ అదృష్టం బాగుండి బ్రతికి బట్టకడితే అదనంగా మరో రెండు మూడు లక్షలు కట్టించుకుని డిశ్చార్జ్ చేస్తున్నారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అదే పేషెంట్ మృతి చెందితే ముందుగా కట్టిన అడ్వాన్సు డబ్బు నుండి జమచేసుకోవచ్చు. ఐతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ బారిన పడిన ఏ ఒక్కరూ డబ్బులు లేక వైద్యం అందక చనిపోకూడదు అనే సదుద్దేశ్యంతో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చడం జరిగింది. ఐతే ఆచరణలో మాత్రం ఆరోగ్యశ్రీ క్రింద వైద్యం చేస్తున్న హాస్పిటల్స్ దాదాపుగా లేవనే చెప్పాలి. ఆరోగ్యశ్రీ క్రింద ఎవరైనా వైద్యం కోరితే హాస్పిటల్స్ నుండి మొట్టమొదట వచ్చే సమాధానం బెడ్లు ఖాళీలేవు. డబ్బులు కట్టి చేరిన వారికి మాత్రం బెడ్లు వెంటనే అందుబాటులోకి వస్తున్నాయి. ఐతే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు తాముకట్టించుకునే ఫీజులో ఓ పది శాతం రాయితీ ఇచ్చి వారి పేరుమీద ఆరోగ్యశ్రీ నగదు కూడా కొందరు హాస్పిటల్స్ వారు క్లైమ్ చేసుకుంటున్నారు అనేఆరోపణలు లేకపోలేదు.

  ప్రతి హాస్పిటల్ కు ఒక నోడల్ ఆఫీసర్ ని నియమించినప్పటికీ వారివల్ల ప్రయోజనం సెన్యం అనేచెప్పాలి. దీనంతటికీ కారణం తమ హాస్పిటల్ కు వచ్చే నోడల్ ఆఫీసర్ల నోళ్ళును నోట్లతో నొక్కేసి, తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనేది కాదనలేని సత్యం. ఇక కోవిడ్ వైద్యానికి ప్రభుత్వ అనుమతులు ఉండి కొంతమంది,అనుమతులు లేకుండా మరికొన్ని వైద్యశాలల్లో వైద్యం చేస్తున్నారు. ఆయా హాస్పిటళ్ళపై అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి వెళ్ళడం, సదరు ఫిర్యాదులపై స్పందించిన అధికారులు చాలావరకు హాస్పిటల్స్ పై దాడులు కూడా జరపడం చకచకా జరిగిపోయాయి.

  ఇది చదవండి: అలిపిరి కాలినడక మార్గం విశిష్టతలివే..! చరిత్ర ఏం చెబుతోందంటే.!  ఐతే ఇక్కడే అసలు కథ మొదలౌద్ది..హాస్పిటల్స్ పై దాడులు చేసిన అధికారులు ఆయా హాస్పిటల్స్ లో జరుగుతున్న అక్రమాలు, సదుపాయలేమి గురించి ఎక్కడా ప్రస్తావించరు. ఎవరైనా అడిగితే నివేదికను తమ పై అధికారులకు పంపుతామంటూ మీడియా ఎదుట చిలకపలుకులు పలుకుతారు. ఉద్దేశ్య పూర్వకంగా ఎంతో కీలకమైన సాక్ష్యాధారాలను వదిలేస్తారు. కేసులలో అతికీలక మైన సి.సి.టి.వి ఫుటేజ్ లను మరికొన్ని సాంకేతిక ఆధారాలను సైతం ఉద్డేశ్యపూర్వకంగా వదిలేస్తారు. అదేమని అడిగితే అది మాపని కాదంటే మాపని కాదంటూ వైద్య ఆరోగ్య శాఖ, విజిలెన్స్ మరియు పోలీస్ శాఖ వారు ఒకరిపై ఒకరు చాడీలు చెప్పి తప్పించుకుంటారు.

  ఇది చదవండి: పోలవరం నిర్మాణంలో కీలక ఘట్టం.. ఇంజనీరింగ్ అద్భుతమే ఇది..


  వీటికి తోడు రాజకీయ ఒత్తిళ్ళు, లంచాలతో అధికారులు చూసీ చూడకుండా వదిలేస్తున్నారు అనే ఆరోపణలూ లేక పోలేదు.కనీసం ఇరవై మందికి వైద్యం చేసే కెపాసిటీ కలిగిన ఒక్కో హాస్పిటల్ రోజుకు ఇరవై నుండి ముఫ్ఫైలక్షల వరకూ సంపాదన ఉండటంతో వారు ఎంతటి అక్రమాలకైనా పాల్పడుతున్నారనేది కాదనలేనిసత్యం.ఇంతటి విపత్కర పరిస్థితులలో సైతణ ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వని ప్రైవేట్ హాస్పిటల్స్ ని కట్టడి చేయకపోతే రాబోయో రోజులలో ప్రజలు మరింత ఇబ్బందిపడే అవకాశం ఉంది.

  ప్రజల ను రాబందుల్లా పీక్కుతింటున్న ప్రైవేటు హాస్పిటల్స్ ని ప్రభుత్వం నియంత్రించలేకపోవడం వల్లనే ప్రజలు కృష్ణపట్నం ఆనందయ్య వంటి వారివైపు పరుగులు తీస్తున్నారు. రానున్నరోజులలో ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీ పట్ల ప్రభుత్వం ఇలాగే ఉదాసీనత చూపిస్తే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేక భావన ఏర్పడే అవకాశంఉందనేది కాదనలేని సత్యం.
  Published by:Purna Chandra
  First published: