Home /News /andhra-pradesh /

GUNTUR NESTHAM SEVA SAMSTHA PROVIDING WATER AND FOOD FOR WILD ANIMALS IN NALLAMALA FOREST OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Andhra Pradesh: వన్యప్రాణులకు సరికొత్త నేస్తం.. మండువేసవిలో దాహర్తి తీర్చే దైవం..

నల్లమల అడవుల్లో మూగజీవాల దాహార్తి తీరుస్తున్న నేస్తం సేవా సంస్థ

నల్లమల అడవుల్లో మూగజీవాల దాహార్తి తీరుస్తున్న నేస్తం సేవా సంస్థ

మండువేసవిలో వన్యప్రాణుల పాలిట నేస్తంగా మారారు యువకులు. మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు ముందడుగు వేశారు.

    వేసవి మండిపోతోంది. తాగేందుకు చుక్కనీరు కూడా లేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎక్కడ చూసినా దాహం.. దాహం.. అనే మాటే వినిపిస్తోంది. మానవులే వేసపి తాపానికి తట్టుకోలేక దాహం కేకలు వేస్తుంటే.. భానుడి దెబ్బకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. గుక్కెడు నీటి కోసం ‘అరణ్య’రోదన చేస్తున్నాయి. నల్లమల అడవుల్లో చెలమలు, వాగులు, వంకలు ఎండిపోవడంతో దాహంతో అలమటిస్తున్నాయి. నీటి జాడ కోసం జనారణ్యంలోకి వస్తూ ప్రాణాలు విడుస్తున్నాయి. ఇప్పుడే ఇలా వుంటే మే నెలలో మూగజీవాల పరిస్ధితి మరింత దారుణంగా ఉంటుందనే ఉహే వారిని ఈ మహత్తర కార్యం వైపు నడిపించింది. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా, మైదుకూరు- పోరుమామిళ్ల (ఎద్దడుగుఖనం), మిట్టమను పల్లె - బ్రహ్మంగారిమఠం ప్రాంతాల్లో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. వేలాది వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో వేసవి వస్తే చాలు నీటి కొరత దారుణంగా ఉంటుంది. మూగజీవాలు తాగేందుకు గుక్కెడు నీరు దొరకని పరిస్థితులు నెలకొంటాయి ఇక్కడ. దీంతో వన్యప్రాణులను ఆదుకునేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ అడుగులు వేస్తోంది.

    కొంతమంది మిత్రులు నేస్తం పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి వన్యప్రాణాలు ఆకలి దప్పులు తీర్చుతున్నారు. అడవి జంతువులు నీళ్లు తాగడానికి వీలుగా అటవీ ప్రాంతంలో నీటి తొట్లు, పక్షులు నీరు త్రాగడానికి వీలుగా కుండీలు, బేసులు, సుంకులను ఎర్పాటు చేసిన వాటి నిండ మంచి నీటిని నింపుతున్నారు. అలాగే క్యారెట్, దోసకాయలు, మామిడి కాయలు, టమోట వంటి కూరగాయలు, పండ్లను వన్యప్రాణులకు ఆహారంగా అందిస్తున్నారు. కొంత మంది మిత్రులతో కలసి నేస్తం సేవా సంస్దగా ఎర్పడి వన్య ప్రాణులకు,మూగజీవాలకు పక్షులకు నీటి తో పాటు ఆహరం అందిస్తున్నారు.

    ఇది చదవండి: 9 మంది భార్యలు... 14 మంది పిల్లలు.. ఇంతలో ఆస్తి వివాదం.. కట్ చేస్తే..!


    భానుడి ప్రతాపనికి అడవిలో ఉన్న వాగులు, వంకలు, చెలమలు ఎండిపోతున్నాయి. దీంతో వన్య ప్రాణులు, పక్షులు నీరు ఆహారం దొరకక సమీపంలోని గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. అంతేకాదు అదే సమయంలో వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. అంతేకాక నల్లమల అభయారణ్యంలోని ఘాట్ రోడ్లలోకి ఆహారం నీటి కొరకు వచ్చి వాహనాల కిందపడి మత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ప్రకృతి సమతుల్యత దెబ్బతినటంతో ఎన్నో అనర్దాలను ఎదుర్కొంటున్న మానవజాతి మనుగడకు వన్యప్రాణులు, పక్షుల వల్ల పరోక్షంగా ఎంతో ఉపయోగముంది.

    అటువంటి వన్యప్రాణులను కాపాడు కోవటం కోసం నేస్తం సేవా సంఘం ఎంతో కృషి చేస్తుంది. నల్లమల అభయారణ్యంలో సుమారు 70 కిలోమీటర్ల మేర ఇలాంటి నీటి తొట్లు ఏర్పాటు చేసి జంతువులకు ఆహారం, నీరు అందిస్తోంది. కొంతమంది జంతు ప్రేమికుల అర్దిక సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాతలు తమకు సహకరించి వన్యప్రాణాలు పునర్జన్మనివ్వాలని నేస్తం సేవాసంఘం కోరుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Animals, Nallamala forest

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు