హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: పబ్లిక్ టాయిలెట్స్ డ్యూటీపై స్పందించిన ప్రభుత్వం.. విమర్శలపై అధికారులేమన్నారంటే..!

Guntur: పబ్లిక్ టాయిలెట్స్ డ్యూటీపై స్పందించిన ప్రభుత్వం.. విమర్శలపై అధికారులేమన్నారంటే..!

Guntur: వార్డు సచివాలయ ఉద్యోగలకు పబ్లిక్ టాయిలెట్స్ వద్ద డ్యూటీ వేయడంపై అధికారులు స్పందించారు. దీనిపై వివమర్శలు రావడంతో వివరణ ఇచ్చారు.

Guntur: వార్డు సచివాలయ ఉద్యోగలకు పబ్లిక్ టాయిలెట్స్ వద్ద డ్యూటీ వేయడంపై అధికారులు స్పందించారు. దీనిపై వివమర్శలు రావడంతో వివరణ ఇచ్చారు.

Guntur: వార్డు సచివాలయ ఉద్యోగలకు పబ్లిక్ టాయిలెట్స్ వద్ద డ్యూటీ వేయడంపై అధికారులు స్పందించారు. దీనిపై వివమర్శలు రావడంతో వివరణ ఇచ్చారు.

  గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ (Guntur Municipal Corporation) పరిధిలోని పబ్లిక్ టాయిలెట్స్ వద్ద వార్డు సచివాలయం (Ward Secretariats) అడ్మిన్ సెక్రటరీలకు డ్యూటీల వేసిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై వార్డు సచివాలయ ఉద్యోగులు మండిపడటంతో కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉత్తర్వులపై స్పందించిన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్.. వివరణ ఇచ్చారు. కేవలం మరుగుదొడ్లపై వసూలు చేసే ఛార్జీలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యతను మాత్రమే అప్పగించామన్నారు. వారికి పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే అప్పగించామని.. ఛార్జీలు వసూలు చేసే విధులు కాదన్నారు. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలు మీడియాలో వైరల్ కావడం, దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో అధికారులు ఇలా స్పందించారన్న వాదన వినిపిస్తోంది.

  అసలేం జరిగిందంటే..

  గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉండే పబ్లిక్ టాయిలెట్స్ వద్ద ఆయా వార్డు సచివాలయాల్లోని అడ్మిన్ సెక్రటరీలకు డ్యూటీలు వేస్తూ అడిషనల్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.మూడు షిఫ్టుల్లో వార్డు అడ్మిన్ సెక్రటరీలకు డ్యూటీ వేసిన అధికారులు వారి పనులను పర్యవేక్షించే బాధ్యతను రెవెన్యూ ఇన్ స్పెక్టర్లకు అప్పగించారు. అంతేకాదు కొన్ని మరుగుదొడ్ల వద్ద తెల్లవారుజామున 4గంటలకు డ్యూటీకి హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొందరికి 8 గంటలు డ్యూటీలు వేస్తే.. మరికొందరికి నాలుగు గంటల డ్యూటీలు వేశారు.

  అధికారులు జారీ చేసిన వివరణ

  ఇది చదవండి: వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వైఎస్ సునీత.. CM Jagan మౌనానికి కారణం ఇదే!


  గుంటూరు నగరంలోని గాంధీపార్కు వద్ద గల టాయింట్లకు రోజుకు రూ.5వేల టార్గెట్ విధించారు. ఏరియాను బట్టి రూ.300, రూ.500, రూ.1000, రూ.2వేల వరకు టార్గెట్ పెట్టారు. మొత్తం 14 మంది ఉద్యోగులకు టాయిలెట్ల దగ్గర డ్యూటీ వేశారు వీరిలో ఓ మహిళ కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలకు ఎంపికైన ఉద్యోగులకు ఇలా టాయిలెట్ల దగ్గర డ్యూటీలు వేయడం విడ్డూరంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

  ఇది చదవండి: మరో వివాదంలో భీమ్లా నాయక్.. ఏపీలో పోలీస్ కంప్లైంట్.. అసలు స్టోరీ ఇదే..!


  అడ్మిన్లే కీలకం..

  వార్డు అడ్మిన్ సెక్రటరీ అంటే సెక్రటేరియట్ లో కీలక విధులు నిర్వహిస్తారు. వారి సచివాలయ పరిధిలో రెవెన్యూ సాధించడమే వారి లక్ష్యం. ముఖ్యంగా పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఓటీఎస్ ఇళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు వార్డు అడ్మిన్ సెక్రటీలే సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారు. అలాంటి కీలక పోస్టులో ఉన్నవారికి మరుగుదొడ్ల వద్ద విధులు వేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గుంటూరు నగరపాలక సంస్థ తీరుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇప్పటికే తక్కువ జీతానికి గొడ్డు చాకిరీ చేస్తున్నామని.. ఇప్పుడు టాయింట్ల దగ్గర విధులు వేసి తమ పరువు తీస్తున్నారని విమర్శిస్తున్నారు.

  First published:

  Tags: Andhra Pradesh, Guntur

  ఉత్తమ కథలు