హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ward Volunteer: మరీ ఇంత గర్వమా.. మహిళా వాలంటీర్ తో కమిషనర్ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్..

Ward Volunteer: మరీ ఇంత గర్వమా.. మహిళా వాలంటీర్ తో కమిషనర్ దురుసు ప్రవర్తన.. వీడియో వైరల్..

మహిళా వాలంటీర్ కు వార్నింగ్ ఇస్తున్న మున్సిపల్ కమిషనర్..

మహిళా వాలంటీర్ కు వార్నింగ్ ఇస్తున్న మున్సిపల్ కమిషనర్..

ఓ అధికారి మహిళా వాలంటీర్ పట్ల అనుచితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోపలేసి తోలు వలిపిస్తా అని వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున దాదాపు 4లక్షల మంది వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పని వాలంటీర్ల ద్వారానే జరుగుతోంది. రేషన్ డోర్ డెలివరీ, పెన్షన్ల పంపిణీ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల నమోదు, రేషన్ కు ఈ-కేవైసీ, అగ్రిగోల్డ్ బాధితుల వివరాల సేకరణ, ఆఖరికి దిశాయాప్ ఇన్ స్టాల్ చేయించాల్సిన బాధ్యతను కూడా ప్రభుత్వం వారికే అప్పగించింది. జీతంతో, సమయంతో సంబంధం లేకుండా అధికారులు ఇచ్చే ఆదేశాలు తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఐతే కొన్నిచోట్ల వాలంటీర్లపై ఆరోపణలు వస్తుండగా.. మరికొన్ని చోట్ల వారికి వేధింపులు ఎదురవుతున్నాయి. ఓ అధికారి మహిళా వాలంటీర్ పట్ల అనుచితంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమకు నిర్ధేశిత పని గంటలు ఏవీ లేక పోయినప్పటికీ ఉదయం నుండి సాయంత్రం వరకు సచివాలయంలో ఉండాలంటూ వేధింపులకు పాల్పడుతున్నట్లు వాలంటీర్లు ఆరోపిస్తున్నారు. వార్డు అడ్మిన్. సచివాలయ సిబ్బంది వాళ్ళు చేయవలసిన పనులను కూడా తమతో చేపిస్తున్నారంటూ వాపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపాల్ కమిషనర్ కే.రామచంద్రారెడ్డి వాలంటీర్ ని దూషింటడం చర్చనీయాంశమవుతోంది. షేక్ అక్తర్ అనే మహిళ 3వ వార్డులో వాలెంటీర్ గా పనిచేస్తోంది. ఐతే అక్కడి అడ్మిన్ గా పనిచేసే నవ్య అనే సచివాలయ ఉద్యోగి తనపై ఫిర్యాదు చేయడంతో కమిషనర్ తనకు ఫోనుచేసి అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత జనవరి నెలలో తాను విధుల్లో చేరినప్పటి నుండి తనకు నిర్ధేశించిన అన్నిపనులూ సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పుడూ సచివాలయంలోనే అందుబాటులో ఉండాలంటూ తనను వార్డ్ అడ్మిన్ వేధింపులకు గురిచేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో 3వ వార్డు వాలెంటీర్లు అందరూ అడ్మిన్ పై కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆ కక్ష మనసులో పెట్టుకుని తమను మరిన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె చెప్పింది.

ఇది చదవండి: ప్రియుడి కోసం దేశంకాని దేశం వచ్చిన యువతి... ఇంతలోనే ఊహించని కష్టం.. పోలీసులే ఆమె పాలిట దేవుళ్లు..


వార్డు అడ్మిన్ చెప్పారని కమిషనర్ తనను ఫోనులో బూతులు మాట్లాడుతూ నీకు దిక్కున్న చోట చెప్పుకోమంటూ.., పోలీస్ స్టేషన్ వేయించి తోలు వలిపిస్తా అంటూ బెదిరిస్తున్నారని షేక్ అక్తర్ ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ వాలంటీర్ తో దురుసుగా ప్రవర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనారోగ్యం కారణంగా సెలవు పెట్టిన సమయంలో తాను పనిచేయడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారని షేక్ అక్తర్ చెబుతోంది. తనపై ఎమ్మెల్యేకు కూడా తప్పుడు సమాచారిమిచ్చి తొలగించాలని చూస్తున్నారని ఆరోపించింది. తనతో అసభ్యంగా మాట్లాడిన కమిషనర్ రామచంద్రారెడ్డిపై మరియు వార్డు అడ్మిన్ నవ్యపై చర్యలు తీసుకొవాలని ఆమె డిమాండ్ చేసింది.

First published:

Tags: Andhra Pradesh, Ward Volunteers

ఉత్తమ కథలు