హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: అగ్నిప్రమాదాలను అరికట్టే సెన్సార్‌ ఆవిష్కరణ..! ప్రయోగాలతో సత్తా చాటుతోన్న విద్యార్థులు.!

Guntur: అగ్నిప్రమాదాలను అరికట్టే సెన్సార్‌ ఆవిష్కరణ..! ప్రయోగాలతో సత్తా చాటుతోన్న విద్యార్థులు.!

X
విద్యార్థులు

విద్యార్థులు తయారు చేసిన సెన్సార్

Guntur: అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు తెనాలి విద్యార్థులు ఓ సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. తొమ్మిదో తరగతి చదవే విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా మారి తమలోని సృజనాత్మతకు పదునుపెడుతున్నారు. ఫ్లేమబుల్‌ లీకేజీ సెన్సార్‌ను విద్యార్థులు తయారుచేసి అదరహో అనిపించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Sumanth, News18, Guntur

అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు తెనాలి విద్యార్థులు ఓ సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. తొమ్మిదో తరగతి చదవే విద్యార్థులు యువ శాస్త్రవేత్తలుగా మారి తమలోని సృజనాత్మతకు పదునుపెడుతున్నారు. ఫ్లేమబుల్‌ లీకేజీ సెన్సార్‌ను విద్యార్థులు తయారుచేసి అదరహో అనిపించారు. మారుతున్న మానవుని అవసరాలకు అనుగుణంగా శరవేగంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఈ తరుణంలో విద్యార్థి దశ నుంచే పరిశోధన పట్ల ఆసక్తి కలిగించడం వల్ల భవిష్యత్‌లో వాళ్లు ఉన్నతస్థానానికి చేరుకుంటారు. ఈ ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం అటల్‌ టింకరింగ్‌ ప్రాజెక్ట్‌ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి…ఆయా స్కూళ్లలో అటల్ టింకరింగ్‌ ల్యాబ్‌( Atal Tinkering Labs)లను ఏర్పాటు చేసింది. అలా ఈ ల్యాబ్‌ పెట్టేందుకు తెనాలిలోని మాంటిస్సోరి స్కూల్‌ను సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఎంపికచేసింది.

ఈ ల్యాబ్‌ను తమ తమ స్కూళ్లకు తీసుకురావాలని చాలా పాఠశాలలే ప్రయత్నాలు చేసినా.. మాంటిస్సోరి స్కూల్‌ మాత్రమే ఆ అర్హతను సాధించింది. దీంతో కేంద్రప్రభుత్వం రూ.10లక్షల నిధులను విడుదల చేసింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులతో పాటు స్కూల్‌ యాజమాన్యం కూడా మరికొంత డబ్బు వేసుకుని ఏటీఎల్‌ ల్యాబ్‌ను ఏర్పాటుచేసింది.

ఇది చదవండి: 'హెల్పింగ్‌ హ్యాండ్స్‌' పేరుతో ఆ నలుగురి కోసం జీవిస్తోన్న ఫొటోగ్రాఫర్‌...! ఒక్క కాల్‌ చేస్తే చాలు..!


ప్రతి వారం మూడు గంటల పాటు విద్యార్థులకు పరిశోధనలు చేసుకునేందుకు ఈ ల్యాబ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ ల్యాబ్‌లో వెళ్లి పరిశోధనలు చేయోచ్చు. ఈ క్రమంలో విద్యార్థులకు సెన్సార్‌, రోబోటిక్స్‌, కోడింగ్‌ వంటి అడ్వాన్స్‌డ్ సబ్జెక్ట్‌పైన విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు.

ఇది చదవండి: యోగి వేమ‌నకు గుడికట్టి పూజలు, ఉత్సవాలు చేస్తున్నారు..? ఎక్కడో తెలుసా..!


ఈ ల్యాబ్‌లోని సదుపాయాలను ఉపయోగించుకుని తొమ్మిదో తరగతి విద్యార్థులు ఫైర్‌ ఆక్సిడెంట్స్‌పై రిసెర్చ్‌ చేశారు. గ్యాస్‌ లీకేజీ వల్ల జరిగే ఫైర్‌ ఆక్సిడెంట్స్‌ని ముందస్తు హెచ్చరికలతో నివారించొచ్చని విద్యార్థులు నిరూపించారు. అల్ట్రా సోనిక్‌ సెన్సార్‌ను ఉపయోగించి ఈ పరికరాన్ని కనుగొన్నారు.

ఇది చదవండి: పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్


ఎలా తయారుచేశారంటే..?

ఈ సెన్సార్‌కు ఎల్‌సీడీ, ఎల్‌ఈడీ, బజర్‌, ఆర్డినో, జంపర్‌ వైర్స్‌, ఎంక్యూ3 సెన్సార్(MQ-3 sensor) యూఎస్‌బీ పిన్…ఇలా తక్కువ ధరకే దొరికే చిన్న చిన్న పరికరాలతో ఈ సెన్సార్‌ను తయారుచేశారు. ఈ సెన్సార్‌కు దగ్గరగా ఏదైనా మండే పదార్థం వచ్చినప్పుడు ఇది వెంటనే అలర్ట్‌ పంపుతుంది. దీంతో వెంటనే ఈ పరికరంలో ఉన్న బజర్‌ అలారం మోగుతుంది. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అగ్నిప్రమాదాలను నివారించొచ్చంటున్నారు యువ శాస్త్రవేత్తలు. ఈ పరికరానికి జేఎం ఇగ్నస్‌ డిటెక్టర్‌ (JM Ignas detector) అని పేరు పెట్టారు.

ఇలా ఈ ఒక్క పరికరమే కాదు.. విద్యార్థులు మరెన్నో ప్రాజెక్టులను తయారుచేశారు. వాటిలో అంధులు వాడే కర్ర, గ్యాస్‌ డిటెక్టర్‌, స్మోక్‌ అలారం..ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి తమలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకుంటున్నారు. ఈ టింకరింగ్‌ ల్యాబ్‌ ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకుంటున్నామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ Dr. జేమ్స్ మోర్లీకి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తయారుచేస్తున్న ప్రయోగాలకు స్కూల్‌ సిబ్బంది ఎంతగానో సహకరిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur, Local News

ఉత్తమ కథలు