Breaking News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార వైసీపీ (YCP) కి ఊహించని మరో షాక్ తగిలింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక (MLA Quot MLC Elections) లో టీడీపీ అభ్యర్థి పంచమర్తి అనురాధ (Panchamarthi Anuradha) విజయం సాధించారు. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) చేతిలో కేవలం 19 ఓట్లు ఉండగానే.. అమెకు ఇప్పటికే 23 ఓట్లు వచ్చాయి.. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలు ఉండడంతో ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవాలి అంటే 22 ఓట్లు సరిపోతాయి. ఇప్పటికే ఆమెకు 23 ఓట్లు రావడంతో ఆమె గెలుపు ఖాయమైంది.. అయితే చేతిలో 19 ఓట్లు ఉంటే.. మరో నాలుగు ఓట్లు అనంగా వచ్చాయి. అందులో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayan Reddy) ఓట్లు పడినా.. ఆమె ఓట్ల సంఖ్య 21కి చేరినట్టు. కానీ ఆమెకు 23 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ నుంచి రెండు ఓట్లు ఆమెకు పడ్డాయి. దీంతో వైసీపీ నుంచి ఓట్లు వేసిన ఆ ఇద్దరు ఎవరు అన్నది ఆసక్తి కరంగా మారింది.
వైసీపీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. టీడీపీ దే పై చేయి అవుతోంది. ఎందుకంటే వైసీపీ గెలిచినవి 151 స్థానాలు.. వాటికి తోడు జనసేన నుంచి ఒక ఎమ్మెల్యే వైసీపికి జై కోట్టారు. టీడీపీ నుంచి నాలుగు వైసీపీికి మద్దతుగా నిలిచారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 156కి పెరిగింది. ఈ సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే కచ్చితంగా ఏడుకి ఏడు ఎమ్మెల్సీలు వైసీపీనే నెగ్గాలి.. కానీ టీడీపీ అభ్యర్థి నెగ్గడంతో.. ఒక వైసీపీ ఎమ్మెల్సీ ఓడిపోయినట్టే..
అయితే టీడీపీ మొదటి నుంచీ చెబుతోంది. తమ అభ్యర్థి విజయం పక్కా అంటూ దీమా వ్యక్తం చేస్తూ వచ్చింది. వైసీపీకి చెందిన కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే తమకు ఓటు వేస్తారని చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన వైసీపీ.. గత రెండు రోజులగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. సాధరాణ ఎన్నికల స్థాయిలో.. ఎమ్మెల్యేలు అందరికీ విందు ఏర్పాటు చేసి.. మూడు హోటల్స్ లో ఎమ్మెల్యేలను ఉంచారు. కచ్చితంగా వారంతా తమ పార్టీ అభ్యర్థులకే ఓట్లు వేయాలని సూచనలు చేశారు.. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. టీడీపీ విజయాన్ని వైసీపీ అడ్డుకోలేకపోయింది.
ఇదీ చదవండి : సీఎం జగన్ కు ఊహించని షాక్.. టీడీపీకి ఓటు వేసిన ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వీరే..?
తాజా ఫలితంతో వైసీపికి వరుస షాక్ లు తగులుతున్నట్టు అయ్యింది. ఎందుకంటే ఇప్పటికే మూడింటికి మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ నెగ్గింది. ఆ షాక్ నుంచి వైసీపీ ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు అనూహ్యంగా చేతిలో పూర్తి బలం ఉన్నా..? టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి షాక్ లు ఏ పార్టీకైనా కోలుకోని దెబ్బే అని చెప్పాలి.. మరి దీనిపై వైసీపీ ఏం చెబుతుందన్నది చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap mlc elections, AP News, AP Politics