Home /News /andhra-pradesh /

GUNTUR MISSING CASE GOES MYSTERY AS POLICE SUSPECT WIFE KILLED HUSBAND FOR EXTRAMARITAL AFFAIR FULL DETAILS HERE PRN

Missing Mystery: వాళ్లిద్దరిదీ ప్రేమ వెళ్లి.. ఓ రోజు భర్త మిస్సింగ్.. ఇంట్లో రక్తపు మరకలు.. అసలు మిస్టరీ ఏంటి..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Guntur Woman: వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. హాయిగా సాగిపోతున్న కాపురంలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఓ రోజు భర్త అదృశ్యమయ్యాడు. విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

    వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. హాయిగా సాగిపోతున్న కాపురంలో అనుకోని ఘటన. పెళ్లైన కొత్తలో అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య క్రమంలో మనస్ఫర్ధలు మొదలయ్యాయి. పెద్దలు నచ్చజెప్పినా, తెలిసినవాళ్లు సర్దిచెప్పినా దంపతుల మధ్య అగాధాన్ని పూడ్చలేకపోయారు. ఇంతలో అనుకోని ట్విస్ట్. ఉన్నట్లుండి భర్త కనిపించకుండా పోయాడు. భార్య అక్రమ సంబంధమే భర్త మిస్సింగ్ కు కారణమని అతడి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో రక్తపు మరకలు కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) పొన్నూరు పట్టణానికి చెందిన జయచిత్ర నాగరాజు.. నెల్లూరు జిల్లా (Nellore District) బిట్రగుంటకు చెందిన సోని ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

    వీరికి ఇద్దరు పిల్లలు. ఆరు సంవత్సరాల క్రితం నాగరాజు కుటుంబంతో సహా పొన్నూరులో స్థిరపడ్డాడు. నాగరాజు కారు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదుగానీ నాగరాజు అదృశ్యమయ్యాడు. అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఇది చదవండి: పెళ్లైన మహిళతో యువకుడి ఎఫైర్.. ఆమె కోసం ఏడు జిల్లాలు దాటి వెళ్లాడు.. కానీ..


    పోలీసులు నాగరాజు ఆచూకీ కోసం గాలిస్తుండగా.. అతడి తోడల్లుడు బాంబు పేల్చాడు. నాగరాజును అతని భార్య సోనినే హత్య చేయించిందంటూ బంధువులకు సమాచారం అందించాడు. పోలీసులు నాగరాజు నివాసానికి వెళ్లి అతడి భార్య సోనీని ప్రశ్నించారు. ఇంట్లో రక్తపు మరకలు ఉండటంతో అతడ్ని హత్య చేశారన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. రక్తపు మరకల నుంచి శాంపిల్స్ సేకరించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. జాగిలాలు నాగరాజు ఇంటి నుంచి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీ సమీపంలోని పొలాల వద్దకు వెళ్లి ఆగిపోయాయి.

    ఇది చదవండి: ‘నన్ను రేప్ చేసి చంపేస్తారు..’ మహిళా పోలీస్ సూసైడ్ నోట్ లో సంచలన విషయాలు..


    భార్య సోని వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడనే అతడ్ని హత్య చేయించిందని.. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి బాపట్ల సమీపంలోని కాలువలో పడేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బంధువులు కాలువలో గాలించినా మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సోనీకి నిజంగానే ఎవరితోనైనా సంబంధం ఉందా..? నాగరాజు అదృశ్యమవడానికి ముందు ఎక్కడికి వెళ్లాడు..? ఎవరితోనైనా గొడవ పడ్డాడా..? అనే కోణంలో విచారిస్తున్నారు. అలాగే సోనితో పాటు నాగరాజు ఫోన్ కాల్ డేటాను సేకరిస్తున్నారు.

    ఇది చదవండి: ఒంటరిగా వెళ్తున్న జంటలే వారి టార్గెట్.. కరుడుగట్టిన ముఠా అరెస్ట్.. దర్యాప్తులో సంచలన నిజాలు..


    ఇటీవల నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నరేంద్ర అనే యువకుడు శ్రీకాకుళం నుంచి వలస వచ్చిన వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. విషయం ఆమె భర్తకు తెలియడంతో తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయారు. నరేంద్ర కూడా మహిళ కోసం ఆమె స్వగ్రామానికి వెళ్లగా.. అక్కడ ఆమె భర్తతో గొడవ జరిగింది. ఇంతలోనే అతడు ఓ బావిలో శవమై తేలాడు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు