GUNTUR MINSTER VIDALA RAJANI VISIT GUNTUR GOVERNMENT HOSPITAL AND WARN TO DOCTORS AND OFFICIALS NGS GNT
Vidadala Rajani: అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి.. అప్పుడే యాక్షన్ లోకి దిగిన విడదల రజనీ
అధికారులను పరుగులు పెట్టించిన మంత్రి
Vidadala Rajani: మేడమ్ సార్ మేడమ్.. అనే స్టైల్లో దూకుడు చూపిస్తున్నారు మంత్రి విడదల రజినీ. సీఎం జగన్ తనపై నమ్మకం ఉంచి కేబినెట్ లో బెర్త్ ఇవ్వడమే కాకుంబా కీలక శాఖ కేటాయించడంతో.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అన్న ఆమె.. వెంటనే యాక్షన్ మొదలెట్టేశారు.. ఇందులో భాగంగా తొలి విజిట్ లోనే.. అధికారులను పరుగులు పెట్టించారు.
Vidadala Rajani: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM Jagan) కేబినెట్ లో కొత్తగా 14 మందికి అవకాశం ఇస్తే.. అందులో విడదల రజనీ (Vidadala Rajani) చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కేబినెట్ లో ఆమె అంత్యంత చిన్న వయసు ఉన్న మంత్రి.. అంతేకాదు.. ఆమెపై ఉన్న నమ్మకంతో కీలక శాఖ అప్పచెప్పింది అధిష్టానం.. అంతేకాదు ఇంఛార్జ్ హోదా విషయంలో ప్రాధాన్యం ఇచ్చింది. కాబోయే రాజధానిగా వైసీపీ (YCP) చెబుతున్న విశాఖ (Visakha)కు ఆమెను జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమించారు.. ఈ మూడు విషయాలతో పార్టీలో ఆమెుకు ఉన్న ప్రాధాన్యం ఏంటన్నది అర్థమైంది. అయితే తనపై అంత నమ్మకంతో కీలక పదవులు ఇచ్చారని.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయను అని చెప్పిన ఆమె.. వెంటనే యాక్షన్ లోకి దిగిపోయారు.. మంత్రి హోదాలో తొలి అధికారిక తనిఖీల్లోనూ అధికారులను పరుగులు పెట్టించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఆరోగ్య యజ్ఞంలో దివ్యౌషధం అవుతానని, సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా అని, గుంటూరును మెడికల్ హబ్ గా చేస్తా అని పేర్కొన్న మంత్రి విడదల రజిని రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిని తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో సందర్శనలు మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా మొదట గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి (Guntur Government Hospital )లో ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ ను హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె రాకని ఊహించని ఆసుపత్రి సిబ్బంది పరుగులు పెట్టాల్సి వచ్చింది. మంత్రి ఆకస్మిక తనిఖీతో అధికారులకు చెమటలు పట్టాయి. ఆకస్మికంగా ఆసుపత్రి సందర్శనకు వెళ్లిన విడదల రజినీ నేరుగా పేషెంట్ల వద్దకు వెళ్లి ఆసుపత్రిలో అందుతున్న వైద్యం తీరుతెన్నులను గురించి అడిగి తెలుసుకున్నారు.
అత్యవసర విభాగంలో ఏసీ పని చెయ్యకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల నుండి ఏసీ పని చేయకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఎలక్ట్రికల్ విభాగం ఏఈని ప్రశ్నించారు. విధుల్లో వైద్యులు లేరని గుర్తించి ఉన్నతాధికారులను వివరణ అడిగిన మంత్రి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని మంత్రి విడదల రజిని తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికప్పుడు రిపేర్ బిల్స్ ఇస్తున్నామని చెప్పిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, బిల్స్ ఇస్తున్నప్పటికీ ఎందుకు రిపేర్ చేయించలేదు అంటూ ఆసుపత్రి అధికారులను ప్రశ్నించారు.
ప్రతి డిపార్ట్మెంట్ ను పరిశీలించిన మంత్రి అక్కడి పరిస్థితులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ఆసుపత్రిలో చాలామంది వైద్యులు విధుల్లో లేరని గుర్తించిన మంత్రి.. ఏమైందని ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్య వహిస్తే సహించబోమని చెప్పిన మంత్రి విడదల రజిని విధుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎందుకు లేరని జీజీహెచ్ లో ఉన్న ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. పీజీలు మాత్రమే విధుల్లో ఉన్నారని అధికారులు మంత్రికి వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేకుండా పీజీ లతోనే ఆసుపత్రిని నడిపిస్తున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు. ఈసారి మళ్లీ విజిట్ కి వచ్చే సమయానికి అన్నీ సమంగా ఉండాలని, లేదంటే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.