హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur Girl: ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఆమె పాలిట శాపమైంది.. మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్..

Guntur Girl: ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఆమె పాలిట శాపమైంది.. మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఈ రోజుల్లో సోషల్ మీడియా (Social Media) ద్వారా ఎవరు ఎవరితోనైనా ఫ్రెండ్ షిప్ చేయవచ్చు. అలాంటి కొన్ని స్నేహాలు మంచి చేస్తుంటే.. మరికొన్న స్నేహాలు మాత్రం పాములాగా కాటువేస్తున్నాయి. సోషల్ మీడియా స్నేహాలు స్నేహం అనే మాటకే మచ్చ తెస్తున్నాయి.

ఇంకా చదవండి ...

Anna Raghu, News18, Amaravati

ఈ రోజుల్లో సోషల్ మీడియా (Social Media) ద్వారా ఎవరు ఎవరితోనైనా ఫ్రెండ్ షిప్ చేయవచ్చు. అలాంటి కొన్ని స్నేహాలు మంచి చేస్తుంటే.. మరికొన్న స్నేహాలు మాత్రం పాములాగా కాటువేస్తున్నాయి. సోషల్ మీడియా స్నేహాలు స్నేహం అనే మాటకే మచ్చ తెస్తున్నాయి. అతిగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగంలో సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తూ పెడదోవపడుతున్న యువత స్నేహం పేరుతో ఘోరాలకు తెగబడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచం ఓ బాలికను మృగాళ్లకు చిక్కేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur District) లోని రేపల్లె, గురజాల అత్యాచార ఘటనలు మరవకముందే తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. నల్లపాడు పోలీస్ స్టేషన్ కు కొత్త వేటు దూరంలో ఘటన జరగటంతో మహిళల భద్రత మరోసారి సందహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్ స్టాగ్రామ్ ద్వారా బాలికకు పరిచయమైన ఓ యువకుడు ఆమెకు మద్యం తాగించి స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని శివారు ప్రాంతానికి చెందిన బాలికకు తాడికొండ మండలం గరికపాడు గ్రామానికి చెందిన డి.గ్రేస్‌బాబు అనే యువకుడితో ఇన్ స్టా గ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. గ్రేస్‌బాబు తన స్నేహితులైన రిక్కీ, మణికంఠలను ఆ బాలికకు పరిచయం చేశాడు. వీరు బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు.

ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి డెడ్ బాడీ.. అర్ధరాత్రి ఏం జరిగింది..?


బుధవారం రాత్రి నగర శివారులోని ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ లో ఓ హోటల్‌ లో గది తీసుకుని మద్యం తాగారు. వీరిలో ఒకడు మద్యం మత్తులో బాలికకు ఫోన్ చేసి, గ్రేస్‌ బాబు మద్యం తాగి హోటల్‌లో పడిపోయాడని, మీరొస్తేనే అన్నం తింటానంటున్నాడని నమ్మించారు. ఇంట్లో బాలిక తల్లిదండ్రులు లేకపోవటంతో బలవంతంగా బైక్‌ ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికకు మద్యం తాగించారు. ఆమె మత్తులోకి వెళ్లగానే రిక్కీ, మణికంఠలు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇది చదవండి: భార్యపై ప్రేమతో అత్తపై కోపం.. అల్లుళ్లు ఏం చేశారో చూడండి..


తల్లిదండ్రులు పనులు చేసుకుని రాత్రికి ఇంటికి వెళ్లే సరికి బాలిక ఇంట్లో లేదు. చుట్టుపక్కలా వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మరోవైపు అత్యాచారం అనంతరం బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో ఆ యువకులు బైక్ పై తీసుకొచ్చి ఇంటి సమీపంలో వదిలేశారు. వెంటనే బాధితురాలి తల్లి నల్లపాడు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. రంగంలోకి పోలీసులు బాలికను జీజీహెచ్‌కు తరలించారు.

ఇది చదవండి: ప్రియుడితో వెళ్లిపోయిన తల్లి.. రైలు పట్టాలపై పడుకున్న తండ్రి.. చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్..


మరో బృందం హోటల్‌కు వెళ్లి సీసీ కెమెరా ఫుటేజీ సేకరించి నిందితులను అదుపులోకి తీసుకుంది. నల్లపాడు పోలీసు స్టేషన్‌కు అరకిలోమీటరు దూరంలోనే ఈ దారుణం జరిగింది. బుధవారం రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరగగా పోలీసులు మాత్రం గురువారం సాయంత్రం కేసు నమోదు చేయటం విమర్శలకు దారితీసింది. గ్రేస్‌బాబుపై కేసు నమోదు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అతడు నేరానికి పాల్పడలేదని నల్లపాడు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Gang rape, Guntur

ఉత్తమ కథలు