Home /News /andhra-pradesh /

GUNTUR MINOR BOY KILLED WARD VOLUNTEER FOR ASKING MONEY IN TANALI TOWN OF GUNTUR DISTRICT FULL DETAILS HERE PRN GNT

Guntur: అప్పు తీర్చమని అడిగితే అంతపనిచేస్తారా..? అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారుగా..!

సందీప్ (File)

సందీప్ (File)

Shocking: మనిషి డబ్బు కి ప్రాధాన్యతను పెంచుకుంటూ పోతున్నాడు అలాగే మానవ సంబంధాలను కూడా ఆర్ధిక సంబంధాలతో లెక్కించటం మొదలు పెట్టారు పదికి, పాతికకి హత్యలు చేయడం మనం పాత సినిమాలల్లో చూస్తుంటాం కానీ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి అనేదానికి ఉదాహరణే ఈ ఘటన.

ఇంకా చదవండి ...
    Anna Raghu, News18, Amaravati

    మనిషి డబ్బు కి ప్రాధాన్యతను పెంచుకుంటూ పోతున్నాడు అలాగే మానవ సంబంధాలను కూడా ఆర్ధిక సంబంధాలతో లెక్కించటం మొదలు పెట్టారు పదికి, పాతికకి హత్యలు చేయడం మనం పాత సినిమాలల్లో చూస్తుంటాం కానీ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి అనేదానికి ఉదాహరణే ఈ ఘటన. రెండు వేల రూపాయల కోసం ఒక యువకుడ్ని దారుణంగా హతమార్చారు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి లో ఈ ఘటన జరిగింది. పదికి, పాతికకి హత్యలు చేయడం సినిమాల్లో చూస్తుంటాం. నిండా పదిహేనేళ్ళు కూడా లేవు... ఆవేశాన్ని ఆపుకోలేక ఏకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.., తెనాలి మారీస్ పేటలో సందీప్ 24వ వార్డు వాలంటీర్ గా పని చేస్తున్నాడు. స్థానికంగా అందరికీ తెలిసిన వాడు కావడంతో అదే కాలనీకి చెందిన ఓ మైనర్ బాలుడు స్నేహితుడయ్యాడు.

    సదరు మైనర్ బాలుడు సందీప్ వద్ద రెండు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగిన తన డబ్బులివ్వకపోవడంతో గురువారం సాయంత్రం సమయంలో సందీప్... మైనర్ బాలుడి ఇంటికి వెళ్ళి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో మైనర్ బాలుడు తండ్రి కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి సందీప్ పై చేసిన దాడిలో సందీప్ అక్కడిక్కడే కూలబడి చనిపోయాడు. ఇద్దరూ కలిసి చేసిన దాడిలో గుండెపై బలంగా దెబ్బలు తగలటంతోనే సందీప్ చనిపోయాడని అతని బంధువులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఇది చదవండి: ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఆమె పాలిట శాపమైంది.. మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్..


    ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో శ్రీకాకుళం (Srikakulam) లో వాలంటీర్ ను దారుమంగా హత్య చేశారు. కరుణ‌రాజ్ అనే వ్యక్తి గూనపాలెం సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. గూనపాలెంకు సమీపంలో ఉన్న మరో సచివాలయంలో వాలంటీర్ గా పనిచేస్తున్న వరప్రసాద్ అలియాస్ అబ్బాస్ కు కరుణరాజ్ కు మధ్య పాత గొడవలు ఉన్నాయి. గంజాయికి అలవాటు పడ్డ వరప్రసాద్ అతని గ్యాంగ్ తో కలిసి ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు యువకులు, రెండు బైకులపై వచ్చి గొడ్డలితో విచక్షణా రహితంగా నరికారు. వాటిలో ఓ గొడ్డలి కరుణరాజ్ తలలో ఇరుక్కుపోయింది. అప్పట్లో ఆ ఘటనలో సంచలనం సృష్టించింది. స్థానికంగా అందరూ కలుపుగోలుగా ఉండే కరుణరాజ్ హత్యకు గురికావడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Crime, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు