Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల గురించి తెలిసిన వారికి రోజా (RK Roja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ముద్రతో మంత్రి పదవి దక్కించుకున్నఆమె.. ఏ పని చేసినా అందులో సమ్ థింగ్ స్పెషల్ వుంటుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న స్వర్ణోత్సవం సాంస్కృతిక సంబరాలను.. ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహిస్తోంది. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఇప్పుడు గుంటూరు (Guntur)లో మరింత గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అధికార వైసీపీ (YCP) కి చెందిన అనేక మంది నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఇక రోజా గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సందడి అంతా ఆమెదే కనిపిస్తోంది. జగనన్న స్వర్ణోత్సవ సంబరాల వేడుకలో కళాకారులతో కలసి డాన్స్ వేశారు.
కళలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న గుంటూరులో జగనన్న వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి రోజా. ఆ మధ్య తిరుపతిలో జరిగిన స్వర్ణోత్సవ సాంస్కృతిక ఉత్సవాలకు సాంస్కృతిక శాఖ మంత్రిగా రోజా హాజరై వివిధ ఆల్బమ్ సాంగ్స్ కు డ్యాన్సులు వేసి అందరినీ ఉత్సాహ పరిచారు. రోజా డ్యాన్సుల వీడియోలు యూట్యూబ్ లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
గతంలో జబర్దస్త్ కామెడీషోలో ఆమె పలు పాటలకు చేసిన డ్యాన్స్ లు అలరించాయి. జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలను గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నారు. డిసెంబరు 21న సీఎం జగన్ 50వ పుట్టిన రోజు సందర్భంగా ముందస్తుగా చేపట్టిన మూడు రోజుల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులతో కలిసి మంత్రి రోజా స్టెప్పులేశారు. మంత్రి రోజా మాస్ స్టెప్పులతో అక్కడ ఉన్నవారంతా ఈలలు, కేకలతో హుషారెత్తించారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పపన్ కల్యాణ్‌పై రోజా ఫైరయ్యారు. కర్నూలులో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించాలని రోజా మండిపడ్డారు. ఎన్టీఆర్ సంక్షేమానికి తూట్లు పొడిచి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన వ్యక్తి చంద్రబాబు. మరోసారి చంద్రబాబుకి అవకాశం ఇస్తే నష్టపోతామని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు తానొక మాజీ ముఖ్యమంత్రినని మర్చిపోయారన్నారు. కర్నూలు జిల్లాలో వీధి రౌడీలా వ్యవహరించారని.. ఆయన భాష చూస్తే తలదించుకునేలా ఉందన్నారు.
చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ను వాడుకుని వదిలేస్తారని.. ఇప్పటికైనా పవన్ వాస్తవాలను గ్రహించాలని సూచించారు.. రాష్ట్ర సమస్యలపై పవన్‌కు అవగాహన లేదు. చంద్రబాబు, పచ్చ ఛానెళ్ల డైరెక్షన్లో పవన్ నడుస్తున్నాడన్నారు. ఇప్పటంలో అక్రమ నిర్మాణాల విషయంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కోర్టు సమయాన్ని వృథా చేసిన 14 మందికి మనిషికి లక్ష చొప్పున న్యాయస్థానం జరిమానా విధించింది. ఇప్పటం విషయంలో పవన్‌కు ఇంతకంటే పెద్ద దెబ్బ మరొకటి ఉండదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Minister Roja