AP Government vs Employees: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరో భారీ ఉద్యమానికి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే దీనిపై ఉద్యోగ సంఘాలు (Employees Unions) ప్రకటన చేశాయి కూడా.. అలాగే రాష్ట్ర సీఎస్ (AP CS) ను కలిసి.. తమ డిమాండ్లను ముందుంచారు.. ఎట్టిపరిస్థితుల్లో ఉద్యమం నుంచి వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyannarayana), ప్రభుత్వ సలహా సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై చర్చల్లో భాగంగా బొత్స నివాసానికి ఉద్యోగ సంఘాల నేతలు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, ఇతర నాయకులు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, ఏపీ ఎన్జీవోల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
అలాగే రెండు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని అడిగామని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉన్నందున పెండింగ్ డీఏలు ఇవ్వలేకపోయామని చెప్పారని ఆయన వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిశాక పెండింగులో ఉన్న డీఏల్లో ఒక డీఏ ఇస్తామని స్పష్టం చేశారని పేర్కొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని.. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం భూ కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది సీపీఎస్ ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారు.
అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. దీంతో పాటు ఉద్యోగుల కోసం సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్ సిద్దం చేస్తామని మంత్రి బొత్స, సజ్జల హామీనిచ్చారన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు.. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలోనే ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేసుకుని ఏసీబీ దాడులు జరిగాయని.. గత ప్రభుత్వం మూడు కులాల ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకుని ఏసీబీ దాడులు చేపట్టిందని ఆరోపించారు. అప్పటి సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయలేదని. గతంలో 170 మంది ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయించింది.
ఇదీ చదవండి : ఈ నెల 14న ఏపీ కేబినెట్ భేటీ.. అసలు అజెండా అదేనా..?
ఈ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నేతలపై ఏసీబీ దాడులు చేయించలేదన్నారు ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి అన్నారు. తాను సీఎం జగన్ బంటునే అన్నారు. ప్రభుత్వాధినేత సీఎం కాబట్టి తాను జగన్ బంటునే అన్నారు ఆయన. తననే ఓడించి లేకపోయారని.. సీఎం జగన్నేం ఓడిస్తారని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఇది అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఉద్యోగులను కోరుతున్నామన్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా వస్తున్నా.. చిరుద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్క నెలలో అయినా ఒకటో తేదీన జీతాలు పడ్డాయా..?
ఇదీ చదవండి : జనసేన ఆవిర్భావ సభకు ఏర్పాట్లు.. వారాహిపైనే వేదిక దగ్గరకు పవన్.. యాత్ర ఎప్పటి నుంచి అంటే..?
అయితే ఇప్పుడు మరో సమస్య మొదలైంది.. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోందని.. అందుకే కొన్ని సంఘాల నేతలతో మాత్రమే ఇలాంటి చర్చలు జరుపుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలనే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేయిస్తున్నారని.. ఈ విషయాన్ని ఉద్యోగులు గుర్తించారని మరో సంఘం నేతలు ఆరోపిస్తన్నారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయిన ఉద్యమం కొనసాగుతోంది అని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Botsa satyanarayana, Employees, Sajjala ramakrishna reddy