Bhogi 2023: సాధారంగా సంక్రాంతి పండుగ (Sankranthi Festival) అంటే సినిమా సందడి కనిపిస్తుంది. అందుకే సంక్రాంతిక అంటే చిరంజీవి (Chiranjeevi), బాలయ్య (Balayya) లాంటి పెద్ద స్టార్ల సినిమాలు అయినా రిలీజ్ అవుతాయో లేవో కాని.. పండగ వచ్చింది అంటే.. మంత్రి అంబటి రాంబాబు (Amabati Rambabu) డ్యాన్స్ మాత్రం తప్పక ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది.. అంబటి మార్క్ డ్యాన్స్ స్టెప్పులు.. వైరల్ గా మారుతుంటాయి. అందురూ చెబుతున్నట్టే సంబరాల రాంబాబు.. పేరును నిజం చేస్తూ పండగ సంబరాలు సందడి చేస్తున్నారు. ప్రతి ఏడాది ఆయన డ్యాన్స్ వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. అందుకే సంక్రాంతి పొలిటికల్ హీరోగా నిలుస్తున్నారు. మరోసారి అంబటి రాంబాబు సూపర్ స్టెప్పులతో సందడి చేశారు. గతానికి ఇప్పటికి అంబటిలో చాలా మార్పు వచ్చింది. ఆయన లుక్ మొత్తం ఛేంజ్ అయ్యింది. అలాగే ఆ డ్యాన్స్ లోనూ కావల్సినంత వైబ్రేషన్ కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటి వరకూ చూస్తే ఈ సంక్రాంతి బెస్ట్ పెర్ఫామర్స్ అవార్డ్ గోస్ టూ అంబటి రాంబాబు అనేలా ఉంది..
తాజాగా ఆయన భోగీ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎప్పటిలానే భోగి మంటలు వేసి.. అక్కడ అంతా కలిసి ఆపాటలు ఆడారు.. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మహిళలతో కలిసి డ్యాన్స్ వేశారు.
Ambati Rambabu Dance || భోగీ వేడుకల్లో సంబరాల రాంబాబు.. మంత్రి అంబటి సూప... https://t.co/NI7RT8XF5Q via @YouTube #Sankranthi2023 #sankranti #Sankranti2023 #SankranthiWinner #Bhogi #Bhogi2023 #BhogiWishes #BhogiPongal #ambatirambabu #bhogicelebrations
— nagesh paina (@PainaNagesh) January 14, 2023
ఇప్పుడే కాదు.. సాధరణంగా పండగంటే చాలు.. రాంబాబుకు కొత్త జోష్ వచ్చేస్తుంది.. ఆ ఆటలు పాటలు అంత మాములుగా ఉండవ్.. గతేడాది కూడా ఇంతే.. పండగంటే.. ఆయన కాలు కదలక మానదు.. చిందు వేయక తప్పదు.. పోయిన సారి జస్ట్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇచ్చిన రాంబాబు.. ఈ సారికి తనలోని.. నాట్య కళను మొత్తం బయట పెట్టేశారు.
ఇదీ చదవండి : నారావారిపల్లిలో బాలయ్య సందడి.. జాగింగ్.. భోగి మంటలతో వీర సింహారెడ్డి హంగామా
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేసుకుంటూ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి సంబరాలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి సరదాగా గడిపారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి బంజారా మహిళలతో కలిసి హుషారుగా స్టెప్పులు వేశారు.
ఇదీ చదవండి : భోగి రోజు చిన్నపిల్లలకు పండ్లు ఎందుకు పోస్తారు..? దీని వెనుక ఇంత కథ ఉందా..?
మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులు వేసి సందడి చేయడం అక్కడివారిని అలరించింది. మంత్రి స్టెప్పులు వేస్తున్న సమయంలో అక్కడున్నవారంతా పెద్దగా కేరింతలు కొట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, Guntur, Makar Sankranti