హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Road Accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తూ తిరిగి రాని లోకానికి.. పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

Road Accident: దైవ దర్శనానికి వెళ్లి వస్తూ తిరిగి రాని లోకానికి.. పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

ప్రతికాత్మక చిత్రం

ప్రతికాత్మక చిత్రం

Road Accident: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అంతా దర్శించుకున్నారు. ఆ ఈశ్వరుడి దయ తమకు లభించిందని.. ఎంతో ఆనందంతో తిరిగి ఇంటికి పయనం అయ్యారు. కానీ అదే తమ జీవితానికి చివరి రోజు అవుతుందని ఊహించలేకపోయారు. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

ఇంకా చదవండి ...

Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వరుస ప్రమాదాలు  భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోటు రోడ్డు ప్రమాదం (Road Accidents) వార్తలు విషాదం నింపుతున్నాయి. రహదారులు రక్తమోడేలా చేస్తున్నాయి.. ప్రస్తుతం విద్యార్థులకు వేసవి సెలవులు (Summer Holidays) కావడం.. అందులోనే వారంతం అవ్వడంతో.. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం (Srisailam) పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని భక్తులు ఆశించారు. అనుకున్నట్టే సంతోషంగా శ్రీశైలానికి చేరుకున్నారు.. అనుకున్నట్టు స్వామివారిని దర్శించుకుని.. భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆ దేవుడి కృప తమకు దక్కిందని ఆనందంగా కనిపించారు.. ఆ ఆనందంతో తిరిగి ఇంటికి పయనం అయ్యారు. శ్రీశైలంలో స్వామి దర్శనం మాటల గురించి అంతా ముచ్చట్లు పెట్టుకొని.. హ్యాపీగా జర్నీ చేస్తున్నారు. అంతా తమ గ్రామ సరిహద్దుకు కూడా చేరుకున్నారు. కాసేపట్లో ఎవరి ఇంటికి వారు వెళ్తామని చెప్పుకుంటున్నారు. ప్రయాణం చేసి అలసిపోయామని. కాసేపటికి ఇంటికి చేరాగానే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుటన్నారు. కానీ ఊహించని కుదుపు వారి జీవితాల్లో విషాదం నింపింది.

అప్పటికే అర్థరాత్రి అయ్యింది సమయం.. అలా కబుర్లు చెప్పుకుంటూ కొంతమంది నిద్రలోకి జారుకోగా.. కొందరు కాసేపట్లో ఇంటికి చేరుకుంటామని మాట్లాడుకుంటున్నారు. అప్పటికే చుట్టు చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆ చీకటిలో ఊహించని ప్రమాదం చోటు చేసకుంది. ఆ వ్యాన్ లో నిద్రలో ఉన్నవారికి అసలు ఏం జరిగిందో తెలియకుండానే ప్రాణాలు పోయాయి.. మెలుకువగా ఉన్నవారకి ఏం జరిగిందో అర్థం కాకా హాహాకారులు పెట్టారు. ఆ షాక్ నుంచి తేరుకుని తమను రక్షించండి అంటూ ఆర్తనాదాలు పెట్టారు. కరెంటు కార్యాలాయం దగ్గర అర్థరాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణమైన ప్రమాదం పల్నాడు జిల్లా (Palnadu District) లోని చోటు చేసుకుంది.

ఇదీ చదవండి: వల్లభనేని వంశీ యూటర్న్.. టీడీపీ గొప్ప పార్టీ అంటూ పొగడ్తలు.. కారణం అదేనా..?

పోలీసులు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్నటాటా ఏస్ వాహానం.. రెంటచింతలోని కరెంట్ ఆఫీస్ దగ్గర ఆగి ఉన్న లారీని ఢీ కొంది. చుట్టు చిమ్మ చీకట్లు ఉండడం.. ఓవర్ లోడ్.. అతి వేగం.. డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణం అయ్యి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అందుకే ఆగి ఉన్న లారీని టాటా ఏస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీ కొట్టింది. దీంతో అందులో కిక్కిరిసి ప్రయాణిస్తున్న వారాంతం ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చదవండి: జూన్ నుంచి జనంలోకి జనసేన.. ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటన.. అజెండా ఇదే

ప్రమాదం అర్థరాత్రి అవ్వడంతో చుట్టుపక్కల వారు వెంటనే గమినించలేకపోయారు. అటువైపు వెళ్తున్నవారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల.. ఆ చిమ్మ చీకట్లలోనే సహాయక చర్యలు చేపట్టారు. కాస్త ఇబ్బంది అయినా.. క్షతగాత్రులను వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి త తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాద సమయంలో టాటా ఎస్ వాహనంలో 38 మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరంతా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Gunturu, Road accident

ఉత్తమ కథలు