Home /News /andhra-pradesh /

GUNTUR MARRIED WOMAN ASSASSINATED IN GUNTUR DISTRICT AS POLICE SUSPECT GANG RAPE FULL DETAILS HERE PRN GNT

Guntur Crime: ఏపీలో మరో దారణం.. పట్టపగలే మహిళపై గ్యాంగ్ రేప్.. హత్య! వాళ్లపైనే అనుమానం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎదో చోట మహిళలపై అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ (Vijayawada) ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్ (Vijayawada Gang Rape Case) ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా (Guntur District)లో మరో ఘోరం జరిగింది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎదో చోట మహిళలపై అకృత్యాలు చోటు చేసుకుంటున్నాయి. విజయవాడ (Vijayawada) ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్ (Vijayawada Gang Rape Case) ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా (Guntur District)లో మరో ఘోరం జరిగింది. ఓ ఇంట్లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుపతమ్మ స్థానికంగా పొలాలకు నీళ్లు పెట్టే పైపులను అద్దెకిస్తూ జీవిస్తోంది. ఎలక్ట్రికల్ పనులు చేసే ఆమె భర్త.. పనికోసం తిరుపతి (Tirupati) కి వెళ్లాడు. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటోంది.

    ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సమీప బంధువైన యువకుడు ఇంటికెళ్లి చూడగా ఆమె ఇంట్లోనే మృతి చెంది పడి ఉంది. ఒంటిపై దుస్తులు కూడా లేకపోవడం, గోళ్లతో రక్కిన గాయాలు, పంటి గాట్లు ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. ఇంట్లో బీరువా కూడా తెరిచి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఘటనాస్థలిలో తాగిపడేసిన మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఇది చదవండి: నపుంసకుడితో నా వల్ల కాదు.. నాలుగేళ్ళుగా అదే తంతు..! నదిలో ధర్నాకు దిగిన భార్య..


    జరిగిన ఘటనపై తిరుపతిలో ఉన్న భర్తకు పోలీసులు సమాచారం అందించారు. అతడు గత ఏడాది డిసెంబర్లో రైల్వే కాంట్రాక్టర్ దగ్గర ఎలక్ట్రికల్ పనులు చేసేందుకు వెళ్లినట్లు చెప్పాడు. మృతిపై అనుమానాలున్నాయని అతడు చెప్పినట్లు సమాచారం. మరోవైపు తిరుపతమ్మపై అఘాయిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె బంధువులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

    ఇది చదవండి: మునిగిపోయిందనుకొని నీళ్లలో గాలిస్తుంటే.. కూల్ గా బస్సుదిగింది.. గ్రామస్తుల ముఖచిత్రాలు ఇలా..!


    ఇదిలా ఉంటే గుంటూరు జిల్లాలోనే పట్టపగలు మరో దారుణం జరిగింది. కొల్లూరు మండలం చిలుమూరుకు చెందిన కారుకుట్ల రూపశ్రీ అనే మహళను ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ప్రవీణ్ కుమార్ అనే యువకుడితో చనువుగా ఉంటోంది. ఆమెపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్.. బుధవారం మొక్కజొన్న పొలాల్లో కూలీపనికి వెళ్లిన ఆమెను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Gang rape, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు