హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur News: పెళ్లిపందిరిలో ఉండాల్సినోళ్లు రోడ్డుపై కూర్చున్నారు.. మేటర్ తెలిస్తే షాకవుతారు..!

Guntur News: పెళ్లిపందిరిలో ఉండాల్సినోళ్లు రోడ్డుపై కూర్చున్నారు.. మేటర్ తెలిస్తే షాకవుతారు..!

ఆందోళన చేస్తున్న వధువు బంధువులు

ఆందోళన చేస్తున్న వధువు బంధువులు

Lovers: పరీక్షలు సరిగా రాయలేదన్న మనస్థాపంతో అలా చేసిందని అంతా భావించారు. కానీ కట్ చేస్తే సీన్ పెళ్లి పందిరికి మారింది. అక్కడంతా సందడి సందడిగా ఉంది. వరుడి ఇంటి వద్ద పెళ్లి వేదిక కావడంతో అమ్మాయి ముస్తాబయి వచ్చింది. కానీ చివరి నిముషంలో పోలీసుల ఎంట్రీతో పెళ్లి నిలిచిపోయింది.

ఇంకా చదవండి ...

Anna Raghu, News18, Amaravati

ఆ యువతి డిగ్రీ చదువుతోంది. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసింది. అంతా బాగానే ఉందనుకునే సమయానికి కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఐతే పరీక్షలు సరిగా రాయలేదన్న మనస్థాపంతో అలా చేసిందని అంతా భావించారు. కానీ కట్ చేస్తే సీన్ పెళ్లి పందిరికి మారింది. అక్కడంతా సందడి సందడిగా ఉంది. వరుడి ఇంటి వద్ద పెళ్లి వేదిక కావడంతో అమ్మాయి ముస్తాబయి వచ్చింది. కానీ చివరి నిముషంలో పోలీసుల ఎంట్రీతో పెళ్లి నిలిచిపోయింది. అక్కడ ఆమ్మాయి ఆత్మహత్యాయత్నానికి.. ఇక్కడ పెళ్లాగిపోవడానికి బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాంటి స్టోరీ లేదుకానీ.. సీతాకోక చిలుక లాంటి లవ్ స్టోరీ మాత్రం ఉంది. ఇక్కడ అమ్మాయి.. అక్కడ అబ్బాయికి మధ్య లవ్ ట్రాక్ నడిచింది.

చందమామ సినిమాలో హీరోలాగా ప్రేమ ఓకేగానీ.. పెళ్లికి మాత్రం కుదురదనడంతో మోసపోయానని గ్రహించిన అమ్మాయి సూసైడ్ కు యత్నించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెంకు చెందిన పవన్ కుమార్, అదే గ్రామానికి చెందిన కావ్య అనే యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అంతా బాగుందనుకునే టైమ్ కి పవన్ మాటమార్చాడు.. పెళ్లి గిళ్లీ జాన్తా నై అంటూ పెద్దలు చూపించిన అమ్మాయి మెడలో తాళికట్టేందుకు ఫిక్సైపోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన కావ్య ఆత్మహత్యకు యత్నించింది.

ఇది చదవండి: సోషల్ మీడియాలో మహిళల ఫోటో చూసి చాటింగ్ చేస్తున్నారా..! ఇదిగో ఈ వార్త మీకోసమే..!


ఇదిలా ఉంటే పవన్ కు తల్లిదండ్రులు తుళ్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో పెళ్లి కుదిర్చారు. పెళ్లికి ముందే వధువు కుటుంబ సభ్యులు కట్నకానుకలను పవన్ తల్లిదండ్రుల చేతుల్లో పెట్టారు. సోమవారం పెళ్లికి ముహూర్తం పెట్టుకొని, అమ్మాయిని పెళ్లికూతుర్ని చేసి అబ్బాయి ఇంటికి వెళ్లారు. కాసేపట్లో పెళ్లనగా కావ్య ఆత్మహత్యాయత్నం కేసులో పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పీటలమీద పెళ్లి ఆగిపోయింది.

ఇది చదవండి: ప్రేమించిన భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. కట్ చేస్తే ఓ రాత్రి షాకింగ్ సీన్..


దీంతో తాము మోసపోయామని గ్రహించిన బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగం ప్రవేశం వారికి సర్దిచెప్పారు. చివరకు పవన్ తల్లిదండ్రులు తీసుకున్న కట్నకానుకలను వెనక్కిచ్చేస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఇది చదవండి: ఇన్ స్టాగ్రామ్ పరిచయం ఆమె పాలిట శాపమైంది.. మద్యం తాగించి బాలికపై గ్యాంగ్ రేప్..


అసలు పవన్ కుమార్ కావ్యను పెళ్లిచేసుకొనేందుకు ఎందుకు నిరకరించాడని కారణాలు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. కావ్యాను పెళ్లిచేసుకోవడం పవన్ తల్లిదండ్రులకు ఇష్టం లేదు దీంతో కావ్యను వదిలించుకోవాలనుకున్నాడు. ఈ విషయం గ్రహించిన కావ్య.. ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పవన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఐతే పవన్ ను బెయిల్ పై బయటకు తీసుకొచ్చి పెళ్లిచేద్దామని తల్లిదండ్రులు భావించినా వర్కౌట్ కాలేదు.

First published:

Tags: Andhra Pradesh, Guntur, Love cheating

ఉత్తమ కథలు