హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YSR Pension Scheme: మగాడికి వితంతు పెన్షన్... ఇదెక్కడి విడ్డూరం... అవాక్కైన అధికారులు

YSR Pension Scheme: మగాడికి వితంతు పెన్షన్... ఇదెక్కడి విడ్డూరం... అవాక్కైన అధికారులు

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆర్థిక కష్టాల్లో ఉందని.. అయితే ఇచ్చిన మాట ప్రకారం తాను పేదలకు అండగా ఉంటున్నాను అన్నారు. తమ ప్రభుత్వానికి పేదలే ముఖ్యమని వారి కష్టాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నామని.. భవిష్యత్తులో మరిన్ని పథకాలు అందిస్తామని.. ఎప్పుడు మీ అందరి ఆశ్వీదవారాలు ప్రభుత్వానికి ఉండాలని కోరుతూ స్వయంగా లబ్దిదారులకు సీఎం జగన్ లేఖలు రాస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆర్థిక కష్టాల్లో ఉందని.. అయితే ఇచ్చిన మాట ప్రకారం తాను పేదలకు అండగా ఉంటున్నాను అన్నారు. తమ ప్రభుత్వానికి పేదలే ముఖ్యమని వారి కష్టాలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నామని.. భవిష్యత్తులో మరిన్ని పథకాలు అందిస్తామని.. ఎప్పుడు మీ అందరి ఆశ్వీదవారాలు ప్రభుత్వానికి ఉండాలని కోరుతూ స్వయంగా లబ్దిదారులకు సీఎం జగన్ లేఖలు రాస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) అందిస్తున్న పెన్షన్లు (YSR Pension Scheme) కొన్నిచోట్ల పక్కదారి పడుతున్నాయి. అనర్హులకు పెన్షన్ సొమ్ము అందుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద అర్హులైన వారికి నెలనెలా పలు సామాజిక పెన్షన్లను అందజేస్తోంది. ఇందులో వితంతు పెన్షన్ల కూడా ఉన్నాయి. భర్త చనిపోయి ఒంటరైన మహిళలకు ఈ ప్రభుత్వం ఈ పెన్షన్ అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయన్న ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఐతే ఓ గ్రామంలో పురుషుడికి వితంతు పింఛన్ మంజూరవుతుంది. ఏళ్లుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన వాలంటీర్లు కూడా దీనిని గుర్తించలేదు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా డోన్ మండలం ఎద్దుపెంట గ్రామానికి చెందిన ఖాశీం అనే వ్యక్తికి పెన్షన్ మంజూరవుతోంది. అతడి పెన్షన్ ఐడీ 113529781తో 2009లో పెన్షన్ మంజూరైంది. అప్పటి నుంచి అతడు నెలనెల పెన్షన్ తీసుకుంటున్నాడు. అధికారులు గుర్తించడంతో ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. అసలు పురుషుడికి వితంతు పెన్షన్ ఎలా మంజూరైందనేది ఎవరికీ అర్ధంకావడం లేదు.

బయటపడిందిలా..!

కాశీ కొంతకాలం క్రితం తన స్వగ్రామం నుంచి గుంటూరు జిల్లాకు వలసవెళ్లారు. వినుకొండ మండలం చిట్టాపురంలో ఉంటున్నారు. ఈ క్రమంలో చిట్టాపురం గ్రామ సచివాలయంలోని వెల్ ఫేర్ అసిస్టెంట్ వద్దకు పెన్షన్ తీసుకునేందుకు ఈనెల 4న వెళ్లారు. ఐతే పెన్షన్ కార్డు చూసి వితంతు పెన్షన్ ఎలా వస్తుందని ప్రశ్నించడంతో కాశీం సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు కాశీ స్వగ్రామమైన డోన్ మండలం ఎద్దుపెంట మండల అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి అదికారులు పొరబాటును గుర్తించి విచారణ చేపడతామని తెలిపారు. ఐతే 12 ఏళ్ల పాటు పెన్షన్ ఎలా ఇచ్చారు. అసలు మంజూరు చేసిందెవరు అనేది చర్చనీయాంశమైంది. ఇలాంటి పెన్షన్ ఇదొక్కటేనా.. ఇంకా ఎమైనా ఉన్నాయా..? అనేది అధికారులు విచారణ చేపట్టారు. కాశీం పెన్షన్ పై విచారణ చేపట్టేందుకు అధికారులు ఎద్దుపెంట గ్రామానికి వెళ్లగా.. అక్కడ అతడికి సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు. ఐతే గత రెండు నెలలుగా అతడికి పెన్షన్ ఇవ్వడం లేదని అధికారులు చెప్తున్నారు.

ఇది చదవండి: పోలింగ్ కేంద్రాల్లో యువకులు చేసిన పనికి అంతా షాక్.. రూల్స్ తెలియవా..?


ఒక పురుషుడికి వితంతు పెన్షన్ మంజూరవడమే విడ్డూరంగా ఉంది. ఇది ఎవరైనా కావాలని చేశారా...? లేక పొరబాటున మంజూరు చేశారా అనేది సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. దీనిపై లబ్ధిదారుడు కాశీం కూడా నోరు విప్పడం లేదు. 2009లో పెన్షన్ తక్కువగా ఉండటంతో వాటిని అందించే సిబ్బంది కూడా పట్టించుకోనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.2వేలకు పైగా పెన్షన్ అందడంతో ప్రతి ఒక్కరి అర్హతను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ క్రమంలో కాశీం వ్యవహారం బయటపడింది.

First published:

Tags: Andhra Pradesh, Ysr pension scheme

ఉత్తమ కథలు