Husband killed wife: డబ్బు మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. సంపాదన వేటలో పడి కొందరు ఉన్నతస్థానాలకు వెళ్తుంటే.. మరికొందరు నేరాల బాటపడుతున్నారు. డబ్బు కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హతమార్చాడో భర్త. అక్కడితో ఆగకుంటా అత్తగారి ఫోన్ చేసి నీ కూతుర్ని చంపేశానంటూ షాకింగ్ న్యూస్ చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) తాడేపల్లిలోని యాదవుల బజారుకు చెందిన పేరం రాములు, పేరం నరసమ్మ దంపతులకు ఐదుగురు కుమార్తెలు. కొన్నేళ్ల క్రితం తండ్రి రాములు మృతి చెందగా.. తల్లి నరసమ్మ పిల్లలకు పెళ్లిళ్లు చేసింది. వీరిలో నాలుగో కుమార్తె అయిన వరలక్ష్మి... గన్నవరంకు చెందిన కామినేని ప్రశాంత్ కుమార్ ను ప్రేమ వివాహం (Love Marriage)చేసుకుంది. ఐదుగురు కూతుళ్లు ఎవరికివారు కాపురాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే రైల్వే ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న నరమ్మకు రూ.30లక్షల నగదు వచ్చింది. ఈ నగదును ఎలాగైనా కొట్టేయాలని నాలుగో అల్లుడు ప్రశాంత్ కుమార్ స్కెచ్ వేశాడు. ఇల్లు కొనిస్తానంటూ నమ్మించి అత్తగారి దగ్గర రూ.30 లక్షలు తీసుకున్నాడు. అలాగే మిగిలిన నలుగురు కుమార్తెల వద్ద రూ.5లక్షలు వసూలు చేసి భార్యతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భార్యభర్తలిద్దరూ ఫోన్ స్విచ్చాఫ్ చేశారు.
దీంతో అల్లుడుపై అనుమానం వచ్చిన అత్త నరసమ్మ గన్నవరంలోని ప్రశాంత్ ఇంటికి వచ్చింది. అతని తల్లిదండ్రులు తమకు తెలియని చెప్పడంతో నరసమ్మ కంగుతింది. ఇదిలా ఉంటే అల్లుడు ప్రశాంత్.. నరసమ్మకు ఫోన్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పాడు. నీ కూతురు వరలక్ష్మిని చంపి పూడ్చిపెట్టానని.. ఎవరికైనా చెప్తే నీతోపాటు నీ నలుగురు కూతుళ్లను చంపేస్తానని బెదిరించాదు. దీంతో నరసమ్మ తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ కుమార్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపతిపురంలో జరిగిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన విశ్వానథపల్లి అప్పారావుకు.. ఐ.పోలవరం మండలం కొమరగిరికి చెందిన దేవితో 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. ఐతే కొన్నేళ్లుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్యభర్తలిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. ఇద్దరి మధ్య తీవ్రంగా గొడవలు జరుతుండటంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో అప్పారావు ఉద్యోగం పోయింది. ఆ తర్వాత మరోసారి అప్పారావు భార్యతో గొడవపడగా ఆగ్రహించిన ఆమె గొడ్డలితో నరికి భర్తను హత్య చేసింది. దీంతో అప్పారావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం దేవి అక్కడి నుంచి పరారైంది. ఘటానస్థలిని పరిశీలించిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి దేవి కోసం గాలిస్తున్నారు. తండ్రి హత్యకు గురవడం, తల్లి పరారీలో ఉండటంతో పిల్లలు ఒంటరివారయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.