Home /News /andhra-pradesh /

GUNTUR MAN END HIS LIFE AFTER FACING HARASSMENT FROM CALL MONEY MAFIA IN GUNTUR ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Guntur: ఒక్కసారి అప్పుచేస్తే జీవితాంతం కట్టాల్సిందే.. వీళ్ల వడ్డీలకు అంతే ఉండదు..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Guntur: అప్పు ఈ రోజుల్లో సామాన్యులే కాదు.. కాస్త డబ్బున్నవాళ్లు కూడా మోయలేని భారం. బ్యాంక్ లోన్ల సంగతి అటుంచితే ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులు మాత్రం ప్రతి ఒక్కరికీ గుదిబండలా మారతాయి. అసలు కంటే వడ్డీనే మోయలేని భారమవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు ప్రాణాలమీదకు తెస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India
    Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

    అప్పు ఈ రోజుల్లో సామాన్యులే కాదు.. కాస్త డబ్బున్నవాళ్లు కూడా మోయలేని భారం. బ్యాంక్ లోన్ల సంగతి అటుంచితే ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులు మాత్రం ప్రతి ఒక్కరికీ గుదిబండలా మారతాయి. అసలు కంటే వడ్డీనే మోయలేని భారమవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు ప్రాణాలమీదకు తెస్తుంది. ఇందుకు ప్రధాన కారణం కాల్ మనీ మాఫియా. కాల్ మనీ కబంద హస్తాల్లో ఎన్నో జీవితాలు బుగ్గిపాలయ్యాయి. సామాన్యుల అవసరాలు, బలహీనతలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలకు అప్పులిచ్చి వారి రక్తాన్ని పీల్చేస్తారు. కాల్ మనీ రాక్షసుల ఆగడాలకు ఎంతోమంది జీవితాలు బలయ్యాయి. అలా కొన్నిరోజుల క్రిత హైదరాబాద్ (Hyderabad) లో సూసైడ్ చేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ సూసైడ్ నోటే రాశాడు. అందులో ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలు ఎలా ఉంటాయో రాసుకొచ్చాడు.

    తాజాగా ఘటనతో కాల్ మనీ మాఫియా చీకటి కోణాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఈ ఫైనాన్స్ వ్యాపారులకు చిరు వ్యాపారాలే టార్గెట్ మార్కెట్లలో పూలు, పండ్లు, కూరగాయలు లేదా తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునేవారికి రోజు ఉదయం డబ్బు ఇస్తారు సాయంత్రం వడ్డీ కలిపి ఇచ్చేయాలి. ఆ రోజు వ్యాపారం సరిగ్గా జరగక డబ్బు చెల్లించని పక్షంలో వడ్డీకి వడ్డీ లెక్కగట్టి వసూలు చేస్తారు. ఒక పండ్ల బండి చిరు వ్యాపారిని న్యూస్ 18 ఆరా తీయగా.., వారి వద్ద అప్పు చేస్తే జీవితాంతం సంపాదించి కట్టినా వాళ్ళ అప్పులు తీర్చలేమని వాపోతున్నారు. అంతేకాదు వారి అన్యాయాలు, అక్రమాలకు అంతు ఉండదని తెలిపాడు. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారు భారీగా సంపాదిస్తున్నారని.., వారి ఆగడాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు పోలీసులకు లంచాలిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

    ఇది చదవండి: కొడుకు దోపిడీలకు.. తల్లిదండ్రుల స్కెచ్.. అబ్బా ఏం ఫ్యామిలీరా బాబు..!


    గుంటూరు (Guntur) నగరంలో రాజకీయ పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి పండ్ల మార్కెట్లో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతను పండ్ల వ్యాపారులకు వడ్డీకి డబ్బు ఇస్తుంటాడు ఇతనివద్ద అప్పు తీసుకుంటే వెంకన్న స్వామి కుబేరుడికి అప్పున్నట్లు ఎంత జమవేసినా అతని అప్పు తీరదు. ఇలా ఇతని వద్ద తీసుకున్న అప్పు తిరిగి కట్టలేక గుంటూరుకు చెందిన ఇద్దరు పండ్ల వ్యాపారులు ఊరువదిలి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

    ఇది చదవండి: ఒంటరి మహిళలే అతడి టార్గెట్.. మాటల్లోకి దించి లాడ్జికి తీసుకెళ్తాడు.. ఆపై మత్తుమందు ఇచ్చి..


    కాల్ మనీ మాఫియా ఇచ్చే అప్పులకు 10 నుంచి 15శాతం వడ్డీ వసూలు చేస్తారని.. సకాలంలో అసల, వడ్డీ కట్టకపోతే వడ్డీకి చక్రవడ్డీ, బారువడ్డీతో పాటు ఆలస్యంగా ఇచ్చావంటూ జరిమానాలు కూడా వసూలు చేస్తారు. ఆన్ లైన్ లోన్ యాప్స్ ఫోన్లలో వేధిస్తే.. వీరు నేరుగా ఇళ్లకు, మార్కెట్లకు వెళ్లి అందరిముందు నిలదీసి పరువు తీస్తారు. వీరి వేధింపులకు చిరువ్యాపారులు, చిన్నచిన్న పనులు చేసుకునేవారు బలైపోతున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur

    తదుపరి వార్తలు