GUNTUR MAN CHEATS GIRLFRIEND MARRY ANOTHER LADY IN GUNTUR DISTRICT VB
Lovers: నువ్వు అందంగా లేవు.. పెళ్లి చేసుకోవడం కుదరదంటూ ఆ యువకుడు ఏం చేశాడంటే..
ప్రతీకాత్మక చిత్రం
Lovers: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. వరుసకు బావా , మరదళ్లు అవుతారు. కొంత కాలానికి వారిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కానీ అతడు ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని మరొకరితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.
అతడి మరదలిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. అది నమ్మిన ఆమె అతడితో పార్క్ లు, పబ్ లు తిరిగింది. పెళ్లి చేసుకోవాలని ఆమె పట్టుపట్టడంతో దానికి అతడు ఒప్పుకున్నాడు. ఇరుకుటుంబాల పెద్దలు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి పనుల్లో భాగంగా వాళ్లిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. తీరా పెళ్లి దగ్గరపడుతుండడంతో అతను మరదలు అందంగా లేదని.. తాను ఈ పెళ్లి చేసుకోనంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ మాటలు విన్న అతడి మరదలు మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే సదరు వ్యక్తి ఇదే అదునుగా భావించి అతడు ప్రేమించిన మరో యవతిని పెళ్లి చేసుకోవడానికి ఇంటి నుంచి పారిపోయాడు ఈ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా బాపట్ల మండలం చినబేతపూడి గ్రామానికి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరుసకు మరదలు అయ్యే యువతిని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇరుకుటుంబాల పెద్దలు పెళ్లి చేసేందుకు నిర్ణయించారు. నిశ్చితార్థం కూడా జరిపించారు. పెళ్లి ఏర్పాట్లలో ఉండగా ప్రియుడు మరదలికి ఫ్రాన్సిస్ ఊహించని షాకిచ్చాడు. మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్న ఫ్రాన్సిస్.. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో మరదలు నిర్ఘాంతపోయింది. నువ్వు అందంగా లేవు.. నిన్ను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో ఆమె తీవ్రమనస్థాపానికి గురైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
యువతి బంధువులు, ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఉన్న సమయంలో అదను చూసి ఊరి నుంచి పారిపోయాడు. తాను ప్రేమించిన మరో యువతిని తీసుకెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న మరదలి కుటుంబ సభ్యులు మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసు ఉప సంహరించుకోవాలంటూ ఫ్రాన్సిస్ మరదలి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు వారు ససేమిరా అనడంతో వారి ఇంటికి నిప్పుపెట్టాడు. ఇల్లు మంటల్లో కాలి బూడిదైంది. ప్రేమ పేరుతో మోసం చేసి.. ఇంటిని కూడా కాల్చి బూడిద చేశాడంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.