GUNTUR MAN BOOKED FOR CHEATING ON THE NAME OF BIT COINS IN BAPATLA DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Bitcoin Trading in AP: బిట్ కాయిన్ బిజినెస్ అంటే ఎగిరి గంతేశాడు.. తెలిసితెలిసి పప్పులో కాలేశాడు..
ప్రతీకాత్మక చిత్రం
Cheating: మోసగించటానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. దోపిడీలకు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ఎంచుకుంటూ అమాయకులకే కాదు కాస్త తెలివైన వారిని కూడా బురిడీ కొట్టిస్తుంటారు. కొందరి అమాయకత్వం.., మరికొందరి అత్యాస వెరసి అడ్డగోలుగా దోచుకునేవారికి వరంగా మారుతుంది.
మోసగించటానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు కేటుగాళ్లు. దోపిడీలకు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ఎంచుకుంటూ అమాయకులకే కాదు కాస్త తెలివైన వారిని కూడా బురిడీ కొట్టిస్తుంటారు. కొందరి అమాయకత్వం.., మరికొందరి అత్యాస వెరసి అడ్డగోలుగా దోచుకునేవారికి వరంగా మారుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువమొత్తం సంపాదించాలని ఆశపడుతూ విద్యావంతులు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. కొత్తగా వచ్చే డబ్బు అటుంచితే తమ కష్టార్జితం రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం బడేవారిపాలెం నికి చెందిన శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు.అతనికి ఆన్లైన్ వ్యాపారం మరియు డిజిటల్ కరెన్సీ వ్యాపారాలపై అవగాహనా ఉంది. శ్రీనివాస్ కు మే నెలలో అనంతపురంకు చెందిన కిషోర్అనే వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది.
తాను బిట్ కాయిన్ల (Bitcoin) వ్యాపారం చేస్తానని మీరు బిట్ కాయిన్లను ఖరీదుచేసి అమ్మేవ్యాపారంలో పెట్టుబడి పెడితే రెటింపు లాభాలు వస్తాయని నమ్మబలికాడు. కిషోర్ మాటలను నమ్మిన శ్రీనివాస్ బిట్ కాయిన్ల వ్యాపారం లో పలుదఫాలుగా పెట్టుబడి పెడుతూ వచ్చాడు. అవసరమైనప్పుడల్లా ఫోన్ పే ద్వారా సుమారు నలబై లక్షల రూపాయల వరకు పెట్టుబడిపెట్టాడు. ఇంకేముంది శ్రీనివాస్ తన పెట్టుబడికి రెండింతలు మూడింతలు వస్తాయని ఆశలో ఉన్నాడు. ఐతే బిజినెస్ గురించి మాట్లేందుకు గత నెలాఖరులో కిషోర్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది.
ఇంకేముంది తాను అడ్డంగా మునిగిపోయానని అర్ధం చేసుకున్న శ్రీనివాస్.. కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. కిషోర్ కొంత నగదును బిట్ కాయిన్ల కోసం విదేశీయులకు పంపినట్లు గుర్తించారు. కొంతమొత్త మరొకరి.. మరికొంత తన అవసరాలకు వాడుకున్నట్లు దర్యాప్తులో తేల్చారు. ఐతే కిశోర్ కు ఎవరితోనైనా సంబంధాలున్నాయా..? ఇప్పటివరకు మెరవరినైనా మోసం చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల బిట్ కాయిన్ల వ్యవహారంలో అమిత్ భరద్వాజ్ కుంభకోణం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. భారీ ఎత్తున మల్టీ లెవల్ మార్కెటింగ్‌తో 18 నెలల పాటు బిట్ కాయిన్లపై పెట్టుబడి పెడితే ప్రతినెలా డిపాజిట్లలో 10శాతం ఆదాయం చూపిస్తానని హామీ ఇచ్చాడు. ఆ కాలంలో తమ పెట్టుబడులు పెరుగుతాయని హామీ ఇస్తూ బిట్ కాయిన్లలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను కోరారు. ఇలా అమిత్ పెట్టు బడిదారుల్ని భారీ ఎత్తున సుమారు తొంబై వేల కోట్ల రూపాయలు మోసం చేసి, చివరకు బిచాణా ఎత్తేశాడు. దీంతో ప్రతి నెల ఒక్కసారి వచ్చి పడుతున్న ఆదాయం కనుమరుగు కావడంతో పెట్టుబడిదారులకు అనుమానం రావడం, కేసు ఈడీ అధికారుల చేతుల్లోకి వెళ్లడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.