GUNTUR MAN BOOKED FOR ATTEMPT TO MURDER HER LOVER AFTER HAVING EXTRAMARITAL AFFAIR IN PALNADU DISTRICT FULL DETAILS HERE PRN GNT
Extramarital Affair: భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం.. ఆరు నెలల తర్వాత ఇలా అవుతుందని ఎవరూ ఊహించలేదు..
తులసీరామ్ (ఫైల్), ఆస్పత్రిలో ఫాతిమా
Guntur Woman: ఈ రోజుల్లో అగ్నిసాక్షిగా తాళికట్టిన బంధాలకే చాలా మంది విలువ ఇవ్వడం లేదు. అలాంటిది అక్రమ సంబంధాలకు విలువ ఉంటుందనుకోవడం పొరబాటే అవుతుంది. భర్త నుంచి విడిపోయి ప్రియుడితో వ్యవహారం నడుపుతున్న ఓ వివాహితకు అతడి నుంచి ఊహించని అనుభవం ఎదురైంది.
ఈ రోజుల్లో అగ్నిసాక్షిగా తాళికట్టిన బంధాలకే చాలా మంది విలువ ఇవ్వడం లేదు. అలాంటిది అక్రమ సంబంధాలకు విలువ ఉంటుందనుకోవడం పొరబాటే అవుతుంది. భర్త నుంచి విడిపోయి ప్రియుడితో వ్యవహారం నడుపుతున్న ఓ వివాహితకు అతడి నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా (Palanadu District) దాచేపల్లికి చెందిన ఫాతిమాకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలు. ఐతే భర్తతో విభేదాలు రావడంతో అతడి నుంచి విడిపోయిన ఫాతిమా ఏడాది క్రితం విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో గురజాలకు చెందిన అంబులెన్స్ డ్రైవర్ తులసీరామ్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారడంతో.. ఆమెను సత్తెనపల్లిలోని ఓ అద్దె ఇంట్లో ఉంచి సహజీవనం చేస్తున్నాడు.
ఐతే వీరి బంధం సజవుగా సాగలేదు. ప్రియురాలు ఎవరితోనో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించిన తులసీరామ్ ఆమెను నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం ఫాతిమాతో గొడవ పడ్డాడు. క్షణికావేశానికి లోనే కత్తితో ఆమె గొంతుకోసి పరారరయ్యాడు. తీవ్రగాయాలతోనే ఆమె రోడ్డుమీదకు రావడంతో సమీపంలోని జనసేన కార్యాలయంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు గమనించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. తెనాలి ఐతనగర్ కు చెందిన సముద్రాల పవన్ అలియాస్ లడ్డూ అనే వ్యక్తికి చదలవాడకు చెందిన అత్తోటి దీప్తి 13 ఏళ్ళ క్రితం ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో దీప్తివేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. పెళ్లైన తర్వాత కూడా లడ్డూతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఐతే మూడేళ్ల క్రితం దీప్తికి రవికిరణ్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటి నుంచి ఒకరికి తెలియకుండా ఒకరితో ఎఫైర్ నడిపిస్తూ వస్తోంది.
ఐతే దీప్తీ మొదటి ప్రియుడు లడ్డూపై రౌడీ షీట్ ఉండటంతో ఎఫైర్ సంగతి తెలిస్తే చంపేస్తాడని భయపడింది. కొన్నాళ్లుగా రవి కిరణ్ కు దూరంగా ఉంటూ వచ్చింది. అయినా అతడు వెంటపడటంతో ఓకన్నింగ్ ప్లాన్ వేసింది. తాను 20వేలు అప్పుగా తీసుకున్నందుకు రవికిరణ్ అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ ప్రియుడు లడ్డూకి చెప్పింది. దీంతో అందరూ కలిసి అతడ్ని మట్టుబెట్టాలని ప్లాన్ వేశారు. పథకం ప్రకారం దీప్తి.. రవికిరణ్ కు ఫోన్ చేసి తెనాలిలోని నన్నపనేని కృష్ణ చైతన్య ఇంటికి పిలిపించింది. అక్కడ లడ్డూ, అతడి స్నేహితులు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో రవికిరణ్ మృతి చెందాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.