అన్నా రఘు, గుంటూరు ప్రతినిధి, న్యూస్18
Mother and Son: తల్లి . ఈ భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరిపాలిట దైవం. తమను ఏం చేసినా, ఎన్ని మాటలన్నా ఊరుకుంటారుగానీ.. తల్లిని ఒక్కమాటన్న పిల్లలు పడరు. ఆఖరికి తండ్రిని కూడా ఎదురిస్తారు. అలాంటిది ఓ బయటకి వ్యక్తి.. తల్లిగురించి కొడుకును ఏం అడగకూడదో అదే అడిగాడు. ఆలా అడిగిన తర్వాత ఏ కొడుకైనా ఎలా స్పందిస్తాడో అతడు కూడా అలాగే స్పందించాడు. కాకపోతే చట్టం ముందు నేరస్తుడిగా నిలబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) జాగర్లమూడి గ్రామానికి చెందిన బొద్దు మస్తాన్ అనే వ్యక్తి.. అదే గ్రామానికి చెందిన అట్లూరి శ్రీనివాసరెడ్డికి చెందిన వ్యవసాయ భూమిని (Agriculture) కౌలుకు తీసుకొని సాగుచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డికి మస్తాన్ కి మధ్య స్నేహం ఏర్పడింది.
ఐతే మూడు నెలల క్రితం అట్లూరి శ్రీనివాస్ రెడ్డి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. గతంలోనే బొద్దు మస్తాన్ తండ్రి కూడా మృతి చెందడంతో ఆమె ఒంటరిగా ఉంటుంది. దీంతో మస్తాన్ తల్లిపై కన్నేసిన శ్రీనివాస్ రెడ్డి. అతడ అడగరాని మాట అడిగాడు. నాకు భార్య లేదు.. మీ అమ్మకు భర్త లేదు.. అందుకే మీ అమ్మను నా దగ్గరకు పంపు అని కోరాడు.
శ్రీనివాస రెడ్డి అన్న మాటలకు మస్తాన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన తల్లిపైనే కన్నేసి ఆ మాట తనకే చెప్పడంతో అతడ్ని ఈ భూమ్మీద లేకుండా చేయాలని భావించాడు. అదును కోసం ఎదురుచూస్తున్న మస్తాన్.. ఆగస్టు 28న మద్యం తాగుదామని శ్రీనివాస్ రెడ్డిని పిలిచాడు. అతడ్ని తన బైక్ పై ఎక్కించుకొని జాగర్లమూడి శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం గుంటూరు రూరల్ బొండపాటు శివారుకు తీసుకెళ్లి మరోసారి మద్యం తాగించాడు.
ఐతే మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ రెడ్డి.. మీ అమ్మను పంపమంటూ మరోసారి మస్తాన్ ను కోరాడు. అప్పటికే అతడిపై కక్షతో ఉన్న మస్తాన్.. బండరాయితో మోది శ్రీనివ్స రెడ్డిని హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేయగా.. జరిగిన విషయం బయటపడింది. మస్తాన్ ను అదుపులోకి తీసుకోని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.
దీంతో అతడిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. తన తల్లి గురించి అసభ్యంగా మాట్లాడటం, తనపైనే ఒత్తిడి తేవడం వల్లే ఈ దారుణానికి పాల్పడినట్లు మస్తాన్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే మస్తాన్ కుటుంబ సభ్యులు మాత్రం.. శ్రీనివాస్ రెడ్డికి తగిన శాస్తే జరిగిందని చర్చించుకుంటున్నారు. కన్నతల్లి గురించి అలా ఎవరు మాట్లాడినా ఇలాగే జరుగుతుందని చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Extramarital affairs, Murder