GUNTUR MAN ARRESTED FOR CHEATING YOUNG WOMAN ON THE NAME OF LOVE MARRIAGE IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Love Cheating: అమ్మాయిలు ఇలాంటి వాళ్లనే ఎందుకు నమ్ముతారో..! ప్రేమ పేరుతో సర్వం దోచేశాడుగా..!
ప్రతీకాత్మక చిత్రం
Love Cheating: ఇద్దరం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లం.. అందుకే స్మార్ట్ సర్వీసెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేద్దామని.. పెళ్లయ్యాక ఇద్దరం హాయిగా ఉండొచ్చని నమ్మబలికాడు. ఇంకేముంది మనోడి మాటలు బాగా నమ్మేసిన యువతి.. పలు బ్యాంకులు, తనకున్న క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు రూ.25లక్షలు లోన్ తీసుకుని ఆతడి చేతిలో పెట్టింది.
ప్రేమ (Love). ఈ మాటకు ఎవరైనా పడిపోవాల్సిందే. లవ్ ప్రపోజల్ ను ఒప్పుకోవడానికి కాస్త టైమ్ పట్టినా చాలా మంది కొంతకాలం తర్వాత ప్రేమ బంధంలోకి అడుగుపెడతారు. అలా ఓ యువతిని ప్రేమ పేరుతో నమ్మించి ముగ్గులో దించిన ఓ యువకుడు ఆమె దగ్గర సర్వం దోచేశాడు. ఆమెతో బ్యాంక్ లోనూ తీయించడమే కాకుండా.. ఆమె హ్యాండ్ బ్యాగ్, కారుతో సహా పరారయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (AndhraPrades) లోని గుంటూరు జిల్లా (Gubtur District) నల్ల చెరువుకు చెందిన ఓ యువతి విప్రో సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ (Software Engineer) గా పనిచేస్తోంది. గత ఏడాది ఏ చాటింగ్ యాప్ ద్వారా నల్లపాడులోని APHB కాలనీకి చెందిన చిల్లంపూడి విజయభాస్కర్ రెడ్డి అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్లు చాటింగ్ తర్వాత ఆమెను ప్రేమిస్తున్నాని ప్రపోజ్ చేశాడు. తాను ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్ చేస్తుంటానని.., సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నానని ఆమెతో చెప్పాడు. దీంతో ఆ యువతి విజయభాస్కర్ రెడ్డిని ప్రేమించింది. ఆ తర్వాత అర్జెంట్ గా డబ్బులు కావాలంటూ ఆమె దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకున్నాడు.
బిజినెస్ పేరుతో స్మార్ట్ గా దోచేశాడు
ఇద్దరం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లం.. అందుకే స్మార్ట్ సర్వీసెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేద్దామని.. పెళ్లయ్యాక ఇద్దరం హాయిగా ఉండొచ్చని నమ్మబలికాడు. ఇంకేముంది మనోడి మాటలు బాగా నమ్మేసిన యువతి.. పలు బ్యాంకులు, తనకున్న క్రెడిట్ కార్డుల ద్వారా దాదాపు రూ.25లక్షలు లోన్ తీసుకుని ఆతడి చేతిలో పెట్టింది. అంతేకాదు ఆమెతో ఓ కారు కూడా కొనుగోలు చేయించాడు.
అమెను అన్నిరకాలుగా మోసం చేసిన విజయ్ భాస్కర్.. ఈ ఏడాది మే 25న గుంటూరు అరండల్ పేటలోని ఓ హోటల్ కు భోజనానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను మెల్లగా మాటల్లోకి దించాడు. ఆమె వాష్ రూమ్ కు వెళ్లగా టేబుల్ పై ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్, కారు తాళాలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడు మరికొంత మంది యువతులను ఇలాగే నమ్మించి మోసం చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బట్టతలకు విగ్గుపెట్టి ముంచేశాడు..
గతంలో చిత్తూరులో ఇలాంటి మోసమో వెలుగు చూసింది. చిత్తూరు సమీపంలోని ఎన్.ఆర్ పేటకు చెందిన యువతికి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమయ్యాడు. వెబ్ సైట్లో ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెతో మాట్లాడాడు. మ్యాట్రిమోనీ సైట్ లో మీ ప్రొఫైల్ చూశానని ఆమెను ముగ్గులోకి దించాడు. అంతేకాదు బట్టతలకు విగ్గుపెట్టి అందగాడిలా కటింగ్ ఇచ్చాడు. తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని.. ఏడాదికి 20 లక్షలకు పైగా జీతమొస్తున్నట్లు ప్రొఫైల్ లో ఉండటం ఆ యువతి నమ్మింది. ఆమెకు బాగా దగ్గరైన శ్రీనివాస్ తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఆమె దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చీటర్ ను అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.