చిన్నపిల్లల మధ్య గొడవ పెద్దల వరకు వెళ్లింది... ఇంత దారుణం జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు...

ప్రతీకాత్మక చిత్రం

చిన్నపిల్లల గొడవల్లో పెద్దవాళ్లు అంతగా తలదూర్చరు. ఒకవేళ వెళ్లినా ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చూస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం…

 • Share this:
  వాళ్లిద్దరిదీ తెలిసీ తెలియని వయసు.. ఆటల్లో గెలుపు కోసం పోట్లాడుకుంటారు. ఆ తర్వాత కలిసిపోతారు. చిన్నపిల్లల గొడవల్లో పెద్దవాళ్లు అంతగా తలదూర్చరు. ఒకవేళ వెళ్లినా ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ సద్దుమణిగేలా చూస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తన తమ్ముడి కొడుకుతో గొడవ పడిన బాలుడిపట్ల రాక్షసుడిగా మారాడు. అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన పఠాన్ అయూద్ ఖాన్, సైబాదీ దంపతులకు జానీ బాషా, అఫ్రిద్ అనే ఇద్దరు కుమారులున్నారు. పదో తరగతి చదువుతున్న అఫ్రిద్.. అదే గ్రామానికి చెందిన మరో బాలుడు కలిసి మూడు రోజుల క్రితం వాలీబాల్ ఆడారు. ఆటలో రేగిన వివాదం కారణంగా ఇద్దరు గొడవపడ్డారు. ఈ గొడవ సంగతి ఆ బాలుడు తల్లిదండ్రులతో చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి పెదనాన్న షేక్ పెదబాజీ.. అఫ్రిద్ పై పగ పెంచుకున్నాడు.

  అఫ్రిద్ ను ఎలాగైనా హత్య చేయాలని భావించాడు. అనుకున్నదే తడపుగా తన బాబాయితో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అఫ్రిద్ ను తన ఇంటి ముందుగు రాగానే పెదబాజీ కత్తితో పొడిచాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అత్యంత కిరాతంగా 10-12 సార్లు పొడిచాడు. ఘటనాస్థలికి సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉండటంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పెదబాజీని పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ అఫ్రిద్ ను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నరసరావుపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఐతే తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అఫ్రిది మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

  ఇది చదవండి: వీడు చేసిన పాపానికి 20ఏళ్ల జైలు కాదు.. ఇంకా పెద్ద శిక్ష వేసినా తప్పులేదు..  నిందితుడు షేక్ బాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై హత్య కేసు నమోదు చేశాడు. గతంలోనూ బాజీ నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం అతడు ఓ పార్టీకి గ్రామ అధ్యక్షుడిగా ఉన్నాడు. చిన్నపిల్లల గొడవను మనసులో పెట్టుకొని ఇంతటి దారుణానికి పాల్పడిన షేక్ బాజీపై కఠిన చర్యలు తీసుకోవాలని అఫ్రిద్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆటలో గొడవ జరిగిన విషయం తమకు తెలియదని.. ముందుగానే తెలిస్తే వివాదం లేకుండా చూసుకునేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంటుందనుకున్న కుమారుడు దూరమవడంతో అఫ్రిద్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

  ఇది చదవండి: చిన్నారులపై కీచకపర్వం.. వీడికి ఏ శిక్ష వేసినా తప్పులేదు..  పోలీసులు మాత్రం హత్యకు వాలీబాల్ లో జరిగిన గొడవే కారణమా.. లేక కుటుంబ కక్షలు, ఇతర వ్యవహారాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. షేక్ బాజీతో పాటు గొడవకు కారణమైన బాలుడ్ని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published: