మేనమామ అంటే మేనకోడలికి తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. కానీ అతడు ఆమెపైనే కన్నేశాడు. ఎలాగైనా దక్కించుకోవాలని కుట్రపన్నాడు. అప్పటికే ఆమెకు పెళ్లైనా తనకే దక్కాలని భావించాడు. ఆమె భర్తను హత్య చేయించేందుకు సుపారీ కూడా ఇచ్చాడు. హత్యాయత్నం బెడిసికొట్టడంతో పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా (Prakasham District) అద్దంకి ప్రాంతానికి చెందిన బ్రహ్మారెడ్డికి గతంలో పెళ్లైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య అతడ్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో అప్పటికే పెళ్లైన తన మేనకోడలిపై కన్నేశాడు. ఇద్దరి మధ్య పదేళ్లకుపైగా వయసుతేడా ఉంది. ఆమె భర్తను అడ్డుతొలగిస్తే మేనకోడల్ని పెళ్లిచేసుకోవచ్చని భావించాడు. వెంటనే ఆమె భర్త యోగిరెడ్డిని హత్య చేసేందుకు స్కెచ్ వేశాడు. వెంటనే గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతానికి చెందిన నలురుగు యువకులను సంప్రదించి వారికి రూ.4లక్షలు సుపారీ ఇచ్చేలా ఒఫ్పందం కుదుర్చుకున్నాడు.
హంతక ముఠాకు ముందుగా కొంత డబ్బు అడ్వాన్స్ గా ఇచ్చాడు. బ్రహ్మారెడ్డి మేనకోడలి భర్త అబ్బన యోగిరెడ్డి పాల వ్యాపారం చేస్తుండేవాడు. ఈ ఏడాది ఆగస్టులో అతడ్ని చంపేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈనెల 3వ తేదీన మరోసారి హత్యకు స్కెచ్ వేశారు. అద్దంకి సమీపంలోని ధర్మవరం గ్రామం వద్ద యోగిరెడ్డిని అటకాయించి కత్తులు, కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. వారి నుంచి తప్పించుకున్న యోగిరెడ్డి ఒకర్ని పట్టుకొని ఆరాతీయగా.. నీ భార్య మేనమామే చంపమని సుపారీ ఇచ్చినట్లు తెలిపారు.
దీంతో అతడు బ్రహ్మారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్రహ్మారెడ్డితో పాటు హత్యకు యత్నించిన మల్లికార్జున రెడ్డి, అజయ్ కుమార్, సాయికిరణ్, కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హత్యకు యత్నించడానికి గల కారణాలను రాతీయగా.. మేనకోడల్ని పెళ్లి చేసుకునేందుకే ఆమె భర్తను హత్యకు కుట్రపన్నినట్లు అంగీకరించాడు. దీంతో అతడిపై హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని కోదాడకు చెందిన బాలాజీ నాయక్ అనే వ్యక్తిని ప్రియుడు సాయంతో అతడి భార్య బుడ్డి కిరాతకంగా హత్య చేయించించింది. బాలాజీ నాయక్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లగా.. అతడి భార్య బుజ్జి స్థానికంగా పరశురామ్ అనే వ్యక్తిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన సుఖానికి అడ్డొస్తున్న భర్తను తమొందించాలని ప్రియుడితో కలిసి మర్డర్ స్కెచ్ వేసింది బుజ్జి.
దీంతో ఆమె ప్రియుడు పరశురాం తనకు పరిచయస్తుడైన గుంటూరు జిల్లాకు చెందిన పవన్ నాయక్ తో విషయం చెప్పాడు.. అతడు మరో ముగ్గురితో కలిసి బాలాజీని చంపడానికి రూ.90వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీన ఇంతడ్ని ఇంటివద్దే మర్డర్ చేయడానికి ప్లాన్ వేశారు. కానీ అది వర్కవుట్ కాలేదు. ఇటీవల బాలాజీనాయక్ ఇంట్లో నిద్రిస్తుండగా భార్య, ఆమె ప్రియుడు, సుపారీ తీసుకున్న ముఠా కలిసి అతడ్ని దారుణంగా చంపేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Crime news, Murder attempt, Prakasham dist