Home /News /andhra-pradesh /

GUNTUR MALPOORI SPECIALITY AND HOW TO MAKE IT IN DETAIL PCV GSU NJ

Guntur : గుంటూరు మిర్చికే కాదు..మాల్‌పూరీ స్వీట్‌కు కూడా ఫేమస్‌..! ఒక్కసారైనా టేస్ట్‌చేయాల్సిందే..!

Guntur Special Malpoori Making Process

Guntur Special Malpoori Making Process

కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, గుంటూరు మిర్చి అనే మాటలు బాగా నానుడిలో ఉంటాయి. మిగతా ఊరి పేర్లు స్వీట్స్‌తో ఉంటే గుంటూరు మాత్రం మిర్చితో ఫేమస్‌ అయింది. కానీ ఇక్కడ కూడా ఒక స్పెషల్‌ స్వీట్‌ ఉందని మీకు తెలుసా..? అదేంటంటే..?

  (జంగం సుమంత్, న్యూస్ 18, గుంటూరు)

  Malpuri Sweet: గుంటూరు స్పెషల్‌ స్వీట్‌.. మాల్‌ పూరీ.. పంచదార పాకంలో ఊరిన పూరీలో కోవా స్టఫ్‌ చేసి అందించే ప్రత్యేక రెసిపీ. గుంటూరులో ఏ ఫంక్షనైనా. ఏ శుభకార్యాలైనా… ఈ మాల్‌ పూరి స్వీట్‌ లేకుండా భోజనాలు ఉండవంటే నమ్మండి. ఇంకా చెప్పాలంటే గుంటూరులో ఏమూలకు వెళ్లినా ఇది దొరుకుతుంది. బయట షాప్‌లలోనే కాదు.. కొందరు తమ ఇళ్లలోనే మాల్‌పూరీని హోల్‌సేల్‌గా తయారుచేసి ఫంక్షన్స్‌కు క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు.

  Read This : Astrology: రాబోయే 13 రోజులు.. ఈ 3 రాశుల వారికి కలిసొచ్చే కాలం.. అన్నీ శుభాలే..

  పెళ్లిళ్లు, ఫంక్షన్‌లలోనే కాదు మాల్‌పూరీని డైలీ తినాలనుకుంటారు చాలామంది. అలాంటి వాళ్ల కోసం ప్రత్యేకంగా కేవలం మాల్‌పూరీ మాత్రమే తయారుచేసే షాప్‌లు ఉన్నాయి. గుంటూరులోని బ్రాడీపేటకు వెళ్తే అక్కడ మనకు మాల్‌పూరీ అప్పుడప్పుడే వేడి వేడిగా తయారుచేసి మనకు సర్వ్‌ చేసే షాపులు ఉంటాయి.

  గుంటూరు ఫేమస్‌ స్వీట్‌

  గుంటూరు కొత్తపేటలో వలి భాయ్ చేత్తో చేసిన నేతి మాల్ పూరి రుచి మరెక్కడా రాదంటారు స్థానికులు. 20 ఏళ్లుగా వలి భాయ్… సుభాని మాల్ పూరి సెంటర్ నడుపుతున్నాడు. వలి తండ్రి మిఠాయి వ్యాపారం చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో చిన్నతనంలోనే చదువు మానేసిన వలి కొంత కాలం.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవాడు. తర్వాత వాళ్ల నాన్నతో కలిసి స్వీట్‌ షాపును చూసుకునేవాడు. చిన్న వయసులో వ్యాపార మెలకువలు నేర్చుకున్నాడు.

  17ఏళ్లకే మాల్‌పూరీ స్వీట్‌ తయారీ

  మిఠాయి వ్యాపారంలోనే ఏదైనా విభిన్నంగా ప్రయత్నం చేయాలి అనుకున్నాడు. మాల్ పూరి కోవా తయారీ, టేస్ట్‌ వలీకి బాగా నచ్చాయి. తన 17వ ఏటనే.. మాల్‌పూరీ కోవా వ్యాపారం వైపు అడుగులు వేశాడు. తనకు తానుగా ఎవరి సహాయం లేకుండా పని నేర్చుకొని.. ఒక చిన్న షాప్ పెట్టాడు. అందరిలా కాకుండా నేతితో ప్రారంభించి మంచి క్వాలిటీతో అధ్బుతమైన రుచి అందించాడు.

  20ఏళ్లుగా కొనసాగుతున్న వలీబాయ్‌ మాల్‌పూరీ షాపు

  వలీ తయారుచేసిన మాల్‌పూరీ మంచి టేస్టు ఉండటంతో గిరాకీ పెరిగింది. కస్టమర్లు రెగ్యులర్‌గా వచ్చేవాళ్లు. అలా ఒక్కడిగా మొదలుపెట్టి…అంచలంచెలుగా ఎదిగాడు! మాల్ పూరిలో వాడే కోవను ..ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తాడు వలీభాయ్‌. మాల్ పూరికి ఒక ప్రత్యేక రుచి చేర్చి నగరంలో తనదైన ముద్ర వేసుకున్నాడు. గత 20ఏళ్లుగా దిగ్విజయంగా ఈ బిజినెస్‌ చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు.

  కావాలంటే ఈ మాల్‌పూరీని మనం ఇంట్లోనూ తయారుచేసుకోవచ్చు.. వలీబాయ్‌ షాపులో వచ్చినంత టేస్ట్‌ రాకపోయినా.. మనం తినేలా ఉంటుందనుకోండి.. ఇంతకీ ఈ స్పెషల్‌ స్వీట్‌ను ఎలా తయారుచేస్తారో చూద్దాం…

  మాల్‌పూరి చేయడం ఎలా?

  ది బెస్ట్‌ టెక్నిక్స్‌తో పక్కా కొలతలతో చేస్తే తప్పకుండా ఈ స్వీట్‌ రెసిఫీని మనం ఇంట్లోనే ట్రై చేయొచ్చు. మొదట కోవా తయారుచేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాలతో తయారుచేసుకునే ఈ కోవా కోసం… మిడియమ్‌ ఫ్లేమ్‌ మీద పాలను వేడిచేస్తూ…అందులో మధ్యమధ్యలో పాలపొడిని వేస్తూ ఉండలు లేకుండా దాదాపు 15 నిమిషాల పాటు కలియపెడుతూ ఉండాలి. ఆ తర్వాత పాకం కోసం పంచధారను వాడాలి. పంచధార పాకాన్ని పక్కన పెట్టుకోవాలి.

  ఆ తర్వాత గోధుమపిండి, మైదాపిండికి తగినంత నీరు పోసుకుని…ఉండలు కట్టకుండా పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ముందుగా మనం తయారుచేసుకున్న పంచాధార పాకాన్ని కొంచెం ఇందులో కలపాల్సి ఉంటుంది. ఇది మన ఇంట్లో దోసెపిండిలా కొంచెం జావగా కలుపుకోవాలి. అంతే పూరీల పిండి రెడీ అయిపోనట్లే.

  ఆ తర్వాత స్టవ్‌ మీద ఉన్న నూనె/నెయ్యి బాండీలో ఆ పిండితో పూరీలుగా వేసుకోవాలి. ఒకచోట మాత్రమే వెంటనే పోస్తే..వేడి వేడి నూనెలో పడిన ఆ పిండి పూరిలా పైకి పొంగుతుంది. అలా వేగిన పూరిని వెంటనే బయటకు తీసి..పాకంలో వేయాలి. అలా పాకంలో ముంచిన పూరిని వెంటనే బయటకు తీసి జల్లెడలో వేసుకోవాలి. అలా చల్లారిన పూరి మధ్యలో తొలత తయారుచేసి పెట్టుకున్న కోవాను పెట్టి…పూరిని మధ్యలోకి మడవాలి.. అంతే మీకు కావల్సిన టేస్టీ మాల్‌ పూరీ రెడీ అయినట్లే..

  Read This :  Guntur : పగలంతా రెక్కీ..రాత్రికి డ్యూటీ..! భక్తులుగా దండంపెడుతూనే దేవుడి సొమ్ముకు కన్నం..!

  గుంటూరులో ఫేమస్‌ అయిన ఈ మాల్‌ పూరీ స్వీట్‌ను మీరు తప్పకుండా రుచి చూడండి. మీకు ఒకవేళ ఇంట్లో చేసుకోవడం కుదరకపోతే…ఇదిగో గుంటూరులో ఏ స్వీట్‌ షాపులోనైనా దొరుకుతుంది. క్వాలిటీది కావాలంటే మాత్రం వలీబాయ్‌ మాల్‌పూరీ సెంటర్‌కు వెళ్లండి.
  అడ్రస్‌: పోస్ట్ ఆఫీస్ రోడ్, కొత్తపేట ,గుంటూరు. ఆంధ్రప్రదేశ్‌- 522001
  ఫోన్ నంబర్: 9948548586

  ఎలా వెళ్లాలి?

  గుంటూరు పాత బస్టాండ్ సెంటర్ నుండి లోకల్‌ ఆటోలు అందుబాటులో ఉంటాయి. సిటీ బస్సులు కూడా ఉన్నాయి. కొత్తపేటలోని పోస్ట్ ఆఫీస్‌ రోడ్‌కు వెళ్లి వలీబాయ్‌ మాల్‌పూరీ సెంటర్‌ అంటే ఎవ్వరైనా చెబుతారు.
  Published by:V. Parameshawara Chary
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Guntur, Local News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు