Home /News /andhra-pradesh /

GUNTUR LAB TECHNICIAN FORCED TO STRIP YOUNG GIRL IN ECG LAB AT GUNTUR GGH FULL DETAILS HERE PRN GNT

Young Girl: ఈసీజీ కోసం వెళ్తే దుస్తులు విప్పమన్నాడు.. గుంటూరు జీజీహెచ్ లో దారుణం...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Guntur Girl: యువతి తల్లిదండ్రులను బయటకుపంపిన హరీష్.. ఈసీజీ తీయాలంటే దుస్తులు విప్పాలని యువతికి సూచించాడు. ఆమె అందుకు నిరాకరించింది. దుస్తులు తీయకుంటే రిపోర్ట్స్ సరిగా రావని ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని గద్దించాడు.

  Anna Raghu, Guntur, News18

  ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ప్రజలు ఆస్పత్రికి వెళ్తారు. ప్రాణాలు నిలబెట్టే దేవాలయంగా దానిని భావిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ప్రభుత్వాస్పత్రిలో గుంటూరు (Guntur) జీజీహెచ్ కు ప్రత్యేక స్థానముంది. నిత్యం వేలాది మంది రోగులు ఇక్కడకు చికిత్స కోసం వస్తుంటారు. వైద్య సపాదాయాల మాట అటుంచితే... నిత్యం వివాదాలకు ఈ ఆస్పత్రి కేంద్ర బిందువవుతోంది. ఈసీజీ కోసం వచ్చిన ఓ యువతి పట్ల.. టెక్నీషయన్ అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల పాత గుంటూరుకు చెందిన ఓ యువతికి ఛాతీలో నొప్పిరావడంతో తల్లిదండ్రులు జీజీహెచ్ కు తీసుకెళ్లారు. డాక్టర్ సూచన మేరకు ఈసీజీ తీయించేందుకు ల్యాబ్ కు వెళ్లారు. అక్కడ టెక్నీషియన్ గా హరీష్ అనే యువకుడు ఉన్నాడు. యువతి తల్లిదండ్రులను బయటకుపంపిన హరీష్.. ఈసీజీ తీయాలంటే దుస్తులు విప్పాలని యువతికి సూచించాడు. ఆమె అందుకు నిరాకరించింది.

  దుస్తులు తీయకుంటే రిపోర్ట్స్ సరిగా రావని ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని గద్దించాడు. దీంతో చేసేది లేక ఆమె దుస్తులు విప్పింది. యువతి సిగ్గుతో కళ్లు మూసుకోగా.. బల్లపై పడుకోమని చెప్పి ముబైల్ లో ఫోటోలు తీశాడు. ఇంతలో కళ్లు తెరిచిన బాధితురాలు ఒక్కసారిగా కేకల వేస్తూ దుస్తులు వేసుకొని బయటకు వెళ్లింది. జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పడంతో హరీష్ ను నిలదీశాడు. ఐతే తాను ఏ తప్పూ చేయలేదని బుకాయించాడు. దీంతో బాధితురాలి తండ్రి జీజీహెచ్ ఔట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  ఇది చదవండి: ప్రియుడి కోసం ఇల్లు వదిలి వచ్చేసింది.. కానీ ఓ అర్ధరాత్రి అనుకోని ఘటన... మిస్టరీ ఏంటంటే..!  విచారణలో సంచలన నిజాలు
  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. అసలు హరీష్ ఈసీజీ టెక్నీషియన్ కాదని.. సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఈసీజీ స్పెషలిస్ట్ శంకర్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతడి స్థానంలో ట్రైనింగ్ లో ఉన్న విద్యార్థికి బాధ్యతలు అప్పజెప్పారు. ఐతే అతడు కూడా విధుల్లోకి రాకపోగా హరీష్ ను తీసుకొచ్చి ఈసీజీ తీయిస్తున్నాడు. హరీష్ ఈ యువతి పట్లేనా లేక ఇంకా ఎవరితోనైనా ఇలా ప్రవర్తించాడా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  ఇది చదవండి: భూమిలో నుంచి వింత శబ్ధాలు.. హడలిపోతున్న ఊరిజనం.. దెయ్యాలు పగబట్టాయా..?


  అడుగడుగునా నిర్లక్ష్యం
  తాజా ఘటన జీజీహెచ్ లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోందనడానికి నిదర్శనంగా మారింది. ఆస్పత్రిలో ఎవరు విధుల్లో ఉన్నారు ఎవరు లేరనే గుర్తించటానికి ఆర్ఎంఓ, సీఎంఓ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏడీ ఇలా ఎంతో మంది అధికారులు నిత్యం రౌండ్స్ వేస్తూ పరిశీలించాల్సి ఉంది. కానీ అలాంటివేమీ జరగడం లేదని తాజా ఘాటనతో తెలుస్తోంది. ఇటీవలే ఓ పసికందును ఆస్పత్రిలో పనిచేసేవాళ్లే కిడ్నాప్ చేశారు. తాజాగా యువతి పట్ల అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. ఐతే ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని కిందిస్థాయి ఉద్యోగులంటున్నారు. కొందరు ఉద్యోగులు తమ వ్యక్తిగత పనుల కోసం విధులకు డుమ్మా కొట్టి ఇతరులను విధుల్లోకి పంపుతున్నట్లు తెలుస్తోంది.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Nude photos

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు