హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అందమైన హ్యాండ్ రైటింగ్ ‌తో సంపాదించుకునే ఛాన్స్.. ఎలాగంటే..!

అందమైన హ్యాండ్ రైటింగ్ ‌తో సంపాదించుకునే ఛాన్స్.. ఎలాగంటే..!

X
అందమైన

అందమైన హ్యాండ్ రైటింగ్‌తో సంపాదించుకునే ఛాన్స్.. ఎలాగంటే..!

చేతి వ్రాత (Hand writing) విధ్యార్ధులకు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చక్కని చేతి వ్రాత (Hand writing)వారిమానసిక అందాన్ని కూడా తెలియజేస్తుంది అంటారు పెద్దలు. ఎంత చదివినా పరీక్షలలో మంచి మార్కులు రావాలంటే మంచి హ్యాండ్ వ్రైటింగ్ ఉంటేనే కదా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Gangadhar, News18, Guntur

చేతి వ్రాత (Hand writing) విధ్యార్ధులకు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చక్కని చేతి వ్రాత (Hand writing)వారిమానసిక అందాన్ని కూడా తెలియజేస్తుంది అంటారు పెద్దలు. ఎంత చదివినా పరీక్షలలో మంచి మార్కులు రావాలంటే మంచి హ్యాండ్ వ్రైటింగ్ ఉంటేనే కదా..?? ఇక మంచి విద్యార్ధి కావాలంటే మంచి హ్యాండ్ రైటింగ్ కావాలి. హ్యాండ్ రైటింగ్ అనే సబ్జెక్ట్ ఒకటుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.ఆ సబ్జక్ట్ నే కలిగ్రఫీ (KOLIGRAPY) అంటారు. చెక్క పెన్నులు రంగు రంగుల సిరా (Ink) ను ఉపయోగించి అందమైన ఆకృతులను గీయడం, అక్షరాలను సుందరంగా తీర్చిదిద్దడం ఈ కళ ప్రత్యేకత.

గుంటూరు జిల్లా (Guntur District) కొండవీడు మండల పరిషత్ ఉన్నత పాఠ శాల విధ్యార్ధులు కలిగ్రఫీ లో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు. షేక్ జున్ను సాహెబ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో వీరంతా ఎంతో కష్టపడి ఈ రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. కోలీగ్రఫీ తో భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి ఆధ్యాత్మిక గ్రంధాలు రాయటమే కాకుండా పండ్లు, కూరగాయలు వంటి వాటిపై కూడా చక్కగా వ్రాయడం ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఇది చదవండి: ఒక్కసారి పంటవేస్తే 20ఏళ్లు దిగుబడి.. లక్షల్లో లాభం

ఇక కలిగ్రఫీ నేర్చుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అంటున్నారు లిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ వైటింగ్ అధినేత షేక్. కరిముల్లా. కలిగ్రఫీ సర్టిఫికెట్ ఉన్న వారికి స్థానిక ప్రభుత్వ పాఠశాలలలో శిక్షకులు (Trainer) గా నియమించి వారికి కేంద్ర ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని ఆయన తెలియజేశారు.

ఇది చదవండి: కొబ్బరిపువ్వు ఎప్పుడైనా తిన్నారా..? దీని ముందు స్వీట్లు కూడా బలాదూర్

ఇప్పటికే కలిగ్రఫీని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చక్కగా ఆదరిస్తున్నాయని., ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తాము ప్రభుత్వానికి ఒక వినతి పత్రం కూడా సమర్పించామని ఆయన తెలియజేశారు. ఇది గానీ కార్యరూపం దాల్చితే ఎంతో మందికి ప్రభుత్వం ఉపాధి కల్పించినట్లు అవుతుందని తద్వారా రాష్ట్రంలో ప్రతీ విధ్యార్ధికీ చేతి వ్రాతను మెరుగు పరచుకునే అవకాశం లభిస్తుందని ఆయన తెలియజేశారు.

కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి సంస్థ (H.R.D) సంస్థ కల్పిస్తున్న ఈ అవకాశాన్ని దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో వినియోగించు కుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇప్పటికే కలిగ్రాఫర్స్ కి ఎంతో డిమాండ్ ఉందని,అనేక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుండి నేషనల్ హెచ్.ఆర్.డికి ధరఖాస్తులు అందాయని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కలిగ్రఫర్ ని నియమించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur, Local News

ఉత్తమ కథలు