Home /News /andhra-pradesh /

GUNTUR KOLAKALUR VILLAGE OF GUNTUR DISTRICT EFFECTED WITH DIARRHEA AS ONE GIRL LOST HER LIFE FULL DETAILS HERE PRN GSU NJ

AP News: ఊరిని కమ్మేసిన మహమ్మారి.. ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న జనం.. అసలేం జరిగిందంటే..!

గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న డయేరియా

గుంటూరు జిల్లాలో విజృంభిస్తున్న డయేరియా

Guntur: వానాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులే ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) లో అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఒక చిన్నారి ప్రాణం కోల్పోయింది.

ఇంకా చదవండి ...
  Sumanth, News18, Guntur

  వానాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులే ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) లో అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఒక చిన్నారి ప్రాణం కోల్పోయింది. తెనాలి రూరల్‌ మండలం కొలకలూరు… ఆ ఊరు ఊరంతా డయేరియా ప్రభలి..ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గరువు కాలనీలో డయేరియా ప్రబలింది. శ్రీనిధి అనే ఎనిమిదో తరగతి అమ్మాయికి వాంతులు విరేచనాలు అయ్యాయి. దీంతో ఆమెను తెనాలి అసుపత్రికి తీసుకెళ్లారు. తర్వాత మరో ఇద్దరూ చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. తర్వాత రోజు శ్రీనిధి చికిత్స పొందుతూ చనిపోయింది. మొదట వీరి ముగ్గురికి ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని భావించారు.

  ఐతే గ్రామంలో వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో స్థానికంగా ఉన్న పిహెచ్‌సి(PHC)కి పదుల సంఖ్యలో బాధితులు వచ్చారు. వీరిలో కొంతమందిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తెనాలి సబ్ కలెక్టర్ నిధి మీనా గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. త్రాగునీరు కలుషితం అయినట్లు గరువు కాలనీ స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో వెంటనే వాటర్ హెడ్ ట్యాంక్ నుండి వచ్చే నీటిని నిలిపి వేశారు. అప్పటికే ఆ ఊళ్లో డయేరియా బారిన పడ్డ వారి సంఖ్య ముప్పైకు చేరింది. తాజాగా మరో ముప్పై మంది వరకూ డయేరియా బారిన పడ్డట్లు సమాచారం.

  ఇది చదవండి: ఈ పెద్దావిడ సంకల్పం చాలా గొప్పది.. అభాగ్యుల ఆకలి తీర్చే గొప్ప ఆలోచన..


  దీంతో కలెక్టర్ వేణుగోపాల రెడ్డి, తెనాలి ఎమ్మెల్యే శివ కుమార్ గ్రామానికి వెళ్లారు. వెంటనే తెనాలి నుండి వాటర్ క్యాన్ల ద్వారా త్రాగునీటిని తీసుకువచ్చి స్థానికులకు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఫిహెసీతో పాటు జిల్లా పరిషత్ పాఠశాలలోనూ మెడికల్ క్యాంపులు పెట్టారు. డిహెచ్ఎంవో శోభారాణి అక్కడే ఉండి ఎప్పటి కప్పుడు పరిస్థితిని పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  ఇది చదవండి: సండే వస్తే మటన్ లాగిస్తున్నారా..? ఈ సీన్ చూస్తే ముక్క ముట్టరు..! బాబోయ్ ఇంత దారుణమా..?


  గుంటూరు జీజీహెచ్‌( GGH)కు పదమూడు మందిని చికిత్స నిమిత్తం ఉరలించారు. మరో ఐదు మందిని తెనాలి తీసుకెళ్లారు. ఇరవై మంది వరకూ గ్రామంలోనే చికిత్స పొందుతున్నారు. రోజు మరికొంతమంది డయేరియా బారిన పడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు మూడు రోజులు పాటు గ్రామంలోనే ఉంటామని డిఎంహెచ్ వో శోభారాణి తెలిపారు. త్రాగునీరు ట్యాంక్‌ శుభ్రం చేయకుండా నీటిని సరఫరా చేయడమేయ డయేరియా ప్రబలటానికి కారణమని  స్థానికులు అంటున్నారు. గ్రామానికి సమీపంలో ఉన్న కాఫీ ప్యాక్టరీ కూడా త్రాగునీరు కలుషితం కావటానికి కారణమని స్థానికుడు ఆనంద్‌ రావు ఆరోపిస్తున్నారు.

  ఇది చదవండి: ఏపీలో పెరుగుతున్న అడవి జంతువుల దాడులు.. సర్వేలో షాకింగ్ నిజాలు


  ప్రస్తుతం ఆ గ్రామంలో డయేరియా ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు డిఎం హెచ్ వో శోభారాణి తెలిపారు. పారిశుద్యం మెరుగు పరిచే విధంగా వెంటనే చర్యలు చేపట్టారు. సైడ్ డ్రెయిన్స్ శుభ్రం చేస్తున్నారు. త్రాగునీరు సరఫరా నిలిపి వేశారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆశా వర్కర్స్ తో ఇంటింటికి అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు శోభారాణి చెప్పారు.  జాగ్రత్తలు తప్పనిసరి..!
  ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. మొన్నటిదాకా భగభగ మన్న సూర్యుడు కాస్త శాంతించాడు. కానీ ఈ వాతావరణం మార్పుల సమయంలో సీజనల్‌ ఫ్లూలు, జ్వరాలు సహజం. వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అధికారులు వీటిని అరికట్టేందుకు మంచినీటి సరఫరా, పారిశుధ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్‌ ట్యాంక్‌లు క్లీనింగ్‌ వంటి విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్త్ వర్కర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో ఇళ్లలోని ఆరోగ్య సమస్యలపైన ఆరా తీసుకోవాలి…వాటికి తగ్గ జాగ్రత్తలు సూచించాలి. కరోనా వైరస్‌ వ్యాప్తి, దాని అవశేషాలు, ఆర్తనాదాలు ఇంకా మన కళ్లముందే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అధికారులు మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఏరియాలోనూ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు