Home /News /andhra-pradesh /

guntur: ఉద్రిక్తత, భారీగా పోలీసులు -‘చంద్రన్న పాదయాత్ర’కు నో -kodela shivaram, టీడీపీ నేతల అరెస్ట్

guntur: ఉద్రిక్తత, భారీగా పోలీసులు -‘చంద్రన్న పాదయాత్ర’కు నో -kodela shivaram, టీడీపీ నేతల అరెస్ట్

కోడెల శివరాం

కోడెల శివరాం

గుంటూరు జిల్లాలో శనివారం స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జిల్లాలో టీడీపీకి పునరుజ్జీవం కల్పించేలా, జగన్ సర్కారుపై పోరును ఉధృతం చేసేలా దివంగత స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం ‘చంద్రన్న ఆశయ సాధన’ పేరుతో పాదయాత్రకు సిద్ధంకాగా, అనుమతి లేదంటూ ఆయనను సత్తెనపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు..

ఇంకా చదవండి ...
గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం సహా పలువురు టీడీపీ కీలక నేతల అరెస్టుతో ఈ పరిణామాలు తలెత్తాయి. టీడీపీ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించిన దృశ్యాలు కనిపించాయి. గుంటూరు జిల్లాలో టీడీపీకి పునరుజ్జీవం కల్పించేలా, జగన్ సర్కారుపై పోరును ఉధృతం చేసేలా టీడీపీ నేత శివరాం ‘చంద్రన్న ఆశయ సాధన’ పేరుతో పాదయాత్రకు సిద్ధం కావడం, దానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో తాజా పరిస్థితి ఏర్పడింది. వివరాలివి..

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆయన ఇంటి దగ్గర భారీగా బలగాలను మోహరించారు. చంద్రన్న ఆశయ సాధన పేరుతో శనివారం నుంచి పాదయాత్ర చేసేందుకు కోడెల శివరాం సిద్ధమయ్యారు. రాజుపాలెం నుంచి దేవరంపాడు కొండ వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. కానీ పాదయాత్రకు అనుమతి లేదని జిల్లా పోలీసులు చెబుతున్నారు. అనుమతి నిరాకరించిన తర్వాత కూడా తాను పాదయాత్ర చేసితీరుతానని శివరాం భీష్మించడంతో పోలీసులు చర్యలకు దిగారు.

కోడెల శివరాం ఇంటితోపాటు సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. రాజుపాలెం మండలం టీడీపీ అధ్యక్షుడు అంచుల నరసింహారావును కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శివరాంతోపాటు పాదయాత్రకు సిద్ధమవుతోన్న పలువురు నేతలను కూడా పోలీసులు అరెస్టుచ చేసినట్లు తెలుస్తోంది. కాగా,

హౌజ్ అరెస్టు తర్వాత కోడెల శివరాం ఇంట్లోనే దీక్షకు దిగారు.  అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగ ఎండలో కూర్చొని నిరసన తెలియ జేస్తున్నారని, న్యాయ పోరాటం చేసైన సరే చంద్రన్న ఆశయ సాధన పాదయాత్ర చేసి తీరుతారని శివరామ్ వర్దీయులు తెలిపారు.

కోడెల శివరాం పాదయాత్రపై టీడీపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కోడెల మరణం, గత టీడీపీ హయాంలో దైర్జాన్యాలు తదితర అంశాల్లో శివరాంపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, సొంత పార్టీ నేతలే శివరాంపై అధినేత చంద్రబాబుకు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో తనపై వ్యతిరేకతను తగ్గించుకోడానికే శివరాం పాదయాత్ర సంకల్పించాడని, తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కన్ఫామ్ చేసుకుందామనుకుంటున్నాడని ఆయన వ్యతిరేక వర్గీయులు అంటున్నారు.

మీ నగరం నుండి (​గుంటూరు)

ఆంధ్రప్రదేశ్
​గుంటూరు
ఆంధ్రప్రదేశ్
​గుంటూరు
Published by:Madhu Kota
First published:

Tags: Andhra Pradesh, AP News, Arrested, Guntur, Kodela sivaram, Tdp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు