హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ దర్గాకు 131 ఏళ్ల చరిత్ర.. ఉరుసు వస్తే సందడే సందడి..!

ఆ దర్గాకు 131 ఏళ్ల చరిత్ర.. ఉరుసు వస్తే సందడే సందడి..!

గుంటూరులో ఘనంగా కాలే మస్తాన్ షా దర్గా ఉరుసు ఉత్సవాలు

గుంటూరులో ఘనంగా కాలే మస్తాన్ షా దర్గా ఉరుసు ఉత్సవాలు

గుంటూరు (Guntur) పరిసర ప్రాంతాల్లో శ్రీ హజరత్ కాలేమస్తాన్ షా అవులియా దర్గా అంటే తెలియని వారుండరు. దాదాపు 131 సంవత్సరాల కిందట ఇక్కడ సంచరించిన బాబా మహత్యాల గురించి ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr. Correspondent, News18, Amaravati

గుంటూరు (Guntur) పరిసర ప్రాంతాల్లో శ్రీ హజరత్ కాలేమస్తాన్ షా అవులియా దర్గా అంటే తెలియని వారుండరు. దాదాపు 131 సంవత్సరాల కిందట ఇక్కడ సంచరించిన బాబా మహత్యాల గురించి ప్రజలు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. 131 సంవత్సరాల కిందట ఎక్కడ నుంచో వచ్చిన ఓ బాబా, మహత్యాలతో ఇక్కడి వారి వ్యాపారాలు వృద్ధి చెందాయి. బాబా ఆశీస్సుల కోసం వేలాది మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు. జీవిత చరమాంకం వరకూ గుంటూరులోనే గడిపిన బాబా గారికి భక్తులు ఓ మసీదు నిర్మించారు. ఈ మసీదును కుల మతాలకు అతీతంగా అన్ని కులాల వారు దర్శించడం విశేషం.

ఏటా వైభవంగా ఉరుసు మహోత్సవాలు

గుంటూరులో ఉన్న శ్రీ హజరత్ కాలేమస్తాన్ షా అవులియా బాబా 131 ఉరుసు మహోత్సవాలు ఈ నెల 8 నుంచి  వైభవంగా జరగనున్నాయి. మసీదు నిర్వాహకులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందరో బాబా భక్తులు కర్ణాటక , తమిళనాడు నుంచి కూడా వస్తున్నారు. ఉరుసు సందర్భంగా గతంలో బాబా సంచరించిన వీధుల్లో బాబా విగ్రహాన్ని ఊరేగిస్తారు. బాణా సంచాతో వేలాది మంది భక్తులు ఈ ఉరుసు మహోత్సవంలో పాల్గొంటారు.

ఇది చదవండి: సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బిరుదు..వైరల్ గా మారిన ఆ కార్టూన్!

ఎలాంటి అనారోగ్యమైనా ఇట్టే నయమవుతుంది

బాబా మహత్యాలు అన్నీ ఇన్నీ కావు. పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా నయం కాని వ్యాధులను బాబా నయం చేస్తారని భక్తుల విశ్వాసం. ఇలా ఎంతో మంది బాబా ఆశీస్సులతో పూర్తి ఆరోగ్యంగా జీవిస్తున్నారని మసీదు నిర్వాహకులు తెలిపారు. ఈ మసీదుకు కావాల్సిన స్థలం, నిర్మాణాలను రావి రాంమ్మోహనరావు అనే హిందువు సమకూర్చారు. ఎంతో మంది సంతానం లేని వారికి కూడా బాబా సంతానం ప్రసాదించారు. మసీదులోని బావి వద్ద స్నానం చేసి 41 ప్రదక్షిణలు చేసిన వారికి బాబా సంతాన భాగ్యం కల్పించారు. ఇలా ఎందరో సంతానం కలిగిన వారు బాబా పేరు వచ్చేలా మస్తాన్ రావు, మస్తాన్ రెడ్డి, మస్తానమ్మ, మస్తానయ్య అంటూ బాబా పేరు వచ్చే విధంగా వారి సంతానానికి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.

గుంటూరు నగరంలో వేలాది భక్తులు

గుంటూరు నగరంతోపాటు, సమీపంలోని వందలాది గ్రామాల నుంచి మస్తాన్ బాబా దర్గాను దర్శించుకుంటూ ఉంటారు. మతంతో సబంధం లేకుండా సర్వమత సమ్మేళనంగా ఈ దర్గా వర్థిల్లుతోంది. ఎందరో హిందూ భక్తులు సమర్పించిన కానుకలతో ఈ దర్గా ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉరుసు మహోత్సవాల సందర్శంగా 4 రోజుల పాటు రోజుకు 36 వేల మందికి ఉచితంగా భోజనాలు అందించనున్నట్టు మసీదు నిర్వాహకులు తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Guntur

ఉత్తమ కథలు