హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Guntur: గుంటలు+ఊరు= గుంటూరు.. ఏపీలో వైరల్ అవుతున్న న్యూస్.. కారణం ఇదే..!

Guntur: గుంటలు+ఊరు= గుంటూరు.. ఏపీలో వైరల్ అవుతున్న న్యూస్.. కారణం ఇదే..!

అధ్వానంగా

అధ్వానంగా గుంటూరు రోడ్లు

Guntur Roads: ఎక్కడన్నా రోడ్డు మధ్యలో గుంటలు పడుతాయి.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు నగరంలో మాత్రం.. గుంటల మధ్యలో రోడ్డు ఉంటుందనడంలో అతిశయోక్తి లేదండి. వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లన్నీ గుంటల మయమే.గుంటూరు ఏమి ఏమారు మూల ప్రాంతమో కాదు.

ఇంకా చదవండి ...

  Sumanth, News18, Guntur

  ఎక్కడన్నా రోడ్డు మధ్యలో గుంటలు పడుతాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) నగరంలో మాత్రం.. గుంటల మధ్యలో రోడ్డు ఉంటుందనడంలో అతిశయోక్తి లేదండి. వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లన్నీ గుంటల మయమే.గుంటూరు ఏమి ఏమారు మూల ప్రాంతమో కాదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన నగరాల్లో ఒకటి. అంతేకాదు రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉండే సిటి. ప్రతిరోజులు రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు తిరుగుతూనే ఉంటారు. అలాంటి మహానగరంలో రోడ్ల పరిస్థితి వర్షాకాలం వస్తే మరింత అధ్వానంగా తయారవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్ల మీద స్విమ్మింగ్‌ పూల్స్‌ పెట్టారా అన్నట్లు ఉంటాయి. మరికొన్ని చోట్ల చెరువుల కట్టలు తెగి రోడ్ల మీదకు నీళ్లు వచ్చాయా అన్నట్లు.. ఇదే తొలిసారి కూడా కాదండి.. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారుతున్నా… సిటీలో అభివృద్ధి జరుగుతున్నా..రోడ్ల దుస్థితి మాత్రం మారట్లేదు.

  ప్రాణాల మీద ఆశలున్న వాళ్లెవ్వరు వర్షాకాలంలో గుంటూరులో బైక్ తీయాలంటేనే భయపడతారు. ఏ చిన్న పనిమీద బయటకు వచ్చినా.., వెళ్లేవరకు నమ్మకాలుండవు. నగరంలో అన్ని ప్రధాన కూడళ్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

  ఇది చదవండి: అందమైన విశాఖ ఇప్పుడు ఎందుకు ఇలా అయింది..? షాక్ లో వైజాగ్ వాసులు..


  ప్రధాన కూడళ్లలో అధ్వాన పరిస్థితులు..!

  గుంటూరు నగరంలో నడిబొడ్డున ఉన్న లక్ష్మీపురం రోడ్డు, శ్రీనివాస్ రావు పేట, శ్రీనగర్ రోడ్డు, పలకలురురోడ్డు, మూడు వంతెనలు, ఎన్టీఆర్‌ కాలనీ, నాయుడు పేట.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రాంతాల్లో ఇదే దుస్థితి కనిపిస్తుంది.

  ఇది చదవండి: అక్కడ నుంచి చూస్తే వైజాగ్‌ సిటీ మొత్తం కనిపిస్తుంది..! ఆ ఎక్స్ పీరియన్స్ వేరే లెవల్..!


  నగరంలోని రోడ్లు మాలులు బైక్‌లు నడపటం కన్నా కూడా.. ఆఫ్ రోడ్ బైకులు నడిపే ట్రాక్ లాగా కనిపిస్తున్నాయంటున్నారు స్థానికులు విజయ్‌కుమార్‌. నగరంలో గతం నుంచి రహదారుల సమస్య అధికంగా ఉందని ..ఎన్ని సార్లు అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు గోడు విన్నవించుకున్నా ప్రయాజనం లేదు అంటున్నారు నగరవాసులు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే అధికారులు తూతూమంత్రంగా హడావిడి చేస్తారని.. ఆ తర్వాత నెలలు గడుస్తున్నా రోడ్ల సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. అదే నాయకుల పర్యటనలు ఉంటే తాత్కాలిక మరమ్మతులు చేసి మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

  ఇది చదవండి: ట్రైన్ బర్త్ డే వేడుకలు ఎప్పుడైనా చూశారా..? పినాకినికి 30 ఏళ్లు


  ఇటీవల పెద్దపలకలూరు రోడ్ డివైడర్ నుంచి విజ్ఞాన్ కాలేజీకి వెళ్లే రూట్‌లో రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. నగరంలో స్విమ్మింగ్‌ పూల్స్‌ అంటూ మీడియాల్లో వచ్చేసరికి అధికారులు హుటాహుటిన తాత్కాలిక మరమ్మత్తులు చేశారు. రోడ్ల మధ్యలో పెద్ద పెద్ద గుంతలు.. సరే కదా అని రోడ్లకు ఇరువైపులా వెళ్దామనుకుంటే డ్రైనేజీ కాలువలు నిండుగా ప్రవహిస్తుంటాయి. ఏ చిన్న పొరపాటు జరిగినా అటో.. ఇటో జారి పడిపోయే ప్రమాదం ఉంది.

  మరోపక్క పారిశుధ్యం అధ్వానం..!

  నగరంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రభావంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి.. ఈ వర్షానికి తడిపోయి కుళ్ళి కంపు కొడుతోంది. వీటి వల్ల దోమల బెడద ఎక్కువై విషజ్వరాల బారిన పడుతున్నామంటూ స్థానికులు వాపోతున్నారు. కోవిడ్ లాంటి మహమ్మారిని చూసి కూడా.., పారిశుద్ధ్యం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదంటున్నారు. ఈ రోడ్ల సమస్యలను, పారిశుద్ధ్య సమస్యలు మరింత జఠిలం కాకముందే అధికారులు దృష్టి పెట్టి మరమ్మత్తులు చేయించాలని నగరవాసులు కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Local News