Kantara: అతడు ఒక తహసీల్దార్ (MRO).. కీలకమైన ప్రభుత్వ కొలువు (Government Job) లో ఉన్నా.. ఆయనకు కళలంటే పిచ్చి.. చిన్నప్పటి నుంచి నాటకాలు.. యాక్టింగ్ (Acting) అంటే చాలా ఇష్టం.. కానీ ఆయనకు ఇష్టమైన రంగంవైపు వెళ్లకుండా.. ప్రభుత్వ కొలువులో చేరారు.. అయినా ఆయనకు కళలపై అభిమానం పోలేదు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా.. తనలో ఉన్న కళను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అందులోనూ ఎప్పుడు వేషం (Getup) వేస్తే.. అప్పటికి ట్రెండింగ్ (Trending) లో ఉన్నది.. బాగా వైరల్ (Viral) అయిన వాటినే ఫాలో అవుతూ వస్తున్నారు. అలా కొత్త కొత్త వేషాలు వేస్తూ.. అక్కడున్నవారిని ఆకర్షించి అభినందనలు అందుకుంటారు. ప్రస్తుతం కొత్తవలస తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు డి. ప్రసాదరావు.. వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల విడుదలైన సూపర్ డూపర్ హిట్ కన్నడ డబ్బింగ్ చిత్రం కాంతారాలో ఒక సీనుకు సంబంధించి తహసీల్దార్ ప్రసాదరావు ఏకపాత్ర అభినయం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.
గుంటూరు జిల్లా (Guntur District) లోని నాగార్జున విశ్వవిద్యాలయం (Nagarjuna University) లో నాలుగు రోజులుగా జరుగుతున్న ఆరో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్లో ఆయన విజయనగరం జిల్లా తరఫున పాల్గొని అలరించారు. కల్చరల్ కార్యక్రమంలో భాగంగా కాంతార సినిమాలో హీరో పాత్రను ఏకపాత్ర అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు డి. ప్రసాద రావు.
రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి రెవెన్యూ సిబ్బంది పోటీ పడిన ఈ కార్యక్రమంలో కాంతార అభినయం ప్రశంసలు అందుకొంది. అంతేకాదు.. అచ్చం కాంతార హీరోకు సమాంతరంగా ప్రసాదరావు మేకప్ వేసుకుని.. అలరించారు. ఆయన గెటపు.. యాక్టింగ్ కు అంతా మైమరిచిపోయారు. ఇక ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రశంసల జల్లు కురిపించి సెల్ఫీ దిగారు. ప్రసాదరావుకు ఈ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈయనను రెవెన్యూ సిబ్బంది అభినందించారు.
ఇదీ చదవండి : అన్నయ్యతో సహా వచ్చేయండి.. మాతో విలీనం కండి..! పవన్ కు మోదీ ఇదే చెప్పారా..?
ప్రస్తుతం కాంతారా ట్రెండింగ్ ఉంది. ఇప్పటికే రికార్డులు నెలకొల్పుతోంది. కన్నడలో సెప్టెంబరు 30న విడుదలైన ఈ మూవీ బ్లాక్బాస్టర్ హిట్‌ని అందుకుంది. దాంతో మిగిలిన భాషల్లో కూడా అక్టోబరు 15న రిలీజ్ చేశారు. అయితే.. ఊహించని విధంగా విడుదలైన అన్ని భాషల్లోనూ కాంతార రికార్డుల మోత మోగించేస్తూ ఇప్పటికీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఒక్క తెలుగులోనే ఈ మూవీ దాదాపు 50 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే అర్ధం చేసుకోవచ్చు. ఆ క్రేజ్ ను గుర్తు చేస్తూ.. తహసీల్దార్ వేసుకున్న గెటప్ అందర్నీ ఆకట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Guntur, Kantara, Vizianagaram