హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: జనసేనలో చేరుందుకు డేట్ ఫిక్స్ అయ్యిందా? కన్నా లెక్కలు ఏంటి? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?

AP Politics: జనసేనలో చేరుందుకు డేట్ ఫిక్స్ అయ్యిందా? కన్నా లెక్కలు ఏంటి? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు?

కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ

కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ

AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు త్వరలో చోటు చేసుకోబోతున్నాయా? కీలక నేతలు పార్టీలు మారేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇందులో కన్నా లక్ష్మీ నారాయణ కూడా ఉన్నారా.. ఆయన లెక్క ఏంటి..? ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపోస్తోంది. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలపై బిజీ అయ్యాయి.. కీలక నేతలు అంతా ప్రచారాలు కూడా మొదలుపెట్టే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మరికొందరు కోరిన సీటును రిజర్వ్ చేసుకునే పనిలో ఉన్నారు. అధినేతను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరికొందరు భవిష్యత్తుకోసం పార్టీ  మారే ప్రయత్నాలు మొదలెట్టారు. దీంతో త్వరలో కీలక నేతలు కొందరు పార్టీ మారుతారు అంటూ ప్రచారం జరుగుతోంది. వారంతా ఇప్పటికే చర్చలు కూడా పూర్తి చేసుకున్నారు.. ఏప్రిల్ లేదా మేల్లో భారీగా వలసలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ (BJP) సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) త్వరలోనే జనసేన (Janasena) లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని.. డేట్ కూడా ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది.

కన్నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన నేత.. మంత్రిగా  వై.ఎస్ఆర్ కేబినెట్ లో ఎంతో కీలకంగా వ్యవహరించారు. కానీ ఆ తరువాత  ఆయన రాజకీయం కొంత మేర మసకబారిందనే చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత ఆయన కాంగ్రెస్ వెంట నడిచారు. ఒకానొక సందర్భంలో వైసీపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగినా.. చివరి నిమిషంలో ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు,

బీజేపీలో కూడా కన్నాకు అగ్రతాంబూలమే దక్కిందని చెప్పాలి. పార్టీలో చేరిన వెంటనే ఆయనను బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం నియమించింది.  ఆయన నేతృత్వంలో 2019 ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ  ఒక్కచోట కూడా తమ అభ్యర్ధులను గెలిపించుకోలేక పోయింది.

ఇదీ చదవండి : అధినేతకు ఆమంచి ఏం చెప్పారు.. పర్చూరులో పోటీకి ఒకే అన్నారా..? ఆ సీనియర్ నేతపై ఫిర్యదు చేశారా?

దీంతో కన్నా లక్ష్మీనారాయణ పై పార్టీలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ దెబ్బకు అధ్యక్ష పదవి నుండి ఆయన్ను తప్పించి పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించింది అధిష్టానం. అయితే సోముకి-కన్నాకి మధ్య సంభంధాలు ఉప్పూ నిప్పులా ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న కన్నా పార్టీలో తనకి సరైన గౌరవం దక్కడం లేదనే భావనలో ఉన్నారంట. అందుకే ఇప్పుడు జనసేన లో చేరాలని ఫిక్స్ అయినట్టు టాక్.

ఇదీ చదవండి: టీటీడీకి బిగ్ షాక్.. ఈఓ ధర్మారెడ్డి‎కి నెల రోజులు జైలు శిక్ష.. ఎందుకో తెలుసా..?

ముఖ్యంగా జనసేన నుంచి పోటీ చేస్తే.. సామాజిక వర్గం పరంగా భారీ మద్దతు దక్కుతుంది అని లెక్కలు వేసుకుంటున్నారు.  అంతేకాకుండా బీజేపీ ఉంటే కేవలం ఒక నాయకుడిగా మాత్రమే కొనసాగాలి అని.. అదే జనసేన అయితే టాప్ త్రీలో ఉండే అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇదీ చదవండి : కంపెనీ తరలింపు ప్రచారాలకు చెక్.. ఏపీలో అమరరాజా 250 కోట్ల పెట్టుబడి

జనసేన అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ,నాదెండ్ల మనోహర్ తప్ప.. పార్టీలో ప్రజలు గుర్తుపట్టే మరో నాయకుడు లేరు.. తనకు కలిసివస్తుందని మున్ముందు రోజులలో జనసేన లో అన్నీ తానై చక్రం తిప్పవచ్చనే ఆలోచన చేస్తున్నారంట కన్నా లక్ష్మీనారాయణ. అంతేకాదు కన్నాని జనసేనలోకి.. చేరమని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇదీ చదవండి : అక్కడ వద్దు ఇక్కడ ముద్దు.. జనసేనతో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందా..?

తాజాగా గుంటూరులో కన్నా ని మర్యాద పూర్వకంగా కలిసిన నాదెండ్ల మనోహర్ కన్నాని పార్టీలోకి ఆహ్వానించారని.. అందుకు కన్నా కూడా సానుకూలంగానే స్పందించారని.. ఏప్రిల్ లేదా మే నెలలో ఆయన  జనసేనలో చేరే అవకాశం ఉంది అంటున్నారు. అప్పటికి టీడీపీ-జనసేన పొత్తుపై క్లారిటీ వస్తుందని..  రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే తన గెలుపు పక్కా అని లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే గుంటూరు వెస్ట్ నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారని.. అది కుదరదు అంటే.. సత్తెనపల్లి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది అంటున్నారు.   

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Janasena, Kanna Lakshmi Narayana

ఉత్తమ కథలు