Pawan Kalyan: జనసేన (Janasena) తో బీజేపీ (BJP) పొత్తు కొనసాగుతోందని రాష్ట్ర కాషాయ నేతలు పదే పడే చెబుతున్నారు. తాజాగా సోము వీర్రాజు (Somu Veerraju) సైతం.. పవన్ తో కలిసే ఎన్నికలకు వెళ్తామని.. పొత్తులోనే ఉన్నామని పవన్ చాలాసార్లు చెప్పారన్నారు. కానీ ఈ మధ్య కాలంలో పవన్ మాత్రం.. ఒక్కసారి కూడా బీజేపీకి సపోర్ట్ గా మాట్లాడలేదు.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సైతం వారికి మద్దతుగా నిలవలేదు. ఓటు వేయమని ఒక్క ఓటరుని కూడా కోరలేదు. మరోవైపు ఆయన అడుగులన్నీ టీడీపీ (TDP) వైపే పడుతున్నాయని.. ఆ రెండు పార్టీల పొత్త ఖాయమనే ప్రచారం జరుగుతోంది. పొత్తుల వ్యవహారం వివాదం తెరపైకి వచ్చిన తరువాత తొలిసారి పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతుగా నిలిచారు.. ఎందుకంటే.. ఇవాళ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ (Satya Kumar) పై అమరావతి (Amaravati) లో దాడి జరిగింది. ఈ దాడిని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 1200 రోజులుగా చేస్తున్న దీక్షలకు మద్దతు పలికిన సత్య కుమార్ పై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటం గర్హనీయమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వాదులందరూ ఈ దాడిని ఖండించాలని పవన్ పిలుపు నిచ్చారు. ఈ ఘటనతో అధికారంలో ఉన్న వైసీపీ దాదాగిరి పరాకాష్టకు చేరిందనే వాస్తవం మరోమారు రుజువైందన్నారు. అందుకే ఈ దాడిని ప్రతి ప్రజాస్వామ్యవాది ఖండించాలన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తామని రాష్ట్ర పాలకులు సందేశం ఇస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఇదే వైసీపీ సీఎం శ్రీ జగన్ రెడ్డి గారి విధానం అయితే తాము కచ్చితంగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాధానం ఇస్తామన్నారు.
రాజధాని రైతులకు మద్దతుగా నిలిస్తే దాడులు చేస్తారా? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/xZFunFNUt6
— JanaSena Party (@JanaSenaParty) March 31, 2023
బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నారని వైసీపీ ఎంపీ ప్రకటించారు అంటూ శ్రీ సత్య కుమార్ చెప్పిన మాటలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో వైసీపీ శ్రేణులు చేసిన ఈ దాడి ఘటనను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి. మూడు రాజధానులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్న వైసీపీ ముఖ్యమంత్రినీ, ఆయన పార్టీనీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పట్టభద్రులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరస్కరించారన్నారు.
క్షోభపడుతున్న రాజధాని రైతులకు అండగా నిలుస్తున్న రాజకీయ పక్షాలను, సంఘాలను వైసీపీ ముఖ్యమంత్రి, ఆయన అనుచరులు వర్గ శత్రువులుగా చూస్తున్నారన్నారు. రాష్ట్ర పాలకులు సామాన్య ప్రజలపైనా, ప్రశ్నించిన వారిపైనా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నదీ, ప్రతిపక్ష నాయకులను వేధిస్తూ.. వారిపై దాడులకు పాల్పడుతున్నదీ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి జనసేన పార్టీ తీసుకువెళ్తుందని.. దీనికి అధికార పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? కేంద్రం చేతిలో కీలక రిపోర్ట్..
దాడికి గురైన సత్యకుమార్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటించి తిరిగి వస్తుండగా ఉద్దండరాయునిపాలెం లో తమపై ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు దాడి చేశారని సత్యకుమార్ ఆరోపించారు. తన కారు అద్దాలు పగలగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుమామిళ్ల అశోక్ తో పాటు తమ కార్యకర్తలపై దాడికి దిగారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఖండించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP News, AP Politics, Bjp-janasena, Pawan kalyan