హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: జిల్లాలో టెన్షన్ టెన్షన్.. నేడు సత్తెనపల్లికి పవన్.. వారందరికి రూ.లక్ష పరిహారం..

Pawan Kalyan: జిల్లాలో టెన్షన్ టెన్షన్.. నేడు సత్తెనపల్లికి పవన్.. వారందరికి రూ.లక్ష పరిహారం..

పవన్ కళ్యాణ్ (File Photo)

పవన్ కళ్యాణ్ (File Photo)

Pawan Kalyan: గుంటూరు జిల్లాలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. ఇప్పటికే మాచర్ల అట్టుడుకుతోంది.. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ అదే జిల్లాలోనూ సత్తెనపల్లిలో పర్యటిస్తుండడం మరింత ఉత్కంఠ పెంచుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. చాలా చోట్ల ఘర్షణ వాతావరణం పీక్ కు చేరింది. రాజకీయ పార్టీలు (Political Parities) ప్రత్యర్థి పార్టీలపై దాడులకు దిగుతుండడం తీవ్ర ఆందోళన పెంచుతోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా (Guntur District) లో హైటెన్షన్ కనిపిస్తోంది. ఇప్పటికే మాచర్లలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ సైతం  వెళ్తుండడంతో ఈ పర్యటనపై ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ (Janasena Party) ఆర్థికసాయం అందిస్తూ వస్తున్నారు. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో లక్ష రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) లో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హాజరవుతున్నారు. పవన్ రాక నేపథ్యంలో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు లెక్కలు ఉన్నాయి. వారందరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థికసాయం పేరుతో చెక్కులు అందించనున్నారు. సత్తెనపల్లి మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం కావడం కూడా ఈ పర్యటనపై ఉత్కంఠ పెరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు జనసేనలో చేరతారంటూ కథనాలు వస్తున్నాయి. నేటి పవన్ సభలోనే ఈ చేరికలు ఉంటాయనే ప్రచారం కూడా ఉంది.

మరోవైపు మాచర్ల ఉద్రిక్తతలు వీడడం లేదు. ప్రస్తుతానికి 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. మాచర్లలో టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ విధ్వంసానికి దిగింది. టీడీపీ నాయకుడు బ్రహ్మానందరెడ్డితో పాటు టీడీపీ సానుభూతిపరులను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ శ్రేణులు చేసిన దాడిని అన్నివర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇదంతా పక్కా వ్యూహంతోనే జరిగిందని.. కావాలనే కొందరు విధ్వంసానికి దిగినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొన్న మాచర్లలో టీడీపీ శ్రేణులను భయపెట్టినట్టే.. సత్తెనపల్లిలో జనసైనికులను భయపెట్టేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

ఇదీ చదవండి : మరణదిన వేడుకలకు హాజరుకండి.. మాజీ మంత్రి సంచలన ఆహ్వాన లేఖ

మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇంఛార్జీ బ్రహ్మారెడ్డి సహా తొమ్మిది మందిపై సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో ఏ-1గా బ్రహ్మారెడ్డిని పేర్కొన్నారు. రేషన్ డీలర్ చల్లా మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. తమపై బ్రహ్మారెడ్డి, బాబూఖాన్‌లు ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు చల్లా మోహన్.

First published:

Tags: Andhra Pradesh, AP News, Guntur, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు