Home /News /andhra-pradesh /

GUNTUR JANASENA ACTIVIST FILED COMPLAINT AGAINST POSANI KRISHNA MURALI AND YSRCP ACTIVISTS ABOUT LIFE THREAT IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT

Posani VS Janasena: పోసాని నుంచి ప్రాణహాని ఉంది.. పోలీసులకు జనసేన కార్యకర్త కంప్లైంట్..

పోసాని కృష్ణమురళి, పవన్ కల్యాణ్ (ఫైల్)

పోసాని కృష్ణమురళి, పవన్ కల్యాణ్ (ఫైల్)

టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali).. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దదుమారమే రేగింది.

    టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali).. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్దదుమారమే రేగింది. టాలీవుడ్ (Tollywood)తో పాటు రాజకీయాల్లోనూ పోసాని కామెంట్స్ పై చర్చ జరిగింది. పవన్ కల్యాణ్ అభిమానులు తనను దూషిస్తూ మెసేజ్ లు, ఫోన్లు చేస్తున్నారంటూ పోసాని చేసిన ఆరోపణలు, పవన్ పై చేసిన తీవ్రవ్యాఖ్యలు, దూషణల పర్వం తర్వాత వాతవరణం వేడెక్కింది. పోసానిని అడ్డుకునేందుకు జనసేన కార్యకర్తలు యత్నించడం.. పోలీసుల సాయంలో పోసాని ఇంటికెళ్లడం జరిగాయి. అదే సమయంలో పవన్ కల్యాణ్ నుంచి, ఆయన అభిమానుల నుంచి ప్రాణహాని ఉందని పోసాని ఆరోపించిన సంగతి తెలిసిందే. తనకు ఏమైనా జరిగితే పవన్ కల్యాణ్ దే బాధ్యత అంటూ పోసాని కృష్ణమురళి గట్టిగానే విమర్శించారు.

    దీంతో ఈ ఎపిసోడ్ పోసాని వర్సెస్ జనసేన కార్యకర్తలుగా మారిపోయింది. తాజాగా పోసాని కృష్ణమురళీ నుంచి తనకు ప్రాణహాని ఉందని జనసేన కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన జనసేన కార్యకర్త రాజశేఖర్.. పోసానితో పాటు వైసీపీ కార్యకర్తలపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. గతంలో రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన సోషల్ మీడియా ఉద్యమంతో పాటు శ్రమదానం కార్యక్రమాల్లో రాజశేఖర్ చురుగ్గా పాల్గొన్నారు. అలాగే అదే సమయంలో పోసాని వ్యాఖ్యలపై పలువురు కార్యకర్తలు విమర్శలు చేశారు. దీంతో రాజశేఖర్ కూడా పోసానికి అసభ్యకర మెసేజ్ లు పంపడంతో పాటు ఆయనను బెదిరించావంటూ స్థానిక వైసీపీ కార్యకర్తలు వేధించడం మొదలుపెట్టారు. స్థానికంగా ఎక్కడ కనిపించినే ఇదే అంశంపై నిలదీయడం, బెదిరిస్తుండటంతో రాజశేఖర్.. సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    ఇది చదవండి: అమ్మఒడిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. వచ్చేఏడాది నుంచి ఈ మార్పులు...


    పోసానిపై పోలీసులకు ఫిర్యాదు


    పోసానిపై పోలీసులకు ఫిర్యాదు

    ఇది చదవండి: అందుకు సిద్ధంగా ఉండండి...! విద్యుత్ సంక్షోభంపై సజ్జల సంచలన వ్యాఖ్యలు..


    పవన్ కల్యాణ్ కుటుంబాన్ని, ఆయన భార్యను, పిల్లల్ని వ్యక్తిగతంగా దూషించిన పోసాని.. అభిమానులను సైకో ఫ్యాన్స్ అని ఆరోపించారని.. ఆయన చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల సమాజంలో తలెత్తుకోలేకపోతున్నామని రాజశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోసాని చేసిన కామెంట్స్ వల్ల అభిమానులైన తమను కూడా వేధిస్తున్నారని.. చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. అభిమానులపై కుట్రపూరితంగా ఆరోపణలు చేసిందే కాకుండా.. ఇప్పుడు వైసీపీ కార్యకర్తల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నరని.. కావున పోసానితో పాటు వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఫిర్యాదును తీసుకొని రిజస్టర్ చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు లైట్ తీసుకుంటారా..? లేక వారిపై చర్యలు తీసుకుంటారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక పోసాని వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించిన పవన్ కల్యాణ్ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తే తొక్కిపెట్టి నారతీస్తామని ఘాటుగా హెచ్చరించిన సంగతి తెలిసిందే..!
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Janasena party, Posani Krishna Murali

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు