హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Politics: ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కుమ్ములాటలు.. బహిరంగంగానే బాహాబాహీ

YCP Politics: ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కుమ్ములాటలు.. బహిరంగంగానే బాహాబాహీ

వైసీపీలో ఆగని వైసీపీ వర్గ పోరు

వైసీపీలో ఆగని వైసీపీ వర్గ పోరు

YCP Politics: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో వర్గ పోరు రోజు రోజుకూ తీవ్రం అవుతోంది. తాజాగా ఆ ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలో పరిస్థితి వర్గపోరుకు అద్దంపడుతోంది. రెండు వర్గాల వారు ఆధిపత్యం కోసం నేరుగా బాహబాహికి దిగారు.. దీంతో అధిష్టానం ఒకటి అనుకుంటే.. అక్కడ ఇంకొకటి జరుగుతోందా అనే టెన్షన్ మొదలైంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  YCP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నివాసం ఉండే ప్రాంతం సమీపంలోనూ వైసీపీ (YCP) వర్గ పోరుకు అడ్డుకట్ట పడడం లేదు. తాడికొండలో పరిస్థితి రోజు రోజుకు అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. ఇంచార్జి నియామకంపై గత కొన్నాళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి (MLA Sridevi).. వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ (MLC Dokka Manikyam) మధ్య ఆదిపత్యపోరు కొనసాగుతోంది. డొక్కా మాణిక్యంకు బాధ్యతలు ఇచ్చిన దగ్గర నుంచి రోజు రెండు వర్గాల మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులానే ఉంది. ఈ క్రమంలో తాడికొండ సొసైటీ సెంటర్ దగ్గర ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఎమ్మెల్యే శ్రీదేవి ఉండగా నియోజకవర్గానికి సమన్వయ కర్త ఎందుకు అంటూ శ్రీదేవి వర్గీయులు నినాదాలు చేస్తే.. బ్రోకర్ వ్యవస్థ నశించాలి అంటూ డొక్కా వర్గీయులు పోటీ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గీయుల మధ్యా మాటా మాటా పెరిగింది. పోటీ పోటీగా నినాదాలు చేయటంతో తాడికొండ సొసైటీ సెంటర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇటీవల మాజీ హోం మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత క్యాంపు కార్యాలయం దగ్గర తన అనుచరులతో చేరుకుని ఎమ్మెల్యే శ్రీదేవి నిరసనకు దిగారు. సుచరిత బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. దళిత ఎమ్మెల్యేను అవమానపరుస్తారా? అని మండిపడ్డారు.


  పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా.. తెలుగు దేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన డొక్కాను సమన్వయకర్తగా ఎలా నియమిస్తారని శ్రీదేవి వర్గం ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి, ఆమె వర్గీయులతో మాజీ మంత్రి సుచరిత చర్చలు జరిపారు. కచ్చితంగా వారి సమస్యను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అప్పటిదాకా ఎలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. సుచరిత సమాధానంతో ఎమ్మెల్యే శ్రీదేవి..ఆమె వర్గీయులు అప్పుడు వెనక్కు వెళ్లిపోయారు.  తాజాగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదరావును తాడికొండ సమన్వయకర్తగా కొనసాగిస్తే తాము రాజీనామా చేస్తామని వైసీపీ తుళ్లూరు మండల అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీదేవి వర్గానికి చెందిన బొర్రా శివరామిరెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే శ్రీదేవి నివాసంలో బొర్రా మాట్లాడుతూ.. సమన్వయకర్తను నియమించేప్పుడు తమను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నిస్తూ..ఎమ్మెల్యే ఉండగా..కొత్తగా సమన్వయికర్తను ఎందుకు నియమించారని నిలదీశారు.


  ఇదీ చదవండి : 40 రోజులు తాడిపండ్లు తింటే మెరిసిపోతారా? ఆ వంటకాలు యమ్మీ టేస్టే కాదు.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు


  ఈ సందర్భంగా ఎమ్యెల్యే శ్రీదేవి వర్గం-డొక్కా వర్గం పోటా పోటీ నిరసనలు
  దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇరు వర్గాలను పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. దీంతో బలవంతంగా వారిని చెదరగొట్టాల్సి వచ్చింది తారువాత వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి తాడికొండ సొసైటీ యార్డ్ దగ్గరే ఎమ్మెల్యే వర్గం బైఠాయించింది.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, AP Politics, Guntur, Ycp

  ఉత్తమ కథలు