ఆడపిల్ల పుడితే ఇంటి కి లక్ష్మి వచ్చినది అని సంబరపడి ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆర్ధిక స్వతంత్రం సాధించి ఎల్లలు చేరి పేస్తున్నారు భూమి నుండి అంతరిక్షం వరకు వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మగవాళ్లకు మేము తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంపెనీలను నడుపుతున్న నారీమణులు ఉన్నారు. అలాంటి ఈ రోజుల్లోనూ ఆడపిల్ల పుడుతుందని విషమిచ్చి చంపే నీచులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా (Palnadu District) లో దారుణం చోటు చేసుకుంది.. 6 నెలల గర్భిణికి రెండవ ప్రసవంలో కూడా ఆడపిల్ల అనే కారణంతో అత్తింటివారు కోడలికి విషం ఇచ్చారు. ప్రస్తుతం యువతి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
బల్లికురవ మండలం కుప్పరపాలేనికి చెందిన శ్రావణికి రొంపిచర్ల మండలం సబ్బయ్యపలెం చెందిన గాడిపర్తి వేణుతో మూడేళ్ల క్రితం పెళ్లైంది. వీరిరువురికి మొదటి సంతానంగా ఆడపిల్లకి జన్మించింది. ఈ క్రమంలోనే శ్రావణి రెండోసారి గర్భం దార్చింది. ప్రస్తుతం 6 నెలలు గర్భిణీ ఉన్న శ్రావణిని ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఏషియన్ హాస్పిటల్ చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళి స్కానింగ్ చేయించారు. ఐతే లింగనిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమైనా.. అక్కడి సిబ్బంది భర్తకు చెప్పేశారు. దీంతో రెండోసారి కూడా ఆడపిల్ల పుడుతుందనే నెపంతో అత్తింటివారు శ్రావణికి విషమిచ్చారు.
ఐతే విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరడంతో ఆస్పత్రికి వెళ్లి చిత్రీకరించేందుకు యత్నించగా దురుసుగా ప్రవర్తించారు. ఐతే లింగనిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని తెలిసినా ఏషియన్ ఆస్పత్రి సిబ్బంది ఎందుకు చెప్పారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు విషయం తెలుసుకున్న జిల్లా వైద్య శాఖ అధికారులు ఏషియన్ ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur, Local News