హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Fish Catching: వలతో పని లేదు.. చేపలు ఎలా పడుతున్నారో చూడండి.. ఎన్ని దొరికాయంటే?

Fish Catching: వలతో పని లేదు.. చేపలు ఎలా పడుతున్నారో చూడండి.. ఎన్ని దొరికాయంటే?

గొడుగులతో చేపల వేట

గొడుగులతో చేపల వేట

Fish Catching: చేపలు పట్టేందుకు మత్స్యకారులు.. చాలా శ్రమిస్తారు.. వలలు వేసి.. లేదా సముద్రం, నదుల్లోకి బోట్లపై వెళ్లి చేపలు పడుతుంటారు.. అప్పుడప్పుడు ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా.. చేపలు పట్టేందుకు తప్పదు అంటారు.. కానీ ఈ యువకులు మాత్రం హ్యాపీగా ఒక్క వల వేయకుండానే కావాల్సినన్ని చేపలు పట్టుకున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారు.

ఇంకా చదవండి ...

  Fish Catching: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు (Heavy Rains) .. జలాశయాలన్నీ కళకళలాడుతున్నాయి.  చెరువులు, కాలువలు అన్నీ జోరుగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే వానలు కురుస్తూనే ఉన్నాయి. ఇలా జోరుగా వానలు కురవడంతో కొంతమంది ఇబ్బంది పడుతుంటే.. మరికొందరు మాత్రం ఆ జోరు వానను ఎంజాయ్ చేస్తున్నారు.. తమకు అనుకూలంగా మార్చుకుని చేపల వేట (Fish Hunting) కు సై అన్నారు. అది కూడా వలలు లేకుండానే కావాల్సినన్ని చేపలను పట్టుకుని.. లొట్టలేసుకుని తిన్నారు. బాపట్ల జిల్లా (Baptla District) లో ఈ వింత చేపల వేట వెలుగు చూసింది. కొరిశెపాడు మండలం దైవరావూరు దగ్గర స్థానికులు.. ఎలాంటి వల సహాయం లేకుండా విచిత్రంగా చేపల వేట కొనసాగించారు.. ఇదే టైం పాస్ కు చేస్తున్న పని కూడా కాదు.. నిజంగానే భారీగానే చేపలు పట్టుకున్నారు. సాధారణంగా చేపలు పట్టాలి అంటే వలో.. గాలమో వేయాలి.. కానీ వీళ్లు మాత్రం ఆ రెండింటి సహాయం లేకుండానే.. ఈజీగా చేపలు పట్టేసుకున్నారు. అది కూడా ఒకటి రెండు కాదు.. కిలోల లెక్కనే చేపలు వీరి బుట్టలో పడ్డాయి..

  కేవలం గొడుగులు, దోమ తెరలతో పోటీలు పడిమరీ చేపలు పట్టారు ఈ యువకులు.. వానా వరదతో పాటు.. చేపలు కూడా వస్తున్నాయంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దైవాలరావూరు యువకులు సందడి తెలిసిన వెంటనే.. చుట్టుపక్కల గ్రామస్తులు సైతం ఈ ఐడియా ఏదో బాగుందే అంటూ ఎగబడ్డారు. ఎవరికి దొరికినంద చేపలను వాళ్లు పట్టుకున్నారు. అయితే వారు ఊహించిన దానికంటే భారీగానే చేపలు పడడంతో.. ఫుల్ ఎంజాయ్  చేశారు.


  ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దైవాలరావూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులో కుప్పలు తెప్పలుగా చేపలు కొట్టుకు రావటంతో జనాలు ఎగబడ్డారు. సమయానికి చేతిలో వలలు లేకున్నా వెంట తెచ్చుకున్న గొడుగులతో చేపలు పడుతూ ఇలా వెరైటీగా చేపలు పట్టారు.

  గుండ్లకమ్మ డ్యాంనుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడంతో దైవాలరావూరు దగ్గర తూర్పువాగుకు వరదనీరు భారీగా వచ్చింది… డ్యాంలో ఉన్న చేపలు కూడా వరదతో పాటు వచ్చాయి. దీంతో తూర్పువాగు చప్టా దగ్గర వాహనాలు ప్రమాదానికి గురికాకుండా రక్షణగా వచ్చిన యువకులు చేపలను చూసి సంబర పడ్డారు.

  ఇదీ చదవండి : చిత్తూరులో రాజకీయం మారుతోందా..? చంద్రబాబు వ్యాఖ్యలతో ఆ ఇద్దరు మంత్రులు డిఫెన్స్‌లో పడ్డారా?

  మొదట అక్కడ భారీగా చేపలు గెంతులు వేయడం చాలామంది గమనించారు. దీంతో వాటిని పట్టుకోవడం ఎలాగా అంటూ ఆలోచనలో ఉండగానే మెరుపులాంటి ఐడియా వచ్చింది… వర్షానికి తడవకుండా ఉండేందుకు తమ వెంట తెచ్చుకున్న గొడులనే వలలుగా చేసి వెరైటీగా చేపలు పట్టారు… ఒక్కో యువకుడు పదికేజీల వరకు చేపలు పట్టుకున్నారు. ఒకవైపు వాన, మరోవైపు ఫ్రీగా వచ్చిన చేపలు అంటూ తెగ సంబరపడ్డారు.

  Published by:Nagabushan Paina
  First published:

  ఉత్తమ కథలు