Hyderabad Cheating Girl: తన పేరు అర్చన అని చెప్పి తరుచూ ఫోన్లో మాట్లాడటంతో పాటు చాటింగ్ చేస్తుండేది. వాట్సాప్ డీపీలో తన ఫోటో కాకుండా.. మరో అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకుంది. దీంతో సుబ్బారెడ్డి ఆమెకు ఆకర్షితుడయ్యాడు.
ఈ రోజుల్లో మోసం(Cheating) ఎలాగైనా చేయవచ్చు. ఎలా చేసినా ఎదుటివారి నుంచి డబ్బులు గుంజడమే వారి టార్గెట్. ఎదుటివారి బలహీనతలు, అవసరాలు ఆసరాగా చేసుకోని అందినకాడికి గుంచేస్తారు. అలా రాంగ్ కాల్ తో పరియచయమైన ఓ యువకుడిని ఓ యువతి అడ్డంగా ముంచేసింది. వలపు వల వేసి అందినకాడికి దోచేసింది. వాట్సాప్ (Whats App) లోనే మనోడికి స్వర్గం చూపిస్తూ రూ.కోట్లలో లాగేసింది. పదినెలల పాటు కనిపించకుండా.. కేవలం చాటింగ్, ఫోన్లో మాట్లాడుతూ అతడ్ని మత్తులో దింపింది. ఆ డబ్బులతో జల్సాలు చేయడం, బావకు గిఫ్టులివ్వడం చేసింది. గుట్టు బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని గుంటూరులో (Guntur District) చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ (Hyderabad) అంబర్‌పేటకు చెందిన ఓ యువతి గత ఏడాది డిసెంబర్లో ఓ నంబర్‌కు ఫోన్ చేయగా గుంటూరుకు చెందిన సుబ్బా రెడ్డి అనే యువకుడికి కాల్ వెళ్లింది. అది రాంగ్ కాల్ అని అతడు చెప్పి పెట్టేయగా మళ్లీ ఫోన్ చేసి మాటలు కలిపింది. తన పేరు అర్చన అని చెప్పి తరుచూ ఫోన్లో మాట్లాడటంతో పాటు చాటింగ్ చేస్తుండేది. వాట్సాప్ డీపీలో తన ఫోటో కాకుండా.. మరో అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకుంది. దీంతో సుబ్బారెడ్డి ఆమెకు ఆకర్షితుడయ్యాడు. నిత్యం అతడికి ఫోన్ చేయడం, వాట్సాప్ లో చాటింగ్ చేస్తూ మత్తెక్కించే మాటలతో అతడ్ని ముగ్గులోకి దిచంచింది.
తాను ఒక ప్రముఖ బ్యూటిషియన్ అని తనకు చాల శాఖలు ఉన్నవి అని తన సంస్థలో పెట్టుబడి పెడితే నీకు ఎక్కువ లాభాలొస్తాయని మెత్తని మాటలతో వలపు వల విసిరింది. ఆలా సుబ్బు వద్ద నుండి విడతల వారి గా రూ.1.20 కోట్లు వసూలు చేసింది. సుబ్బారెడ్డి ఇచ్చిన డబ్బుతో తన ప్రియుడైన అనిల్ కుమార్ తో కలిసి జల్సాలు చేసేదిం. అతడికి బంగారు ఆభరణాలులతో పాటు ఓ కారు కూడా గిఫ్టుగా ఇచ్చింది. అంతేగాక ఈ హనీట్రాప్ ఎపిసోడ్ లో కీలకపాత్ర పోషించిన కుత్బుల్లాపూర్ నివాసి అయిన తన బావ సాయిరామ్ కి కూడా బహుమతులు కొనిచ్చింది.
ఐతే యువతిని కలవాలని సుబ్బారెడ్డి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమె తప్పించుకుంటూ వస్తోంది. ఐతే ఓ రోజు తన డబ్బు తనకు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. దీంతో రివర్స్ అయిన యువతి.. ప్రియుడుతో కలిసి సుబ్బారెడ్డిని చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో ఆమె ఆచూకిని కనుగొన్న సుబ్బారెడ్డి.. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు అర్చనతో పాటు ఆమె ప్రియుడు అనిల్ కుమార్, బావ సాయిరామ్ ను అరెస్ట్ చేశారు. వారి వద్ద కారుతో పాటు సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.