GUNTUR HUSBAND MADE A POLICE COMPLAINT ON WIFE AFTER SHE HAVING EXTRAMARITAL AFFAIR IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Cheating Wife: ప్రేమ పెళ్లి చేసుకున్నవాడ్ని మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది.. మరీ అంత పచ్చి మోసమా..?
ప్రతీకాత్మక చిత్రం
Guntur wife: ప్రేమ అంటే ఎంతో పవిత్రమైనది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎప్పటికీ కలిసుండాలని కోరుకుంటాయి. కొన్నిజంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతుంటాయి. కానీ ఓ యువతి మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడిని దారుణంగా మోసం చేసింది.
ప్రేమ అంటే ఎంతో పవిత్రమైనది. ప్రేమించి పెళ్లి (Love Marriage) చేసుకున్న జంటలు ఎప్పటికీ కలిసుండాలని కోరుకుంటాయి. కొన్నిజంటలు పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతుంటాయి. కానీ ఓ యువతి మాత్రం ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడిని దారుణంగా మోసం చేసింది. ఆమె కోసం కన్నవాళ్లను కూడా వదిలేసిన వచ్చిన భర్తకు అన్యాయం చేసింది. మంచాన పడ్డాడన్న కనికరం కూడా లేకుండా ప్రియుడితో వెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫైనాన్స్ కౌన్సల్టెన్సీ వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. తన టాలెంట్ తో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆమెతో పెళ్లికి అతని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.
దీంతో పెద్దలను ఎదురించి మరీ ఆమె మెడలో తాళికట్టాడు. భార్యతో కలిసి కొత్తకాపురం మొదలుపెట్టాడు. వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప జన్మించింది. ఈ క్రమంలో భార్య తమ్ముడు బావకు చేదోడు వాదోడుగా ఉంటూ వారికి దగ్గరయ్యాడు. తాను బిజినెస్ చేస్తానని పెట్టుబడి కింద రూ.48 లక్షలు ఇవ్వాలని బావను కోరగా.. ష్యూరిటీ ఉండి మరీ అప్పు ఇప్పించాడు. ఆ తర్వాత అప్పుచెల్లించడం మానేయడంతో ఆ భారం అతడిపైనే పడింది.
ఆ ఒత్తిడిలో ఉండగానే పక్షవాతం వచ్చి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో వ్యాపారం కూడా మూలనబడింది. అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతి.. వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతేకాదు మంచాన ఉన్న భర్తను వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తోంది. ప్రేమ పెళ్లి చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా చేరదీయడం మానేశారు. దీంతో అతడు ఒంటరివాడయ్యాడు. షూరిటీగా ఉన్న అప్పు చెల్లించకపోగా, తనకు అన్యాయం చేసి కుమార్తెను తీసుకొని వెళ్లిపోయిన భార్యపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశాదు. తనకు విడాకులు ఇప్పించి తమ కుమార్తెను తనకు ఇప్పించాలని వేడుకున్నాడు. స్పందించిన అధికారులు ఫిర్యాదుపై చర్యలు సంబంధిత ఎస్సైని ఆదేశించారు.
గుంటూరు జిల్లా పొన్నూరులో దాదాపు ఇలాంటి ఘటనే జరిగింది. పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి.. ఎనిమిదేళ్ల క్రితం నెల్లూరు జిల్లా బిట్రగుంటకు చెందిన సోనీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లులున్నారు. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నాగరాజు అదృశ్యమయ్యాడు. ఇంట్లో రక్తపు మరకలు ఉండటంతో భార్యే హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం కోసం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.