Home /News /andhra-pradesh /

Wife and Husband: ఆ పాడుపని చేయవద్దన్నా వినని భార్య.. విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే..!

Wife and Husband: ఆ పాడుపని చేయవద్దన్నా వినని భార్య.. విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Wife And Husband: ప్రేమ. ఎలాంటి వారినైనా ఒక్కటి చేస్తుంది. పెళ్లి ఎంతదూరంగా ఉన్నవారినైనా దగ్గర చేస్తుంది. గతం ఎలా ఉన్నా మన జీవితంలోకి వచ్చిన తర్వాత పద్దతిగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదే జరక్కపోతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటారు.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  ప్రేమ. ఎలాంటి వారినైనా ఒక్కటి చేస్తుంది. పెళ్లి ఎంతదూరంగా ఉన్నవారినైనా దగ్గర చేస్తుంది. గతం ఎలా ఉన్నా మన జీవితంలోకి వచ్చిన తర్వాత పద్దతిగా నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదే జరక్కపోతే మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. వివరాల్లోకి వెళ్తే.. అతడో లారీ క్లీనర్, ఆమె ఒక వేశ్య. లారీపై వెళ్లిన సమయంలోనే ఆమె పరిచయమైంది. వెంటనే ఇష్టపడ్డాడు. నువ్వు ఈ పాడుపని చేయవద్దు.. ఇద్దరం హాయిగా బ్రతుకుదామని మెడలో తాళికట్టి కాపురం చేస్తున్నాడు. కానీ భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) సిరివెల్ల మండలం మహాదేవపురం గ్రామానికి చెందిన పార్ష శ్రీధర్ తొమ్మిదేళ్లుగా లారీ క్లీనర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో లారీపై డ్యూటీకి వెళ్తున్న క్రమంలో గుంటూరు దగ్గర నల్లపాడు వద్ద అర్ధరాత్రి టార్చి లైట్స్ వేస్తూ లారీలు ఆపి కొందరు ఆడవాళ్లు వ్యబిచారం చేసే తిరుమపతమ్మ అనే మహిళ పరిచయమైంది.

  ఆమెను చూసి ఇష్టపడిన శ్రీధర్.. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆమెకు అప్పటికే పెళ్లై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విడిపోయి ఈ వృత్తి చేస్తోంది. ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోయినా వారిని ఎదురించి మరీ తిరుపతమ్మను పెళ్లి చేసుకున్నాడు శ్రీధర్. ఆ తర్వాత ఆమెను తీసుకొని ప్రకాశం జిల్లా కంభంలో కొన్నాళ్లు కాపురమున్నాడు. ఆ తర్వాత బెస్తవారిపేటలో కొంత కాలం ఉన్నాడు. ప్రస్తుతం గిద్దలూరులో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ లారీ క్లీరన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

  ఇది చదవండి: కిటికీలో చేయిపెట్టి దోచేస్తాడు.. ఈ దొంగ రూటే సపరేటు..!  ఐతే భర్త డ్యూటీకి వెళ్లి 10-15 రోజులకు ఇంటికి వచ్చేవాడు. దీన్నే అదునుగా చేసుకున్న భార్య తిరుపతమ్మ మళ్లీ పాత వృత్తిని కొనసాగించడం మొదలుపెట్టింది. పుట్టింటికి వెళ్తున్నానని భర్తతో అబద్ధం చెప్పి ఆ పని చేస్తుండేది. విషయం తెలిసిన శ్రీధర్.. మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె లెక్కచేయకపోవడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.

  ఇది చదవండి: ప్రియుడి కోసం యువకుడి ఆందోళన... దుబాయ్ లో తెలుగు యువకుల పెళ్లి... ఏపీలో రచ్చ రచ్చ...!  రెండు రోజుల క్రితం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర గ్రహానికి గరైన శ్రీధర్.. ఇంట్లోని నాన్ స్టిక్ పాన్ తీసుకొని భార్య తలపై కొట్టాడు. పెనం హ్యాండిల్ తో ఆమె గొంతులో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. గతాన్ని మర్చిపోవాలని ఎంత చెప్పినా వినకుండా తన పరువు తీస్తున్నందునే భార్యను అంతమొందించినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు.

  మీ నగరం నుండి (​గుంటూరు)

  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  ఆంధ్రప్రదేశ్
  ​గుంటూరు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Husband kill wife

  తదుపరి వార్తలు