హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Moving House: తక్కువ స్థలం.. అతి తక్కువ ఖర్చు.. కదిలే ఇళ్లకు ఫుల్ డిమాండ్.. బడ్జెట్ ఎంతంటే?

Moving House: తక్కువ స్థలం.. అతి తక్కువ ఖర్చు.. కదిలే ఇళ్లకు ఫుల్ డిమాండ్.. బడ్జెట్ ఎంతంటే?

కదిలే ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

కదిలే ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్

Moving House: చిన్న స్థలం ఉంటే చాలు.. అతి తక్కువ ఖర్చునే ఇళ్లు.. అది కూడా ఎక్కడైనా కావాలి అంటే మూవ్ చేయొచ్చు.. ప్రస్తుతం ఇలాంటి ఇళ్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది.. అంధ్రప్రదేశ్ లోనూ వీటికి డిమాండ్ ఎక్కువ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati

సాధారణంగా ఇటీవల కాలంలో ఎక్కువగా కదిలే కార్యాలయాలు (Moving Office) కనిపిస్తూ ఉంటాయి. తాత్కాలిక  కార్యాలయాలు కావాల్సిన వారు డబ్బాల్లింటివి ఏర్పాటు చేసుకుని వారి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు.  మూడు నుంచి  సంవత్సరం పాటు వారి పని పూర్తి కాగానే అక్కడ నుంచి ఆ కార్యాలయాలు తరలిస్తూ ఉంటారు. వారికి ఎక్కడ పని ఉంటే అక్కడకు కార్యాలయాలు తరలిస్తూ ఉంటారు.  తాజాగా తాత్కాళిక ఇళ్లకు కావాల్సిన వారికి కూడా పలు కంపెనీలు రెడీమేడ్ మూవబుల్ ఇళ్లు తయారు చేసి అమ్ముతున్నాయి. తక్కువ స్థలంలో ఇళ్ల నిర్మాణం (House Construction) చేయాలంటే లక్షల్లో ఖర్చవుతుంది. కానీ రెడీమేడ్ ఇళ్ల (Readymade House) కారణంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు తయారీ దారులు. అన్ని రకాల వాతావరణాలను తట్టుకుంటాయి మూవబుల్ రెడీమేడ్ ఇళ్లను చుట్టూ స్టీల్ తో బాడీ తయారు చేస్తారు.

ఇప్పటి వరకు చిన్న దుకాణాలు, రెడీమేడ్ కార్యాలయాలకు పరిమితమైన నిర్మాణాలు నివాస యోగ్యమైన ఇళ్లుగా మారుస్తున్నారు. గుంటూరు విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ మూవబుల్ ఇళ్లను తయారు చేస్తున్నారు. పడక గది, వంట గది , టాయిలెట్లు, హాల్ ఇలా 200 అడుగుల నుంచి 360 చదరపు అడుగుల వరకు తయారు చేస్తున్నారు.

సుమారు 2.5 నుంచి 4 లక్షల వరకు ఖర్చవుతుంది. లోపలి భాగం ర్యాక్ ఊల్ ఫ్లైవుడ్ తో తయారు చేస్తారు. దీని కారణంగా వేడి తగ్గుతుంది. శబ్దాలను కూడా నియంత్రిస్తుంది. అగ్ని ప్రమాదాల నుంచి కూడా బయట వైపు ఉండే స్టీల్ బాడీ రక్షణ కల్పిస్తుంది.  ఇల్లు, కార్యాలయం ఇక అవసరం లేదనుకున్నప్పుడు 70 శాతం ధరకు కంపెనీ వారే తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి : మరో అంతర్జాతీయ సదస్సుకు సర్వం సిద్ధం..40 దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు హాజరు..

సిమెంటుతో నిర్మించిన వాటికి రెడీమేడ్ కు ఏమిటి తేడా?

సిమెంటు, ఇసుక, ఇటుక, స్టీల్ తో చేసే ఇంటి నిర్మాణాలను మరో ప్రాంతానికి తరలించడం సాధ్యం కాదు. ఒకసారి నిర్మిస్తే అందులో మార్పులు చేయాలన్నా భారీగా ఖర్చు  చేయాల్సి ఉంటుంది. అదే రెడీమేడ్ ఇళ్లు అయితే ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించవచ్చు. రీసేల్ వాల్యు కూడా ఉంటుంది. అదే సాంప్రదాయ పద్దతిలో నిర్మించిన ఇంటికి అంతా రీసేల్ వ్యాల్యూ ఉండదు.

ఇదీ చదవండి : తెలుగు రాష్ట్రాల్లో వైరస్ డేంజర్ బెల్స్.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?

చిన్న గదులకు అనుకూలం

పొలాల్లో, తోటల్లో, ఫార్మ్ హౌసెస్ కావాల్సిన వారు ఇలాంటి రెడీమేడ్ ఇళ్లను ఆశ్రయించవచ్చు. ఇప్పటికే తయారు చేసిన వాటిని వెంటనే కొనుగోలు చేసి తీసుకెళ్ల వచ్చు. లేదంటే మనకు ఏ కొలతల్లో కావాలో ఆర్డర్ చేస్తే వారం రోజుల్లో తయారు చేసి డెలివరీ ఇస్తారు. రోడ్డు పక్క చిన్న దుకాణాలు నడుపుకునే వారికి కూడా ఈ రెడీమేడ్ ఇళ్లు చాలా అనుకూలంగా ఉంటాయి. తాత్కాలిక కార్యాలయాలకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Guntur, House

ఉత్తమ కథలు