హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Honor Killing: ఆ అమ్మాయిని ప్రేమించడమే ఈ కుర్రాడు చేసిన తప్పు... మరీ అంత కిరాతకమా..?

Honor Killing: ఆ అమ్మాయిని ప్రేమించడమే ఈ కుర్రాడు చేసిన తప్పు... మరీ అంత కిరాతకమా..?

మృతుడు గోపీ (ఫైల్)

మృతుడు గోపీ (ఫైల్)

Lovers: పెద్దల సమక్షంలో విడిపోతున్నట్లు చెప్పినా.. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఎవరికి తెలియకుండా చాటుమాటుగా కలుస్తుండేవారు. ఈ విషయం తెలిసిన మల్లయ్య.. గోపిని చంపేయాలని భావించాడు.

  పిల్లలు ప్రేమించుకోవడం.. పెద్దవాళ్లు దానిని వ్యతిరేకించడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కుమార్తెపై ప్రతి తండ్రికి ప్రేమ ఉంటుంది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి.. అదే కుమార్తె వేరొకర్ని ప్రేమిస్తే తట్టుకోలేడు. అలా ప్రేమించిన కుమార్తెను అదుపులో పెట్టుకోలేని ఆ తండ్రి.. కులం కోసం అమాయకుడైన యువకుడ్ని పొట్టనబెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur District) వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన బండారు ఫణిగోపి రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీ కోసం గాలించిన పోలీసులకు కాలువలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన నిజాలు తెలిశాయి. ప్రేమ వ్యవహారంమే హత్యకు కారణంగా తేల్చారు. పరువు కోసమే అతడ్ని చంపినట్లు వెల్లడైంది.

  ప్రాణం తీసిన ప్రేమ..

  వట్టిచెరుకూరు మండలం పల్లపాడుకు చెందిన బండారు ఫణి గోపి అదే గ్రామానికి చెందిన ఒక యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ల ప్రేమ వ్యవహారం తెలిసిన యువతి తల్లిదండ్రులు పెళ్లిచేసేది లేదని వారించారు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో గోపీ, యువతి కలిసి మూడు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. భద్రాచలం వెళ్లి పెళ్లి చేసుకోవాలని భావించి అక్కడి పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా ఇద్దరి వివరాలు తెలిశాయి. ఇద్దరూ మైనర్లు కావడంతో భద్రాచలం పోలీసులు.. వట్టిచెరుకూరు పోలీసులకు సమాచారం అందించి ప్రేమజంటను స్వగ్రామానికి తీసుకొచ్చారు. పోలీసులతో పాటు గ్రామపెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఇద్దరూ ఒకర్నొకరు మర్చిపోవాలని పెళ్లి చేయడం కుదరదని యువతి తండ్రి మల్లయ్య స్పష్టం చేశాడు. దీంతో ఎవరింటికి వారు వెళ్లిపోయి ఉంటున్నారు.

  ఇది చదవండి: పద్ధతి మార్చుకోమంటే ఇంత దారుణానికి ఒడిగడతావా..? నీకు చేతులెలా వచ్చాయి తల్లీ..


  చెప్పినా వినకపోవడంతో మర్డర్ స్కెచ్..

  పెద్దల సమక్షంలో విడిపోతున్నట్లు చెప్పినా.. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోయారు. ఎవరికి తెలియకుండా చాటుమాటుగా కలుస్తుండేవారు. ఈ విషయం తెలిసిన మల్లయ్య.. గోపిని చంపేయాలని భావించాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న మల్లయ్య... తన సామాజికవర్గానికి చెందిన గోపీ మిత్రులకు డబ్బు ఇస్తానని ఆశచూపి గోపీని తీసుకురావాలని చెప్పాడు. అలాగే అతడి బావమరిది అప్పరావుతో కలిసి మర్డర్ స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో ఆదావారం రాత్రి 10గంటల సమయంలో వల్లపు సాంబయ్య, గంజి శ్రీకాంత్, గుండాల ప్రవీణ్ కలిసి గోపీని పని ఉందని తీసుకెళ్లారు. ఊరిచివర కాపుకాసిన మల్లయ్య.. గోపీని కర్రలు, బరిసెలతో దాడి చేసి హత్య చేశారు.

  ఇది చదవండి: ప్రియురాళ్ల మోజులో తండ్రి... ఆస్తిని తగలేస్తున్నాడన్న కోపంతో కొడుకు ఏం చేశాడంటే..!  అనంతరం మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి కాలువలో పడేశారు. సోమవారం ఉదయం గోపీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గోపీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గోపీని అన్యాయంగా పొట్టనబెట్టుకున్న మల్లయ్యతో పాటు అతడికి సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కుమారుడ్ని అన్యాయంగా చంపేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గోపి తల్లిదండ్రులు పోలీసులను వేడుకుంటున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Guntur, Honor Killing, Lovers

  ఉత్తమ కథలు