హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nakka Ananda Babu: టీడీపీ మాజీ మంత్రి ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా.. అసలేం జరిగిందంటే..

Nakka Ananda Babu: టీడీపీ మాజీ మంత్రి ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా.. అసలేం జరిగిందంటే..

నక్కా ఆనంద్ బాబు( Image: Facebook)

నక్కా ఆనంద్ బాబు( Image: Facebook)

టీడీపీ మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గంజాయి అంశంపై మీడియా ఎదుట ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలని ఆయనను రాత్రి సమయంలో విశాఖపట్నం నుంచి గుంటూరులోని నక్కా నివాసానికి వెళ్లిన పోలీసులు ప్రశ్నించారు.

ఇంకా చదవండి ...

గుంటూరు: టీడీపీ మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబు ఇంటి వద్ద అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గంజాయి అంశంపై మీడియా ఎదుట ఏ ఆధారాలతో మాట్లాడారో చెప్పాలని ఆయనను రాత్రి సమయంలో విశాఖపట్నం నుంచి గుంటూరులోని నక్కా నివాసానికి వెళ్లిన పోలీసులు ప్రశ్నించారు. ఆయనకు నోటీసులు ఇచ్చారు. స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకుంటామని నక్కాను కోరారు. మీడియా సమావేశంలో నిలదీసినందుకు తనకు నోటీసులు ఇవ్వడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పోలీసుల తీరుపై నక్కా ఆనంద బాబు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నక్కా ఇంటికి పోలీసులు వచ్చారన్న సమాచారం తెలియగానే.. గుంటూరులోని వసంతరాయపురంలోని ఆయన ఇంటికి టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖలో గంజాయి రవాణాపై ప్రశ్నించినందుకు నక్కా గొంతు నొక్కాలని చూడటం సమంజసం కాదని జిల్లా టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, ఆలపాటి రాజా మండిపడ్డారు. ప్రశ్నించిన ప్రతీ ఒక్కరిని ఇబ్బంది పెట్టేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, అందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ప్రస్తుత డీజీపీ సహకరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు ఇలానే పని చేశారా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.


ఇది కూడా చదవండి: Chandrababuకు భారీ షాక్ -ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్ గుడ్ బై! -BJPలో TDP పీపీ విలీనం!

గతంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా డ్రగ్స్ గురించి నిలదీసినందుకు కాకినాడ పోలీసులు ఇదే తరహాలో నోటీసులు ఇచ్చారని టీడీపీ నేతలు గుర్తుచేశారు. దాదాపు 15 మందికి పైగా పోలీసులు నక్కా ఆనందబాబు ఇంటికి రావడంతో ఆయన ఇంటి వద్ద అర్ధరాత్రి సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు పోలీసులకు వాగ్వాదానికి దిగారు. సీఎం జగన్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. పోలీసులు నక్కా ఆనందబాబును అరెస్ట్ చేయడానికి వచ్చారనే ప్రచారం కూడా జరిగింది. ఎట్టకేలకు నర్సీపట్నం పోలీసులు ఆయన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది.

First published:

Tags: AP News, AP Politics, Cm jagan, TDP, Ysrcp

ఉత్తమ కథలు