GUNTUR HERE ARE THE TIPS FOR ICET CANDIDATES TO GET GOOD SCORE FROM EDUCATION EXPERTS FROM GUNTUR FULL DETAILS HERE PRN GSU NJ
AP ICET-2022: ఈ షార్ట్‌కట్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి ర్యాంకు మీకే..! మోర్ ప్రాక్టీస్..మోర్ మార్క్స్..!
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జరగనున్న ఐసెట్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. తక్కువ సమయం ఉండటంతో పక్కా ప్రణాళికలు వేసుకుంటూ చదువుకుంటున్నారు. అయితే ఇప్పుడు వేసుకునే ప్రణాళికల కన్నా.., ఎగ్జామ్ హాల్ లో ఫస్ట్ ఏ కేటగిరి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జరగనున్న ఐసెట్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు తీవ్రంగా కష్టపడుతున్నారు. తక్కువ సమయం ఉండటంతో పక్కా ప్రణాళికలు వేసుకుంటూ చదువుకుంటున్నారు. అయితే ఇప్పుడు వేసుకునే ప్రణాళికల కన్నా.., ఎగ్జామ్ హాల్ లో ఫస్ట్ ఏ కేటగిరి ప్రశ్నలకు సమాధానాలు రాయాలి? అనేదానిపైనే వారి సమయస్ఫూర్తి ఆధారపడి ఉంటుంది అంటున్నారు గుంటూరు (Guntur) మహాత్మా గాంధీ వైస్ ప్రిన్సిపల్ స్వప్న. ఏపీఎంసెట్ పరీక్ష పేపర్ మూడు కేటగిరీలను కవర్ చేసేలా ఉంటుంది. ఆ మూడు సెక్షన్స్ కలిపి 200 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది. మొదటి సెక్షన్లో కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 మార్కులకు 70 ప్రశ్నలు... రెండవ సెక్షన్లో ఎనలిటికల్ ఎబిలిటీ 75 మార్కులకు 75 ప్రశ్నలు... మూడవ సెక్షన్లో మ్యాథమేటికల్ ఎబిలిటీ 55 మార్కులకు 55 ప్రశ్నలు ఉంటాయి. ఈ మొత్తం 200 మార్కుల ప్రశ్నాపత్రాన్ని రెండున్నర గంటలు వ్యవధికాలంలో పూర్తి చేయాలి.
అర్థమెటిక్స్, రీజనింగ్‌పై ప్రత్యేక దృష్టి:
ఏపీఐసెట్ (APICET) పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి అంటే అర్ధమేటిక్స్ &రెజైనింగ్ (Arithmetic and reasoning) పైన ప్రత్యేక దృష్టి సారించాలి. మేథమెటిక్స్‌లో బేసిక్స్ మరియు షాట్ కట్స్ విధానంపైన దృష్టిపెట్టి ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ హాల్ (Exam Hall) లో టైం సేవ్ (Time save) అవుతుంది. సమయం ఎక్కువగా తీసుకునే కమ్యూనికేషన్ ఎబిలిటీ సబ్జెక్ట్ ను పరీక్షలో చివర్లో రాస్తే మంచిదని సలహా ఇస్తున్నారు స్వప్న.
ఐసెట్ పరీక్షకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు
ఐఎసెట్ పరీక్షకు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు.., కనుక మొదటి 5 నిముషాల్లో క్వశ్చన్ పేపర్‌ను పూర్తిగా చదివి..క్విక్ ఆన్సర్స్ (Quick answers) ను మార్క్ చేసుకోవాలంటున్నారు వైస్ ప్రిన్సిపల్ స్వప్న. ఇలా చేయడం వల్ల ఏ ప్రశ్నలకు ఎంత టైం కేటాయించాలి అన్న విషయం విద్యార్థులకు అర్ధం అవుతుందంటున్నారు. మీకు వచ్చిన సమాధానాలు అన్ని పూర్తి చేసిన తర్వాతే.. మిగిలన వాటికి ఆన్సర్స్ రాస్తే అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుందంటున్నారు.
ఆఖరి 15 నిమిషాలు అత్యంత కీలకం
సాధ్యమైనంతలో ఆఖరి 15 నిమిషాలు ..తప్పులు సరిదిద్దుకోవటంలో కేటాయించాలంటున్నారు. పరీక్షకు ముందు ఎలాంటి కొత్త టాపిక్స్ జోలికి వెళ్ళకూడదంటున్నారు సీనియర్ ఫ్యాకల్టీ స్వప్న. బేసిక్ మ్యాథమెటిక్స్ మీద షార్ట్‌కట్స్ ఎక్కువగా నేర్చుకోవాలంటున్నారు. ముఖ్యంగా ఓల్డ్ పేపర్స్ రివిజన్ బాగా సహాయపడుతుందన్నారు. టైమర్ సెట్ చేసుకొని పాత పేపర్స్ పైన ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ లో సులువుగా ఉంటుందని గుంటూరు మహాత్మా గాంధీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ స్వప్న న్యూస్18కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.