GUNTUR HERE ARE THE SENSATIONAL FACTS BEHIND WOMAN MURDER CASE IN GUNTUR DISTRICT OF ANDHRA PRADESH PRN GNT
Guntur Woman: ఒకరు తర్వాత ఒకరితో ఎఫైర్.. ఇద్దరూ కలిసి ఆమెను ఏం చేశారంటే..!
ప్రతీకాత్మక చిత్రం
Affair: ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు, విదేశాల్లో మాదిరిగా వేరొకరితో సహజీవనం చేయడం వంటివి సర్వసాధారణమవుతున్నాయి. ఇలాంటి సంబంధాలు తొలుత చక్కగానే మొదలవుతాయి. రానురాను చిన్నమాట తేడా వచ్చినా ఊహించని పరిమాలకు దారితీస్తాయి.
ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు, విదేశాల్లో మాదిరిగా వేరొకరితో సహజీవనం చేయడం వంటివి సర్వసాధారణమవుతున్నాయి. ఇలాంటి సంబంధాలు తొలుత చక్కగానే మొదలవుతాయి. రానురాను చిన్నమాట తేడా వచ్చినా ఊహించని పరిమాలకు దారితీస్తాయి. భర్త దూరమైన ఓ మహిళ.. మరో పెళ్లి చేసుకొని హాయిగా జీవించాల్సింది పోయి క్షణిక సుఖాల కోసం పరాయి పురుషుల మోజులో పడింది. ఒకరి తర్వాత ఒకరితో సీక్రెట్ ఎఫైర్స్ కొనసాగించింది. వారితో సహజీవనం కూడా చేసింది. ఐతే కొన్నాళ్లపాటు వ్యవహారమంతా గుట్టుగాసాగింది. కానీ ప్రియురాలిపై ప్రియులిద్దరికీ రేగిన అనుమానం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుఖం కోసం అలవాటు పడిన బంధాలు చివరికి ఆమె ప్రాణం తీశాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా(Guntur District) లో చోటుచేసుకుందీ ఘటన.
వివరాల్లోకి వెళ్తే.. కొల్లూరు మండలం చిలుమూరు కు చెందిన రూపశ్రీకి 14 ఏళ్ల క్రితం క్రితం చుండూరు మండలం మందురుకు చెందిన కరుకట్ల రవి కుమార్ తో వివాహం జరిగింది. వారికి కొడుకు, కూతురు ఉన్నారు. ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో అనుకోని కుదుపు. ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త రవికుమార్ చనిపోయాడు. అప్పటి నుంచి రూపశ్రీ పుట్టింటిలోనే ఉంటోంది. ఈ క్రమంలో తెనాలి మండలం నేలపాడు గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి.. అక్కడి నుంచి సహజీవనానికి దారితీసింది. ఏడాది పాటు వీరి వ్యవహారం కొనసాగగా.. రూపశ్రీ తండ్రి అనిల్ మందలించడంతో ప్రవీణ్ ని దూరం పెట్టింది.
ఈ క్రమంలో రూపశ్రీ, ప్రవీణ్ ను కలపడానికి అతడి మిత్రుడు రవికుమార్ ఎంటర్ అయ్యాడు. అంతేకాదు ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొంతకాలానికి అతడ్ని కూడా దూరం పెట్టింది. ఐతే తమ ఇద్దర్నీ కాదని మరొకరితో రూపశ్రీ ఎఫైర్ పెట్టుకుందని ప్రవీణ్, రవి కుమార్ భావించారు. ఆమెపై కక్ష పెంచుకొని హతమార్చాలని స్కెచ్ వేశారు.
సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు స్నేహితులు.. రూపశ్రీ చిలమూరు లంక పొలాల్లో పనికి వెళ్లిన సంగతి తెలుసుకున్నారు. ఇద్దరూ బైక్ పై ఆమెను ఫాలో అయి పని చేస్తుండగా కత్తితో ఎటాక్ చేశారు. ఆమెను విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్య చేశారు. సాటి కూలీల ద్వారా విషయం తెలుసుకున్న బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారం రోజుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అక్రమ సంబంధాల మోజులో ఇద్దరితో వ్యవహారం నడిపిన రూపశ్రీ తిరిగి వారికే బలైంది. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు ఒంటరివాళ్లయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.