ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు జిల్లా తాడేపల్లి గ్యాంగ్ రేప్ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఘటన జరిగిన 50 రోజుల తర్వాత పోలీసులు ప్రధాన నిందితుడు శేరు కృష్ణకిషోర్, మూడో నిందితుడు షేక్ హబీబ్ ను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు వెంకట ప్రసన్న రెడ్డి పరారీలో ఉన్నాడు. అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన కృష్ణకిషోర్ సీలింగ్ వేసే పనులు చేస్తుంటాడు. ఇతనికి మహానాడుకు చెందిన వెంకట ప్రసన్నరెడ్డితో పరిచయఉంది. ఇద్దరూ పనులు లేని సమయంలో రైల్వే ట్రాక్ లపై రాగితీగలను దొంగిలిస్తూ వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారు. ఈ క్రమంలో జూన్ 19న రాత్రి విజయవాడకు చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐతే ఈ ఘటన జరగడానికి గంటన్నర ముందు రైల్వే ట్రాక్ పై రాగితీగలు దొంగిలించారు. అదే సమయంలో రైల్లో శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి అటుగా వచ్చాడు.
దొంగతనం విషయం పోలీసులకు చెప్తాడన్న భయంతో అతడి కాళ్లు చేతులు కట్టేసి మెడకు రాగితీగ బింగించి చంపేశారు. మృతదేహాన్ని కృష్ణానదిలో పడేశారు. ఆ తర్వాత సీతానగరం ఇసుక తెన్నెలపై యువ జంటను చూశారు. అప్పటికే మద్యం తాగిన ఇద్దరు వారిని బ్లేడ్లతో బెదిరించారు. చంపేస్తామని బెదిరించి యువతిపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. వారి దగ్గర బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు లాక్కొని పడవలో విజయవాడ వైపు పారిపోయారు. రాత్రికి రాణిగారితోట వద్ద కృష్ణానది ఒడ్డున నిద్రించి తర్వాతి రోజు తాడేపల్లి వచ్చి సెల్ ఫోన్లను షేక్ హబీబ్ వద్ద తాకట్టుపెట్టారు.
ఆ తర్వాత పోలీసుల భయంతో ఇద్దరూ ఒంగోలు పారిపోయి రోజంతా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. కృష్ణ ట్రైన్ ఎక్క కర్ణాటకలోని హుబ్లీకి వెళ్లాడు. అక్కడి నుంచి తెలంగాణలోని నిర్మల్, బైసా వెళ్లీ రెండు వారాలు కూలిపనులు చేశాడు. ఆ తర్వాత సికింద్రాబాద్ కు మకాం మార్చి రైలు పట్టాలపై ప్లాస్టిక్ బాళ్లు ఏరుకుంటూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో మద్యం తాగేవాడు. కొన్ని రోజులు క్యాటరింగ్ పనులు కూడా చేశాడు. అక్కడే సాయిబాబా గుడిలో తలదాచుకున్నాడు.
చివరికి తల్లిని చూసేందుకు తాడేపల్లి రావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల కోసం పోలీసులు చిత్తుకాగితాలు ఏరుకునేవారిలా, సమోసాలు అమ్ముకునేవారిలో మారు వేషాల్లో గాలించారు. మరో నిందితుడు ప్రసన్న రెడ్డి పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడ్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.